For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చక్కటి ముఖ ఆకృతికి ఆకర్షించే కనుబొమ్మలు...!

|

Seven Tips for Beautiful Eyebrows..
స్త్రీ ముఖారావిందంలో ప్రతి యొక్క ముఖభాగమూ కళ్ళు, ముక్క, పెదాలు, బుగ్గలు, ఐబ్రోస్, చెవులు ఇలా అన్ని భాగాలు వేటికవి అందాన్ని రెట్టింపు చేసేవే. టీనేజ్ అమ్మాయిల దగ్గర నుండి మధ్య వయస్సు మహిలళ వరకూ తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడంలో నానా కష్టాలు పడుతుంటారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే లేటెస్ట్ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని వినియోగించి తమ అందాన్ని రెట్టింపు చేసుకొంటుంటారు. మహిళలు ఇప్పుడు ఎక్కువగా ఐబ్రో చేయించుకొని తమ కళ్ళు ఆకృతిని ఆకర్షనీయంగా ఆకట్టుకొనేలా తీర్చి దిద్దుకొంటున్నారు. అందమైన, దట్టంగా కనిపించే కనుబొమ్మలు మీ ముఖ సౌందర్యాన్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి మీ కనుబొమ్మలు అందంగా... ఆకర్షణీయంగా కనబడాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. అవేంటో తెలుసుకొందాం...

1. ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలంటే ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలోనే చేసుకోవాలి. ఎందుకంటే ఐబ్రోస్ చేసుకోవడం వల్ల కళ్ళు ఉబ్బుకొని ఉండటం. ఎర్రబడటం వంటివి జరగుతుంటాయి. రాత్రిపూట ఐబ్రోస్ చేసుకోవడం వల్ల, ఐబ్రో చేయించుకొని నిద్రపోవడం వల్ల కళ్ళకు ప్రశాంతత ఏర్పడి కళ్ళు పునారావస్తకు చేరుకొని ఎరుపుదనం పోగొట్టి కళ్ళు ఫ్రెష్ గా అందంగా కనబడుతాయి.

2. ఐబ్రో ఇంట్లోనే తీసుకొనేట్లైతే అందుకు అంచులు మొనదేలి షార్ప్ గా ఉన్న ఫ్లక్కర్(పట్టకార్ర)ను ఉపయోగించి, మీ కనుబొమ్మను మీకు కావాల్సిన ఆకృతిలో తీర్చిదిద్దుకోవచ్చు. మొదట కనుబొమ్మలకు టాల్కమ్ పౌడర్ ను రాసి, దువ్వెనతో దువ్వుకొని తర్వాత ఫ్లక్కర్ ను ఉపయోగించాలి.

3. ఒక చేత్తో కనుబొమ్మను అదిమి పట్టుకొని మరో చేత్తో ఫ్లక్కర్ ఉపయోగించి ఎక్స్ ట్రాగా ఉన్న ఐబ్రో హెయిర్ ను తొలగించుకోవాలి.

4. కళ్ళు మీద వెంట్రుకలను తొలగించేటప్పుడు కళ్ళను తప్పనిసరిగా మూసుకోవాలి.

5. ఐబ్రోలను ఎక్కువగా తీయకూడదు. తర్వాత ఐబ్రోస్ కు వేసుకొనే ఐబ్రో షేడ్ ను హెయిర్ కలర్ కు మ్యాచ్ అయ్యే విధంగా సెలక్ట్ చేసుకోవాలి.

6. ఐబ్రోస్ షేప్ కు పెన్సిల్ ను ఉపయోగించేటట్లైతే మంచి షేప్ ను తీర్చి దిద్దుకోవచ్చు. ఐబ్రో పెన్సిల్ ను షార్స్ చేసుకొని ఐబ్రో మొదట నుండి చివరి వరకూ లోపలి బాగం నుండి పై చివరి భాగం వరకూ పెన్సిల్ తో ఔట్ షేప్ ను గీసుకోవాలి.

7. తర్వాత బ్రష్ తో కలర్ ను అప్లై చేసుకోవాలి. తర్వాత ఐబ్రోలకు హెయిర్ జెల్ అప్లై చేసి, హెయిర్ బ్రెష్ తో ఐబ్రోలను దువ్వుకోవాలి. అప్పుడే చక్కటి ఐబ్రో ఆకృతి మీ సొంతం అవుతుంది.

English summary

Seven Tips for Beautiful Eyebrows.. | బ్యూటిఫుల్ ఐబ్రో టిప్స్...

Tips for Beautiful Eyebrows are more important for every one. Eyebrows add strength and meaning to your face. Fine groomed eyebrows add to your beauty. There are some ways to get beautiful eyebrows.
Story first published:Monday, August 6, 2012, 16:19 [IST]
Desktop Bottom Promotion