Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
పెదవికి ఎంత ప్రాధాన్యమో...పాదానికీ అంతే...!

శీరరంలోని అన్ని భాగాలకన్నా పాదాలే ఎక్కువ నిరాదరణకు గురవుతున్నాయని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. చూడటానికి చిన్నగా కనిపించే వీటి మీదే వాస్తవానికి భారం ఎక్కువ పడుతుంది. శరీరం బరువునంతటినీ భరించే ఈ పాదాల ప్రమేయం లేకుండా సాగదు. కూర్చోవాలన్నా, నడవాలన్నా, పరిగెత్తాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా పాదాలకే ప్రథమ స్థానం. మరి ఇంత పని చేస్తున్న పాదాల మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం అన్నది జవాబులేని ప్రశ్న.
ప్రతి వ్యక్తి రోజుకి ఎనిమిదివేల నుంచి పదివేల అడుగులు వేస్తాడని ఒక అంచనా. క్రీడాకారులు, డ్యాన్సర్లు ఇంకా ఎక్కువ అడుగులు వేస్తారు. రోజు మొత్తం మీద ఇంత భారం మోసే పాదాల పట్ల కాసింత జాగ్రత్త అవసరం కాదంటరా? పాదాల కోసం బ్యూటీ పార్లర్లకి వెళ్లనక్కర్లేదు. వేలు ఖర్చు చేసి సౌందర్య సాధనాలు కొనుగోలు చేయనక్కర్లేదు. ఇంట్లో వుండే వాటిని జాగ్రత్తగా పరిరక్షించుకోవచ్చు. అవి ఎలాగంటే.....
1. ప్రతి రోజూ కనీసం పావు గంట పాటు పాదాలను గోరువెచ్చని నీటిలో వుంచాలి. తరువాత మొత్తని బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఆ తరువాతా ఏదైనా క్రీమ్ లాంటి వాటితో సున్నితంగా మర్ధనా చేయాలి.
2. కాలి వేళ్ల మధ్య తేమ ఎక్కువ సేపు వుండకుండా జాగ్రత్త పడండి తేమ వల్ల ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాలి వేళ్ల మధ్య జీవం కోల్పోయిన చర్మం కనిపిస్తే దానికి వెంటనే తీసివేయండి
3. రాత్రి పడుకోబోయే ముందు పాదాలకు పేరిన నెయ్యి లేదా వెన్న రాసుకొని తెల్లవారి గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ విధంగా కొన్ని రోజలు పాటు చేసుకుంటే పాదాల అందం రెట్టింపు అవుతుంది.
4. చేతివేళ్లకు తీసుకున్న శ్రద్ద కాలి గోళ్ల మీద తీసుకోరు. వాటిని కూడా అందంగా ట్రిమ్ చేసుకొని నెయిల్ పాలిష్ వేసుకుంటే చూడడానికి అందంగా, శుభ్రంగా వుంటాయి.
5. పాదాలకు మసాజ్ మీ అంతట మీరు చేసుకునే కన్నా వేరే వారితో చేయించుకుంటే బాగుంటుంది.
6. కాలాన్ని బట్టి చలికాలం, ఎండకాలం పాదాల పగుళ్లు ఎక్కువగా వుంటాయి. ఇలాంటి సమయాలలోనే మసాజ్ అవసరం ఎక్కువ. మసాజ్ ను రోజులో ఒకటి రెండు సార్లు చేసుకుంటే బాగుంటుంది. మసాజ్ ను చేసుకున్న తర్వాత పాదాలను కదల్చకుండా వుంటే మంచిది. రాత్రి పడుకోబోయే ముందు, మధ్యాహ్నం అనువైన సమయం.
7. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు సాక్స్ ధరించడం తప్పనిసరి. ఎండ వేడిమికి పాదా త్వరగా ప్రతిస్పందిస్తాయి.
8. బిగుతుగా వుండే పాదరక్షలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కొద్దిగా వదులుగా ఉండే వాటినే ఎంపికచేసుకోవాలి. బిగుతుగా వుండేవి చమటను ఎక్కువ పట్టిస్తాయి. చమట వల్ల ఇన్ ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి.
9. అనాసపండు ముక్కలు పాదాల పగుళ్లకు చాలా బాగా పనిచేస్తాయి. వీటి ముక్కలను పగుళ్ల మీద ఉంచి శుభ్రమైన బట్టతో రాత్రంతా కట్టి వుంచి తెల్లవారి గోరువెచ్చని నీటితో పాదాలను కడుక్కోవాలి. ఈ విధంగా కొన్ని వారాల పాటు చేసినట్టయితే పగుళ్లు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
10. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, పెరాక్సైడ్ కలిపి అందులో కొద్దిసేపు రెండు కాళ్లను పాదాలు మునిగే వరకూ వుంచి కొద్ది సేపటి తర్వాత తీసేసి పొడి బట్టతో శుభ్రం చేసుకొంటే చక్కటి సువాసనతో పాటు మంచి ఫలితం కూడా బాగుంటుంది.



Click it and Unblock the Notifications