Latest Updates
-
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం!
రోజంతా ఉల్లాసంగా...ఉత్సాహంగా...

ఒక కప్పు వేడి నీటిలో ఒక నిమ్మకాయను పిండి, అల్లం రసాన్ని కలుపుకుని రోజూ నిద్రలేవగానే తాగండి. అది మనలోని అనేక వ్యవస్థలను శుభ్రపరుస్తుంది. అలాగే రోజూ నిద్ర లేవగానే ఐదు నిమిషాల పాటు గాఢంగా శ్వాస తీసుకోవాలి. ప్రయత్నపూర్వకంగా యోగా చేయలేనివారికి, కొంతకాలం యోగా చేసి ఆపేసిన వారికీ ఇలా గాఢంగా శ్వాస తీసుకోవడం ఉపయోగపడుతుంది.
ఉదయం నిద్ర లేవగానే శరీరాన్ని మర్ధన చేసుకున్నటైతే చర్మానికి రక్తప్రసరణ పెరిగి చర్మం చాలా కాలం పాటు బిగుతుగా ఉంటుంది. శరీరానికి ప్రతి రోజూ స్నానం చేయడం వల్ల ఆహ్లాదాన్ని ఇస్తుంది. స్నానం తర్వాత ఉండే ఆహ్లాదకరమైన అనుభూతిని ప్రయత్నపూర్వకంగా అనుభవించండి. ఆ ఫ్రెష్ ఫీలింగ్ కూడా మిమ్మల్ని మరికాస్త ఎక్కువ ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది.
నిద్ర పోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల చాలా సేపటి వరకూ మనం ఆహారం తీసుకోకుండా ఉంటాం కాబట్టి ఉదయం అల్పాహారానికి కొంచెం మోతాదు ఎక్కువైనా పర్లేదు. అయితే అవి నూనె పదార్థాలై ఉండకూడదు. లేకుంటా అవి మిమల్ని బద్దకస్తంగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు. శరీరంలో చురుకు దనం లోపిస్తుంది. ఆహారంలో ఎక్కువగా వేయించిన పదార్థాల కంటే ఉడికించిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలతో ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. కాయదాన్యాలతో ఉండే ఆహారం తీసుకోవడం ఇష్టమైతే, దానితో పాటు ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి.
ఇక ఆఫీస్ లో తీసుకునే కాఫీ, టీ లను పరిమితంగా తీసుకోవాలి. ఒకవేళ తాగాల్సి వస్తే దానికి బదులు గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి అందుబాటులో ఉంటే అవి తీసుకొంటే ఆరోగ్యపరంగా చాలా మంచిది. అలాగే రోజులో ఎక్కువసార్లు వీలైనంతగా నీళ్లు తాగాలి. ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడానికి బదులు తాజా పండ్లు తినడం మంచిపద్దతి.



Click it and Unblock the Notifications
