Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
అవాంచిత రోమాలు తొలగించే సులభమైన పద్దతులు....!

దీన్ని తరచూ చేయించుకోవడం వల్ల అవాంచిత రోమాలు బలహినమై వాటి ఎదుగుదల క్రమంగా తగ్గిపోతుంది. వ్యాక్సింగ్ అలవాటు పడితే ఎండకు నల్లగా మారిన చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మృత చర్మం తొలగి తాజాగా కనిపిస్తుంది. అవగాహన లేకుండా వ్యాక్సింగ్ చేయించుకోవడం వల్ల ఒక్కోసారి శరీరంలో నెత్తురు గడ్డకట్టి చర్మంపై మచ్చలు పడతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
1. వ్యాక్సింగ్ చేసే భాగానికి ముందుగా పౌడర్ రాసుకోవాలి. వ్యాక్స్‌ను వేడి చేసుకోవాలి. ఆ వేడిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా నైఫ్ దొరుకుతుంది. దాన్ని తీసుకుని వేడిని పరీక్షించుకుని అవాంఛిత రోమాలు పెరిగే వైపు నుంచి పూతలా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే, తొలగించే లోపల ఆరిపోయి, తొలగించేందుకు కష్టం అవుతుంది. రెండుమూడు అంగుళాల మందం పొడవులో వేసుకుంటే చాలు.
2. వ్యాక్సింగ్ చేసుకున్న వెంటనే దద్దుర్లు వస్తే వెంటనే నిపుణుల సలహా తీసుకొని యాంటీబయోటిక్స్ కూడా వాడాలి. యాంటిబయోటిక్ క్రీంను వారం రోజులు ముందు వాడాలి. తరవాత మరో రెండుమూడు రోజులు రాసుకుంటే అలర్జీ, పిగ్మెంటేషన్ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు.
3. బహుమూలాల్లో చేస్తున్నప్పుడు ఒక్కోసారి నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కోల్డ్ కంప్రెషన్ ఇచ్చి ఐదునిమిషాల అనంతరం వ్యాక్సింగ్ చేసుకుంటే నొప్పి తక్కువగా ఉంటుంది. ముఖానికి వ్యాక్సింగ్ చేసుకుంటున్నప్పుడూ రెండు మూడు అంగుళాల మేర వేసి..ఆ భాగం సాగకుండా బొటనవేలు, చూపుడు వేలితో గట్టిగా నొక్కిపట్టుకుని వ్యాక్స్ పట్టీతో తొలగించాలి. అప్పుడు చర్మం కందిపోకుండా.. దద్దుర్లు రాకుండా ఉంటుంది. ఈ రోజుల్లో రకరకాల వ్యాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో...
4. పాట్‌వ్యాక్స్ : ఇవి చిన్నచిన్న పాత్రల్లో వస్తాయి. పై పెదవి, ముఖంపైన ఉన్న అవాంఛిత రోమాల్నితొలగించేందుకు ఇవి సరైన ఎంపిక. కానీ దీనివల్ల చాలా త్వరగా అంటే మూడో రోజుకే మళ్లీ సమస్య మొదలవుతుంది.
5. హాట్ వ్యాక్స్: ఈ రోజుల్లో చాలామంది దీన్ని ఎంచుకోవడానికి ఇష్టపడుతారు. ఎందుకంటే ఇది శరీరంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. అవాంఛిత రోమాల్ని సులువుగా తొలగిస్తుంది. అయితే ఇది ఓ క్రమ పద్ధతిలో వేసుకోవాలి.
6. కోల్డ్ వ్యాక్స్: దీన్ని పలుచగా కాకుండా మందంగా వేసుకోవాలి. సరిగ్గా తొలగించలేకపోతే.. చర్మం పైపొర కూడా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది.



Click it and Unblock the Notifications
