For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందార నూనెతో అందం, యవ్వనం రెండూ సొంతమే

|

హైబిస్కస్ ఆయిల్ (మందార నూనె)ను మందార మొక్క నుండి సేకరిస్తారు. మరియు ఇది ఒక ముఖ్యమైన మరియు అవసరమైన నూనె. చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ నుండి ఆరోమా థెరఫీ వరకూ మందార నూనెతో అనేక ప్రయోజనాలున్నాయి. చర్మంలో ఏర్పడ్డ మొటిమలు మరియు blemishes తొలగించడానికి సహాయపడే వైద్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

హైబిస్కస్ ఆయిల్ (మందార నూనె)ఇన్ప్లమేషన్ ను(చర్మానికి తగినంత తేమను అంధించి మంటను)తగ్గిస్తుంది. మరియు అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కేశాలకు తగినంత తేమను అంధించడానికి మరియు జుట్టుకు ఆరోగ్యకరమైన షైనింగ్ ఇవ్వడానికి ఈ ఆయిల్ ను వివిధ రకాల నూనెల్లో జోడిస్తారు. మందారను నూనెను కొబ్బరి నూనెతో జోడించి, వేడి చేసి చల్లారిన తర్వాత ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మందార నూనెతో అనేకమైన బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి.

మందారన నూనెను మీ అందం కోసం ఉపయోగించడానికి కొన్ని బ్యూటీ పద్దతులు:

చుండ్రు:

చుండ్రును నివారించడం కోసం మందార నూనెతో రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తలలో చుండ్రు ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంతే కాదు కేశాలకు తగినంత తేమను అంధిస్తుంది మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.

జుట్టు రాలడాన్ని అరికడుతుంది:

మందార నూనెతో తలకు రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడాన్నితగ్గించడంతో పాటు, జుట్టు రాలడాన్ని అరికడుతుంది. జుట్టు రాలడానికి కారణం అయ్యే చుండ్రుకు ఈ నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మందార నూనె హెయిర్ మరియు స్లాప్ ను స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా ఉంచుతుంది.

పొడి చర్మం:

మందార నూనె చాలా ప్రభావంతమైన మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంది. అందవల్లే పొడి చర్మానికి ఇది ఒక అద్భుతమైన హోం రెమడీ. ఇది కఠిన చర్మాన్ని, మరియు పెలుసు బారిన చర్మాన్ని నివారిస్తుంది.

జుట్టు పెరుగుదల:

మందార నూనెలో ఉన్న నేచురల్ విటమిన్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మందార నూనెను అలాగే ఉపయోగించవచ్చు లేదా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ (షాంపు లేదా కండీషనర్స్ )తో కలిపి ఉపయోగించుకోవచ్చు.

ప్రీమెచ్యుర్ గ్రేయింగ్ హెయిర్ మరియు హెయిర్ కలర్:

మందార నూనె రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల వెంట్రుకలు తెల్లబడటం లేదా రంగు మారడాన్ని తగ్గించుకోవచ్చు . మరియు కేశాలకు హెయిర్ కలర్ నలుపుగా పెరగేందుకు సహాయపడుతుంది. మందార నూనె ఉపయోగించడం వల్ల కేశాలు స్ట్రాంగ్ గా మరియు మంచి కలర్ తో మంచి షైనింగ్ తో మెరుస్తుంటాయి.

ఏజింగ్(వృద్ధాప్యం):

మందార నూనె చర్మం యొక్క స్థితిస్థాపకత మరియు సౌకర్యాన్ని పెంచుతుంది. మీ అందాన్ని మెరుగు పరుచుకోవడానికి మీ డైలీ వాడకంలో మందార నూనెను ఉపయోగించడం మంచిది. ఇది వృద్ధాప్య గుర్తులను ఎదుర్కోవడానికి సహాయం చేస్తుంది. ఇది చర్మాన్ని నునుపైన మరియు supple చేస్తుంది. మీ చర్మం ఆరోగ్యకరమైనదిగా మరియు యంగ్ గా కనిపిస్తారు.

సెల్యులైట్:

చాలా మంది మహిళలు cellulite తో బాధపడుతుంటారు. celluliteను వదిలించుకోవడానికి మందార నూనె ఒక ప్రభావంతమైనదిగా పనిచేస్తుంది. ఈ సమస్య ఉన్న ప్రాంతంలో మందార నూనెను మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బాగ్ ఆయిల్:

మీరుస్నానానికి ఉపయోగించే నీటిలో మందార నూనెను కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం అదంగా మరియు ఎక్కువ సమయం సుగంధభరితంగా మరియు ఆకర్షిస్తుంటుంది. ఇది ఇంకా ఏదైనా ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంతో పాటు చర్మాన్ని సున్నితంగా నునుపుగా మార్చుతుంది.

పగిలిన పాదాలు:

పాదాల సంరక్షణలో మందార నూనె చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. పాదాల పగుళ్ళు ఉన్నప్పుడు మందార నూనెతో మసాజ్ చేయాలి. పగిలిన పాదాలకు మందార నూనె చాలా అద్భుతమైన హోం రెమడీ. ముఖ్యంగా శీతాకాలంలో.

English summary

Beauty Benefits Of Hibiscus Oil


 Hibiscus oil is extracted from the hibiscus plant and is an essential oil. The numerous functions of hibiscus oil range from skin and hair care to aromatherapy. It contains healing properties for the skin, which helps it eliminate acne and blemishes.
Story first published: Thursday, July 4, 2013, 12:59 [IST]
Desktop Bottom Promotion