For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళక్రింద నల్లటి వలయాలు..కళ్ళ అలసటను మాయం చేసే చిట్కాలు..!

|

ప్రస్తుత జీవన శైలిలో అందరూ బిజీబిజీగా జీవితం గడుపుతుంటారు. అరోగ్యం, ఆహారం పట్ల కూడా తగిన జాగ్రత్త తీసుకోకుండా నిత్యం ఒత్తిడితో పనిచేస్తుంటారు ఆఫీసులో బోలెడంత పని, ఇంటికి వచ్చిన తరువాత ఫ్రెండ్స్‌ తో ఛాటింగ్.. అదేపనిగా కంప్యూటర్ ముందు గంటలతరబడీ గడిపేయటం నేటి ఆధునిక జీవనశైలిలో భాగం. అలాగే విశ్రాంతి తీసుకుంటున్నామని చెబుతూనే అనేక గంటలపాటు టీవీని చూడటం కూడా అలాంటివాటిలో ఒకటి. టీవీల ముందు, కంప్యూటర్లముందు గంటలతరబడీ గడపటంవల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యలబారిన పడతారు. సరైన నిద్రలేని కారణంగా కళ్లకింద నల్లటి చారలు, కంటిచూపు మందగించటం, కళ్లలో మంటలు, కళ్లలోంచి నీరు కారటం.. లాంటివన్నీ క్రమంగా ఒకదాని తరువాత ఒకటిగా వేధిస్తాయి. ఇలాంటి సమస్యల పాలవకుండా.. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే గాకుండా, మిలమిలా మెరిసే అందమైన కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Brighten Up Tired Eyes Instantly!

మీ కళ్ళు ఎప్పుడైతే అలసటకు గురి అవుతాయో, ఆ సమయంలో కళ్ళ మేకప్ సహాయపడుతుంది . ఎప్పుడైతే మీరు వేకువజామునే నిద్రలేస్తారో లేదా రాత్రంతా సరిగా నిద్రపోకపోయినా కళ్ళు చాలా అలసట చెందినట్లు కనబడుతాయి. కొన్ని సార్లు డార్క్ సర్కిల్స్ కూడా కళ్ళ క్రింద ఏర్పడి అసహ్యంగా కనబడుతుంటాయి. కళ్ళు ఆరోగ్యంగా లేకపోయినా అలసటగా ఉన్నప్పుడు మీరు ఎటువంటి మంచి దుస్తులు ధరించినా కూడా అందంగా కనబడరు. అందువల్ల మీరు కనుక సరిగా నిద్రపోనట్లైతే కొన్ని సులభచిట్కాలు పాటించినట్లైతే మీ కళ్ళు ప్రకాశవంతంగా మెరిసేలా ఉంటాయి. అందుకు కొన్ని మంచి ‘ఐ'ప్యాక్స్ బాగా సహాయపడుతాయి. ఇవి మీ అలసిన కళ్ళకు ఉపశమనం కలిగిస్తాయి. అందుకు కొన్ని ప్రభావంతమైన మార్గాలు ఇక్కడ మీకోసం కొన్ని...

1. ఐస్ ప్యాక్: ఐస్ ముక్కను చిన్న కాటన్ వస్త్రంలో తీసుకొని మడచి కళ్ళ మీద పెట్టుకోవాలి. అంతే కాదు అదే ఐస్ ముక్కతో కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకోవచ్చు. దాంతో కళ్ళ అలసట నుండి ఉపశమనం పొది ఫ్రెష్ గా కనబడుతాయి. ఆ చల్లదనం మిమ్మల్ని కంటి నిండా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

2. రోజ్ వాటర్ లో ముంచి పత్తి: రోజ్ వాటర్ చర్మ రక్షణలో తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి రెండు కాటన్ బాల్స్ (పత్తి ఉండలు)రోజ్ వాటర్ లో ముంచి అలసిన కళ్ళ మీద పెట్టుకోవాలి. తర్వాత అలాగే స్ట్రెయిట్ గా వెనకకు కూర్చొని, పది నిముషాల పాటు ఏదైనా మ్యూజిక్ వింటూ విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఐస్ ప్యాక్ ను తొలగించిన తర్వాత మీ కళ్ళు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

3. కీరదోశకాయతో ఐస్ ప్యాక్: కళ్ళ మీద రెండు చక్రాలాంటి కీరదోశకాయ ముక్కలను రెండు కళ్ళమీద పెట్టి పది పదిహేను నిముషాల పాటు కళ్ళు మూసుకొని విశ్రాంతి పొందడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న అలసిన చర్మాన్ని కీరదోస చల్లబరిచి, ముడుతలను పోగొడుతుంది.

4. సాండిల్ వుడ్ ఐప్యాక్: చర్మానికి సాండిల్ వుడ్ పేస్ట్ చాలా సున్నితమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. కళ్ళ చుట్టూ ఉన్న చర్మానికి రక్షణ కల్పించి ప్రకాశవంతంగా మార్చుతాయి. కాబట్టి కొంచెం సాండిల్ వుడ్ పేసట్ కళ్ళ చుట్టూ అప్లై చేయడం వల్ల అలసిన చర్మం తొలగిపోయి ఫ్రెష్ గా కనబడుతారు.

5. నిమ్మరసం: నిమ్మకాయ గ్రేట్ బ్లీచింగ్ ఏజెంట్. నిమ్మకాయను ముక్కతో కళ్ళ చుట్టూ రుద్దడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తొలగిపోతాయి. కళ్ళ క్రింద ఉబ్బెత్తుగా ఉన్నా, ఆప్రదేశంలో కొంచెం నిమ్మరసాన్ని రాయడం చాల ముఖ్యం. కళ్ళ చూట్టూ ఉన్న అలసిన చర్మం ఉపశమనం కలిగించే కొన్ని యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

ఈ చిట్కాలు మీ అలసిన కళ్ళకు ఉపశమనం కలిగించి, మీ కళ్ళను ప్రకాశవంతంగా మార్చుతాయి. అలసిన కళ్ళు మీద ఎక్కువ మేకప్ ను ధరించకూడదు.

English summary

Brighten Up Tired Eyes Instantly! | అలసిన మీ కళ్ళను ప్రకాశవంతంగా మార్చే సులభ చిట్కాలు.!

When your eyes are tired, no amount of eye makeup can help you look good. When you wake up in the morning and you you have not had a good night's sleep, then your eyes look dull. Sometimes even dark circles may appear under your eyes making then look sunken. Tired eyes can make you look really shabby even if you wear smart clothes.
Story first published: Tuesday, March 19, 2013, 12:30 [IST]
Desktop Bottom Promotion