For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళినాడు మిమ్మల్నిఅందంగా మెరిపించే బ్యూటిటిప్స్

|

హిందువులకు అతి పెద్ద పండుగా దీపావళి ఇక నాలుగు రోజులే ఉంది. దీపావళి అంటే కేవలం పటాకీలు కాల్చడం, దీపాలు వెలిగించడం, కొత్తబట్టలు వేసుకోవడమే కాదు, స్నేహితులు, బంధువులు అంతా ఒక చోట చేరే ఒక సంతోకరమైన శుభ సందర్భం. ఇది చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి, మీరు కూడా అందంగా కనబడేలా ఉండాలి. అలాకాకుండా ముఖం నిండా మొటిమలు, జిడ్డు పేరుకుపోయి ఉన్నట్లైతే మీరు నలుగురిలో ఎలా వెళతారు, పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు?లేదా పండుగ ముందు రోజు మీ గోళ్ళు పెళుసుబారీ, విరిగిపోవడం జరిగితే ఏం చేస్తారు?

అందుకే మీ కోసం కూడా కొంత జాగ్రత్త తీసుకోవడం, అందంగా కనబడానికి మరియు ఎటువంటి లోపం లేకుండా ముఖం ప్రకాశవంతంగా కనబడాలంటే దీపావళికి ముందుగానే ప్రిపేర్ అవ్వాల్సిందే. చర్మ సంరక్షణ మొదలకు పాదాల వరకు, మీరు సరైన బ్యూటీ పద్దతులను అనుసరించాల్సిందే. అందమైన సాంప్రదాయకరమైన హెవీగా డ్రెస్ వేసుకొన్నప్పుడు అందుకు తగ్గ అందాన్ని కూడా మెయింటైన్ చేయాలి కదా...

దీపావళి పండుగలో మీరు మెరిసిపోవాలంటే మీరు ముందుగానే ప్రిపేర్ కావాలి. అందుకు ఎక్కువ సమయం పట్టదు . ఉదాహరణకు: స్నానం చేసేటప్పుడు మీకు నచ్చిన స్ర్కబ్బర్ తో స్ర్కబ్బింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో మరాయు చర్మంలో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగించబడుతాయి. అదేవిధంగా పనికి లేదా కాలేజ్ కి వెళ్ళే ముందు మీ పగిలిన పాదాలకు బాడీలోషన్ లేదా ఎసెన్సియల్ ఆయిల్ ను అప్లై చేయడం మంచిది. మీ ముఖంలో మొటిమలు, మచ్చలు తగ్గించుకోవడం కోసం, కొన్ని బెస్ట్ హోం రెమడీస్ ను ప్రయత్నించండి . వీటి వల్ల చర్మ సమస్యలను నేచురల్ గా మరియు ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.

డార్క్ సర్కిల్:

డార్క్ సర్కిల్:

ఇది ఒక సాధారణ బ్యూటీ సమస్య. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఒక కఠినమైన జీవనశైలి, నిద్రలేమి, స్ట్రెస్, మరియు డైట్ ఇవన్నీ కూడా కళ్ళక్రింది నల్లని చాలకు ప్రధాన కారణం. కాబట్టి, తాజాగా కట్ చేసి కీరదోసకాయ ముక్కలను కళ్ళ మీద కొద్దిసేపు పెట్టుకోవాలి. అలసిన కళ్ళకు ఉపశమనం కలిగించి డార్క్ సర్కిల్స్ ను నేచురల్ గా తొలగిస్తుంది.

2. చర్మం తెల్లగా మార్చే ప్యాక్:

2. చర్మం తెల్లగా మార్చే ప్యాక్:

దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ అందంగా, ప్రకాశవంతంగా కనబడాలనుకుంటే, కొన్ని హోం మేడ్ స్కిన్ వైటనింగ్ ప్యాక్స్ ను వేసుకోవాలి. ఉదా: స్ట్రాబెర్రీ మరియు పాల ప్యాక్ లేదా ముల్తానీ మట్టితో ప్యాక్ వేసుకోవాలి.

3. క్లీనింగ్, టోనింగ్ మరియు మాయిశ్చరైజిగ్:

3. క్లీనింగ్, టోనింగ్ మరియు మాయిశ్చరైజిగ్:

సరైన చర్మసంరక్షణ విధానంలో ఈ మూడు స్టెప్స్ చాలా ప్రధానమైనవి. ఒక ఆరోగ్యకరమైన, మరియు ప్రకాశవంతమైన చర్మానికి ఈ చిట్కాలను రెగ్యులర్ గా ప్రయత్నించాలి.

4. జుట్టు సంరక్షణ:

4. జుట్టు సంరక్షణ:

దీపావళి రోజున మరింత స్పెషల్ గా కనబడాలంటే మీకు నచ్చిన హెయిర్ కట్ చేయించుకోండి. లేదా పొడవాటి హెయిర్ ను ట్రిమ్ చేసుకోవడం, కలరింగ్, కండీషనర్ వంటివి రెండు మూడు వారాల ముందుగానే ప్రయత్నించండి. ఆ రోజుకు మీరు మ్యానేజ్ చేసేందుకు సులభం అవుతుంది. అందుకు జుట్టుకు పెరుగు, తేనె, గుడ్డు లేదా వెనిగర్ అప్లై చేయడం ద్వారా కేశాలు సాప్ట్ గా మరియు ప్రకాశంతంగా సిల్కీగా మెరుస్తుంటాయి.

 5. లిప్ కేర్:

5. లిప్ కేర్:

పెదాల మీద నల్లటి ప్యాచెస్ లేదా పెదాల మీద పగుళ్ళు మీ మేకప్ ను పూర్తిగా చెడగొడుతుంది. కాబట్టి, పెదాలను కొరకడం, పెదాలను తడి చేయడం వంటి వాటిని మానుకోవాలి. పెట్రోలియం జెల్లీని పెదాల మీద రాయడం వంటివి చేయాలి. షీ బటర్ ను పెదా మీద మర్దన చేయాలి మరియు మాయిశ్చరైజ్ చేయడం వల్ల పెదాలు నేచురల్ గానే పింక్ కలర్ ను పొందుతాయి.

6. నెయిల్ కేర్:

6. నెయిల్ కేర్:

మీరు మీ గోళ్ళు ఎన్ని రోజులుండాలని అనుకుంటున్నారో నిర్ధారించుకోండి. దీపావళికి రెండు మూడు వారాల ముందునుండే గోళ్ళు పెరిగేలా చూసుకోవాలి. షేప్ చేయడం మరియు తర్వాత ఎక్కువ పనులు, తేమలో తడవడం వంటి పనులు మానుకోవాలి. కాబట్టి ప్రతి రోజూ నిద్రించడానికి ముందు మాయిశ్చరైజ్ ను అప్లై చేయడం మర్చిపోకండి.

7. పాదాల సంరక్షణ:

7. పాదాల సంరక్షణ:

పాదల సంరక్షణ మొత్త శరీర అందాన్ని తెలుపుతుంది. కాబట్టి, పాదాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పెడిక్యూర్ మరియు ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత మరియు నిద్రించడానికి ముందు మాయిశ్చరైజ్ వంటివి తప్పనిసరిగా చేసుకోవాలి. దాంతో పాదాల పగుళ్ళను అరికట్టవచ్చు. ఇది పాదాపగుళ్ళను తగ్గిస్తుంది, మరియు పాదాలను సాఫ్ట్ గా మార్చుతుంది.

8. మెడ మరియు జాయింట్స్ ను శుభ్రం చేసుకోవాలి:

8. మెడ మరియు జాయింట్స్ ను శుభ్రం చేసుకోవాలి:

సాంప్రధాయ దుస్తుల్లో కొన్ని ఒంపుసొంపులు బహిర్గతం అవుతాయి. కాబట్టి మీ బెల్లీ, మరియు వీపు, భుజాలు మరియు మెడ వంటి ప్రాంతాను శుభ్రంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇటువంటి ప్రదేశాల్లో అతి సులభంగా మురికి చేరుతుంది. ఇంకా చేతుల, కాళ్ళు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి . కాబట్టి, ఈ భాగాలకు నిమ్మరసాన్ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

9. ఆరోగ్యకరంగా తినాలి:

9. ఆరోగ్యకరంగా తినాలి:

ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇచ్చేవి సరైన ఆహారనియమాల ద్వారానే. ఏమైతే మీరు తింటారో లేదా త్రాగుతారో అవి మీ చర్మం మరియు కేశాల మీద ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి విటిమన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోండి. అందులో గ్రీన్ వెజిటేబుల్స్ తప్పనిసరి.

10. నీళ్ళు మరియు ఆరోగ్యకరమైన పండ్ల రసాలు:

10. నీళ్ళు మరియు ఆరోగ్యకరమైన పండ్ల రసాలు:

చర్మం హైడ్రేషన్ లో ఉండాలన్నా, చర్మం మరియు కేశాలు సమస్యలను నివారించాలన్న ఎక్కువ నీళ్ళ త్రాగాలి. హెల్తీ జ్యూస్ లు క్యారెట్, మరియు బిట్టర్ గార్డ్ వంటి జ్యూస్ లు చర్మాన్ని శుభ్రపరచడాని మరియు చర్మం ప్రకాశవంతంగా మార్చడానికి అద్భుతంగా సహాయపడుతాయి.

English summary

Diwali Beauty Regime For You!

దీపావళి పండుగలో మీరు మెరిసిపోవాలంటే మీరు ముందుగానే ప్రిపేర్ కావాలి. అందుకు ఎక్కువ సమయం పట్టదు . ఉదాహరణకు: స్నానం చేసేటప్పుడు మీకు నచ్చిన స్ర్కబ్బర్ తో స్ర్కబ్బింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో మరాయు చర్మంలో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగించబడుతాయి. అదేవిధంగా పనికి లేదా కాలేజ్ కి వెళ్ళే ముందు మీ పగిలిన పాదాలకు బాడీలోషన్ లేదా ఎసెన్సియల్ ఆయిల్ ను అప్లై చేయడం మంచిది. మీ ముఖంలో మొటిమలు, మచ్చలు తగ్గించుకోవడం కోసం, కొన్ని బెస్ట్ హోం రెమడీస్ ను ప్రయత్నించండి . వీటి వల్ల చర్మ సమస్యలను నేచురల్ గా మరియు ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.
Desktop Bottom Promotion