For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ వాక్సింగ్ వల్ల పురుషుల్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్

|

స్తుతం మహిళలే కాదు పురుషులు కూడా అందం అంటే కేవలం ఎర్రని మేనిఛాయ అని భావించడం లేదు. సంప్రదాయ, సౌందర్య పట్టికలో ఇప్పుడు ముఖం. కళ, ఫిగర్స్, హెయిర్‌ స్టయిల్‌, నడకతీరు, వ్యక్తిత్వం అన్నిటిని చేర్చారు. కాబట్టి మనిషి అందంగా కనబడాలంటే మనస్సుతో పాటు బయట శరీరం కూడా అందంగా ఉండాలి. మీరు వేసి వేశధారణ, చక్కటి వాక్ఛాతుర్యం అన్నీ అందంలో ఒక బాగమే. అందంగా ఉండటం కోసం వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. అలాగే అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి వివిధ రసాయనిక ఉత్పత్తులను ఉపయోగిస్తుంటా. వాక్సింగ్ అనే స్త్రీలకు మాత్రమే కాదు పురుషుల కూడా ఉపయోగించవచ్చు.

సాధారణంగా పురులు ఏ విషయంలోనూ బయడరంటుంటారు. అయితే చాలా మంది పురుషులు బాడీ వ్యాక్సింగ్ అంటే బయడిపోతుంటారు. ఎందుకంటే అవాంఛిత రోమాలను తొలగించడానికి ఇదొక బాధాకరమైన విషయం దాంతో చాలా మంది పార్లర్ లకు వెళ్ళకుండా చేస్తుంది. అయితే షేవింగ్ వల్ల హెయిర్ గ్రోత్ లేదా చర్మం తెగడం, అలెర్జీలు వంటి అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని చెప్తారు. అందువలన, అవాంచిత రోమాల తొలగింపుకు బ్యూటీషియన్స్ బాడీ వ్యాక్సింగ్ సూచిస్తుంటారు. అయితే ఈ బాడీ వాక్సింగ్ అనేది ఎంత మందికి తెలుసుంటుంది. ఇది సాధారణంగా అనిపించినా, నిజానికి ఇది షేవింగ్ కంటే భయంకరమైనది. బాడీ వాక్సింగ్ ను నిరంతరం చేయించుకోవడం వల్ల కొన్ని దుష్ర్పభావాలు కలుగుతాయనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పురుషులకు హెయిర్ గ్రోత్ చాలా మందంగా ఉంటుంది. కాబట్టి సెలూన్లకు బాడీ వాక్సింగ్ కోసం వెళ్ళే ముందు కొన్ని సైడ్ ఎఫెక్ట్(దుష్ర్పభావాల)గురించి తెలుసుకొని వెళ్ళండి..

కొంత మందిలో అవాంఛితరోమాలు, కాళ్లు, చేతులపై విపరీతంగా వచ్చి ఇబ్బంది కలుగజేస్తుంటాయి. అవాంఛితి రోమాల సమస్య ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తోంది. అందుకోసం రకరకాల కృత్రిమ పద్దతులతో ఎటువంటి మార్పు లేనందున వారిలో చిరాకు మొదలవుతుంది. అలాంటప్పుడు త్రెడింగ్, షేవింగ్ లాంటి పద్ధతుల కన్నా.. వ్యాక్సింగ్ చక్కని ప్రత్యామ్నాయం. వ్యాక్సింగ్ కొందరికి పడకపోవచ్చు. కొన్ని సార్లు సరిగ్గా చేయకపోతే చర్మంపై దద్దుర్లు, ఎర్రటి పొక్కులు వస్తాయి. ఇక చేతులు, భుజాల దగ్గర బ్యాక్టీరియా ఉంటే ఇన్ ఫెక్షన్ కు కారణమై మచ్చలకు దారితీస్తుంది. కొందరిలో అవి త్వరగా తగ్గితే..మరికొందరిలో చాలా సమయం పట్టవచ్చు. కాబట్టి వాక్సింగ్ చేసుకొనే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి...

బాడీ వ్యాక్సింత్ వల్ల దుష్ప్రభావాలు

హెయిర్ పెరుగుదల: బాడీ వాక్సింగ్ వల్ల ఇదొక దుష్ర్పభాం. ఫోలిసెల్ కు వ్యతిరేక దిశలో హెయిర్ ను తొలగించడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇది సాధారణంగా ముతక జుట్టు లేదా కర్లి హెయిర్ ఉన్న ప్రదేశాలల్లో ఇలా జరగవచ్చని కనుగొన్నారు. వాక్స్ చేసే ముందు ఆ ప్రదేశంలో చర్మ పెలుసుగా మారుతుంది.

బాడీ వ్యాక్సింత్ వల్ల దుష్ప్రభావాలు

పీల్డ్ స్కిన్ : వాక్సింగ్ లో ఉపయోగించే మైనపు వేడి కారణంగా, చర్మం కొద్దిగా బర్ట్న్ అవ్వడానికి కారణం అవుతుంది దాంతో వాక్సింగ్ తొలగించిన తర్వాత చర్మం పీల్ గా మారుతుంది. కాబట్టి వాక్సి చాల వేడిగా ఉండకుండా జాగ్రత్త వహించాలి. వాక్సింగ్ చేసుకొనే ముందు వేడిని ఒక సారి పరిశీలించాలి. వ్యాక్సింగ్ చేసే భాగానికి ముందుగా పౌడర్ రాసుకోవాలి. వ్యాక్స్‌ను వేడి చేసుకోవాలి. ఆ వేడిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా నైఫ్ దొరుకుతుంది. దాన్ని తీసుకుని వేడిని పరీక్షించుకుని అవాంఛిత రోమాలు పెరిగే వైపు నుంచి పూతలా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే, తొలగించే లోపల ఆరిపోయి, తొలగించేందుకు కష్టం అవుతుంది. రెండుమూడు అంగుళాల మందం పొడవులో వేసుకుంటే చాలు.

బాడీ వ్యాక్సింత్ వల్ల దుష్ప్రభావాలు

ఇన్ఫ్లమేషన్: హెయిర్ ను తొలగించడానికి ఒత్తిడి కారణంగా, ఆ ప్రాంతంలో ఎర్రబడినట్టు కనిపిస్తుంది. ఇది సంభవిస్తే, వెంటనే ఆ ప్రాంతంలో ఏదైనా చల్లని పదార్థంను అప్లై చేయడం చేయాలి. వాక్సింగ్‌ అనంతరం బాడీ లోషన్‌ లేదంటే అలోవెరా జెల్‌ రాసుకోవాలి. అందులోని సహజ కూలింగ్‌ లక్షణం చర్మాన్ని సేద దీరుస్తుంది.

బాడీ వ్యాక్సింత్ వల్ల దుష్ప్రభావాలు

మొటిమలు: అవాంఛిత రోమాల తొలగింపు ప్రక్రియ నుండి పొడి చర్మం నుండి నూనె పొరను తొలగించడానికి కారణమవుతుంది. అందువలన పురుషుల్లో వాక్సింగ్ తర్వాత ఇలా మొటిమలు ఏర్పడటానికి అవకాశం ఉంది. కాబట్టి, వ్యాక్సింగ్ చేసే భాగానికి ముందుగా పౌడర్ రాసుకోవాలి.

బాడీ వ్యాక్సింత్ వల్ల దుష్ప్రభావాలు

గడ్డలు(bumps): బాడీ వాక్సింగ్ వల్ల ఒక సాధారణ ఎఫెక్ట్ గడ్డలు. అందువల్లే, ఆ ప్రాంతంలో వాక్సింగ్ చేయించుకోవడం తగ్గించుకోవాలి. లేదా వాక్సింగ్ కు వాక్సింగ్ కు మద్య కొంత విరామం కలిగించడం వల్ల ఇలాంటి గడ్డలు ఏర్పడటాన్ని తగ్గించుకోవచ్చు. అవగాహన లేకుండా వ్యాక్సింగ్ చేయించుకోవడం వల్ల ఒక్కోసారి శరీరంలో నెత్తురు గడ్డకట్టి చర్మంపై మచ్చలు పడతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

బాడీ వ్యాక్సింత్ వల్ల దుష్ప్రభావాలు

చర్మంలో మార్పు: కొంత మంది పుషుల్లో ముఖ్యంగా ఎండలో ఎక్కువగా తిరిగే వారు. వారి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి వారు బాడీ వాక్సింగ్ చేసుకొన్న తర్వాత చర్మ ఛాయలో మార్పుకు దారితీస్తుంది.

బాడీ వ్యాక్సింత్ వల్ల దుష్ప్రభావాలు

నొప్పి: బాడీ వాక్సింగ్ వల్ల ముతక జుట్టు ఏర్పడుతుంది. ఇది సాధరణ చర్మ సమస్య. కాబట్టి బాడీ వాక్సింగ్ చేసే ముందు హెయిర్ ను ట్రిమ్ చేసుకోవాలని సూచన.

బాడీ వ్యాక్సింత్ వల్ల దుష్ప్రభావాలు

గాయాలు/బ్లీడింగ్: మందపాటి హెయిర్ ను తొలగించడానికి చర్మం ఎక్కువ ఒత్తిడికి గురి అవుతుంది. దాంతో కొన్ని సార్లు రక్తస్రావం లేదా గాయాలు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది పురుషుల్లో బాడీ వాక్సింగ్ చేయించుకోవడం వల్ల ఏర్పడే ఒక సాధారణ సమస్య.

బాడీ వ్యాక్సింత్ వల్ల దుష్ప్రభావాలు

డ్రై స్కిన్: బాడీ వాక్సింగ్ తర్వాత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. బాడీ వాక్సింగ్ తర్వాత కోల్డ్ క్రీమ్ లేదా ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల చర్మానికి ఉపశమనం కలిగించవచ్చు.

బాడీ వ్యాక్సింత్ వల్ల దుష్ప్రభావాలు

ఎలర్జీ: మీరు సున్నితమైన చర్మం కలిగి ఉంటే, మీరు ఖచ్చితంగా వాక్సింగ్ కొరకు హెర్బల్ వాక్స్ ను ఎంపిక చేసుకోవాలి. బాడీ వాక్సింగ్ తర్వాత స్కిన్ అలర్జీ నుండి ఉపశమనం కలిగిస్తుంది. వ్యాక్సింగ్ చేసుకున్న వెంటనే దద్దుర్లు వస్తే వెంటనే నిపుణుల సలహా తీసుకొని యాంటీబయోటిక్స్ కూడా వాడాలి. యాంటిబయోటిక్ క్రీంను వారం రోజులు ముందు వాడాలి. తరవాత మరో రెండుమూడు రోజులు రాసుకుంటే అలర్జీ, పిగ్మెంటేషన్ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు.

దీన్ని తరచూ చేయించుకోవడం వల్ల అవాంచిత రోమాలు బలహినమై వాటి ఎదుగుదల క్రమంగా తగ్గిపోతుంది. వ్యాక్సింగ్ అలవాటు పడితే ఎండకు నల్లగా మారిన చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మృత చర్మం తొలగి తాజాగా కనిపిస్తుంది.

English summary

Effects Of Body Waxing On Men

It is common to note that men aren't usually afraid of anything, but then again there are a number of men who are afraid of body waxing. The painful procedure of hair removal can sometimes lead men to jump off the parlour table due to the excessive pain.
Desktop Bottom Promotion