For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడిబారిన చేతివేళ్ళు-గోళ్ళ నివారణకు హోం రెమెడీస్

|

సాధారణంగా మహిళలు తమ అందమైన చేతులకు పొడవుగా నెయిల్స్ (గోళ్ళను) పెంచుకోవడానికి వాటికి అందంగా నెయిల్ పాలిష్ వేసుకోవడం అంటే చాలా మంది టీనేజ్ గర్ల్స్ నుండి మద్యవయస్సు స్త్రీలకు వరకూ ఇష్టపడుతారు. అయితే, పొడవాటి గోళ్ళను ఇష్టపడే వారికి డ్రై నెయిల్ (పొడిబారిన గోళ్ళు )చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. పొడిబారిన గోళ్ళు కొద్దిగా పెరిగిన తర్వాత చిట్లిపోవడం మరియు పొడవుగా పెరిగి మద్యలో కట్ అయ్యి ఊడివచ్చేయడం జరుగుతుంటాయి . అయితే, నెయిల్ కేర్ విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారి, గోళ్ళు పొడిబారడం వల్ల గోళ్ళు చిట్లడం లేదా మద్యలో తెగిపోవడం జరుగుతుంది. చేతులు, గోళ్ళలో తేమను కోల్పోయినప్పుడు, మరియు అధికంగా కెమికల్స్ ఉన్న నెయిల్ పాలిష్ ఉపయోగించినప్పుడు గోళ్ళు పొడిబారడం లేదా రఫ్ గా మారడం జరుగుతుంది.

పొడిబారి గోళ్ళ చికిత్సకోసం బ్యూటీ పార్లర్స్ కు వెళ్ళడం మరియు డబ్బు ఖర్చుచేయడం కంటే, ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ను ఉపయోగించవచ్చు. అందుకోసం ఇక్కడ కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని ఉపయోగించి డ్రై నేయిల్స్ కు నేచరల్ గా నివారించవచ్చు.

Home Remedies For Dry Nails

డ్రై నెయిల్స్ నివారణకు బెస్ట్ హోం రెమెడీస్:

బాదం ఆయిల్: గోళ్ళ పగుళ్ళు మరియు డ్రై నెయిల్స్ ను ట్రీట్ చేయడంలో ఇది ఒక నేచరల్ హోం రెమెడీ అని మనందరికీ బాగా తెలుసు. కాబట్టి, కొద్దిగాబాదం ఆయిల్ ను చేతిలో తీసుకొని మీచేతులకు మరియు వేళ్ళు, గోళ్ళకు బాగా మసాజ్ చేయాలి. గోళ్ళను మాయిశ్చరైజ్ చేయడంతో పాటు, ఈ నూనె చర్మాన్ని కూడా మాయిశ్చరైజ్ చేస్తుంది. మీరు స్నానం చేసిన తర్వాత మరియు నిద్రించే ముందు ఆలివ్ ఆయిల్ ను మీ చేతులకు ఉపయోగించండి.

ఆలివ్ ఆయిల్: బ్రిటెల్ మరియు డ్రై నెయిల్ చికిత్సకోసం మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ను నెయిల్స్ మరియు క్యూటికల్స్ మీద అప్లై చేయాలి. అప్లై చేసి 5నిముషాలు మసాజ్ చేయాలి మరియు స్ర్కబ్ చేసి క్యూటికల్ వద్ద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించవచ్చు. మంచి అందమైన గోళ్ళ నిర్వహణకు మరియు గోళ్ళు మంచి షైనింగ్ తో మెరుస్తుండాలంటే ఇది ఒక ఉత్తమ మార్గం.

పెట్రోలియం జెల్లీ: పొడిబారిని గోళ్ళను సాఫ్ట్ గా మార్చుకోవడానికి మీరు పెట్రోలియం జెల్లీని అప్లై చేయవచ్చు. ఈ పెట్రోలియం జెల్లి గోళ్ళు పొడిబారడం మరియు పగలడం వంటి సమస్యలను నివారిస్తుంది.

షీ బటర్ క్రీమ్: నేచురల్ పద్దతిలో బ్రిటెల్ మరియు డ్రై నెయిల్స్ నివారించడానికి ఇది మరొక బెస్ట్ హోం రెమెడీ. మీ చేతి వేళ్ళకు మరియు గోళ్ళకు షీ బటర్ ను అప్లై చేసి, 10నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజ్ అప్లై చేయాలి. షీ బటర్ గోళ్ళకు బలాన్ని చేకూర్చుతుంది మరియు పగుళ్ళను నివారిస్తుంది. ముఖ్యంగా దీన్ని నెయిల్ కేర్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల మంచి షైనింగ్ తో గోళ్ళు మెరుస్తుంటాయి. దీన్ని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయాలి (నిద్రించే ముందు ఖచ్చితంగా అప్లై చేసుకోండి)

కఠినమైన సోపులను నివారించండి: మీరు కఠినమైన రసాయనాలు కలిగిన సోపులు మరియు హాండ్ వాష్ లను వాడటాన్ని నివారించాలి. ఇవి నివారించడం వల్ల మీ గోళ్ళు చాలా సహజంగా అందంగా ఉంటాయి. చేతులను శుభ్రం చేయడానికి హెర్బల్ సోప్స్ మరియు హ్యాండ్ వాష్ లను ఉపయోగించి కఠిన రసాయనాల యొక్క దుష్ర్పభావాలను నివారించండి.

మాయిశ్చరైజర్స్: ప్రతి రోజూ మీ గోళ్ళకు మాయిశ్చైజర్ ను అప్లై చేయడం మర్చిపోకండి. అద్భుతఫలితాలను చూపించే మరో ముఖ్యమైన నెయిల్ కేర్ టిప్ ఇది. మీ అరచేతులకు మరియు పాదలకు రెగ్యులర్ గా మాయిశ్చరైజ్ అప్లై చేయడం వల్ల సాఫ్ట్ గా తయారవుతాయి.

English summary

Home Remedies For Dry Nails

Dry nails can be a major problem for women who love long nails. Dry nails can be followed up with brittleness and the nails can peel off too.
Story first published: Wednesday, December 18, 2013, 17:18 [IST]
Desktop Bottom Promotion