For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళ మంటల తగ్గించే అద్భుతమైన వంటింటి చిట్కాలు

|

మనలో చాలా మంది ఎక్కువగా కంటి బర్నింగ్ సమస్యతో బాధపడుతున్నారు. కొన్నిసార్లు ఇది ఒక పెద్ద సమస్యగా అయ్యి రోజువారి పనులను పాడుచేస్తుంది. కళ్ళ గాయాలు బాధాకరంగా ఉండటమే కాకుండా చాలా దారుణంగా ఉంటాయి. ఇది మీకు ఒక పెద్ద సమస్యగా మారుతుంది. మీకు కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి. కానీ వాటిని నివారించడానికి సాధ్యం కాదు. మీ కంటి బర్నింగ్ కు కారణాలు మంట, దురద మరియు నొప్పిలను ఎలా తగ్గించవచ్చో మీకు తెలుసా?

కంటి బర్నింగ్ కు బాక్టీరియా లేదా వైరల్ సంబంధించి కంటి వ్యాధులు,కాలుష్యం మరియు సూర్యుని కిరణాలు వంటి అనేక కారణాలు ఉండవచ్చు.కొన్నిసార్లు పుప్పొడి,దుమ్ము మరియు ఇసుక వంటి సహజమైన చికాకు కారణంగా కూడా కళ్ళు బర్నింగ్ అవవచ్చు. అధికంగా చదవటం మరియు రసాయన చికాకు గురికావడం వంటివి కూడా ఖచ్చితంగా కళ్ళు బర్నింగ్ మరియు గాయాలకు కారణమవుతాయి.

మీరు ప్రారంభ దశల్లో వాటికి చికిత్స మొదలుపెడితే సులభంగా కంటి బర్నింగ్ ను వదిలించుకోవచ్చు. మీరు అవాంతరం లేని మరియు ఉచితంగా కొన్ని ఇంటి పరిష్కారాలను ప్రయత్నించవచ్చు. అంతేకాక కంటి గాయాల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మీ వంటగదిలో సులభంగా అందుబాటులో ఉండే బంగాళదుంపలు,దోసకాయ,బేకింగ్ సోడా,ఆముదము,టీ బ్యాగ్స్,కలబంద రసం వంటి వాటిని ఉపయోగించవచ్చు.

ఐస్ కోల్డ్ వాటర్ చల్లండి

ఐస్ కోల్డ్ వాటర్ చల్లండి

మీ కళ్ళు బర్నింగ్ గా ఉంటే ఐస్ కోల్డ్ వాటర్ చల్లండి. అప్పుడు ఆ నీరు మీ కళ్ళ నుండి దుమ్ము కణాలు మరియు మలినాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాక వాటికి వచ్చే వాపులకు ఉపశమనం కలిగిస్తుంది. మీరు మీ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. మురికి చేతులతో మీ కళ్ళను తాకే ప్రయత్నం చేయకూడదు.

పన్నీరు

పన్నీరు

ఒక కాటన్ బంతి తీసుకోని పన్నీరులో ముంచి దానిని మీ కనురెప్పల పైన ఉంచండి. ఇది మీ కళ్ళ బర్నింగ్ అనుభూతి నుండి తక్షణ ఉపశమనంను కలిగిస్తుంది. పన్నీరులో మీ కళ్ళు ఉపశమనాన్ని కలిగించే కొన్ని లక్షణాలు ఉన్నాయి. కళ్ళ గాయాల నుండి కూడా మీకు ఉపశమనం కలిగిస్తుంది.

బంగాళాదుంప ముక్కలు లేదా తురిమిన బంగాళాదుంప

బంగాళాదుంప ముక్కలు లేదా తురిమిన బంగాళాదుంప

మీరు మీ కనురెప్పలపైన బంగాళాదుంప ముక్కలను ఉంచవచ్చు. దానిని కనీసం 15 నిమిషాలు ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇది కంటి మంటను తగ్గిస్తుంది. అంతేకాకుండా మీరు మీ కళ్ళకు ఉపయోగించే ముందు బంగాళాదుంపను అతిశీతల పరచవచ్చు.

దోసకాయ ముక్కలు ఉంచండి

దోసకాయ ముక్కలు ఉంచండి

దోసకాయను రెండు ముక్కలుగా కట్ చేసి ఐస్ కోల్డ్ వాటర్ లో ఉంచాలి. అలాగే మీరు ఉపయోగించే ముందు దోసకాయను అతిశీతల పరచవచ్చు. కనీసం 15 నిమిషాల పాటు మీ కనురెప్పలపై దోసకాయ ముక్కలను ఉంచండి. దోసకాయ శీతలీకరణ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అందువలన మీ బర్నింగ్ కళ్ళకు ఉపశమనానికి తోడ్పడుతుంది.

టీ బ్యాగ్స్

టీ బ్యాగ్స్

మీ బర్నింగ్ కళ్ళ ఉపశమనానికి చేసే మరొక ఇంటి పరిష్కారం అని చెప్పవచ్చు. కోల్డ్ నీటిలో రెండు ఆకుపచ్చ లేదా బ్లాక్ టీ బ్యాగ్స్ లను నానబెట్టాలి. ఇలా చేయుట వలన టీ బ్యాగ్స్ తడిగా అవుతాయి. ఇప్పుడు 15-20 నిమిషాలు మీ కనురెప్పలు వాటిని ఉంచాలి. వేగంగా ఉపశమనం పొందేందుకు రోజులో ఈ ప్రక్రియను అనేక సార్లు పునరావృతం చేయవచ్చు. అంతేకాక టీ ద్రావణంను కళ్ళను కడగటానికి ఉపయోగించవచ్చు.

కలబంద రసం

కలబంద రసం

అవును మీకు ఇష్టమైన కలబంద రసం బర్నింగ్ కళ్ళను వదిలించుకోవటం కొరకు ఒక గొప్ప పరిష్కారం అని చెప్పవచ్చు. కేవలం కొంత సమయం వరకు కలబంద రసంను అతిశీతల పరచండి. రెండు కాటన్ బంతులను తీసుకోని కోల్డ్ రసంలో ముంచి మీ కళ్ళ పైన 15-20 నిమిషాలు ఉంచండి.

 సీమ చేమంతి పూలు

సీమ చేమంతి పూలు

కొన్ని ఎండిన చామంతి పువ్వులను తీసుకుని వాటిని నీటిలో మరిగించాలి. ఆ వాటర్ ని వడగట్టి చల్లబరచండి. మీ కళ్ళు కడగటానికి ఈ ద్రావణంను ఉపయోగించండి. ఇది కంటి బర్నింగ్ వలన వచ్చే వాపుకు ఉపశమనం ఇస్తుంది. అంతేకాక దుమ్మును కూడా తొలగిస్తాయి.

ఆముదము

ఆముదము

ఒక స్వచ్ఛమైన ఐ డ్రాపర్ తీసుకోని దానిలోకి ఆముదమును తీసుకోని ప్రతి కంటిలో ఒక చుక్క వేయాలి. ఎక్కువగా కంటి బర్నింగ్ ఉంటే రోజులో మూడుసార్లు లేదా నాలుగు సార్లు వేయవచ్చు. ఇది మీ అలసట,బర్నింగ్ కళ్ళ ఉపశమనం మరియు వాపును తగ్గిస్తుంది.

 ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వినెగర్ కళ్ళ గాయాల కొరకు ఒక అద్భుతమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. ఇది మీ వంటగది లో చాలా ముఖ్యమైన పదార్థాలలో ఒకటిగా ఉంది. ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ స్వచ్ఛమైన ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి.ఒక కాటన్ బంతి తీసుకోని ఆపిల్ సైడర్ వినెగర్ లో ముంచి మీ కళ్ళ పైన పెడితే ఉపశమనం కలుగుతుంది.

English summary

Remedies To Soothe Burning Eyes

Many of us suffer from burning eyes many times. Sometimes it becomes a big problem and hampers our day to day work. Sore eyes are not only painful, but also makes you look horrible. It becomes such a big problem, especially when you have some important tasks ahead and you cannot avoid them.
Story first published: Wednesday, October 30, 2013, 12:33 [IST]
Desktop Bottom Promotion