For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాఫ్ట్ అండ్ బేబీ లిప్స్ ను పొందడం కోసం సులభ టిప్స్..?

|

మృదువుగా, అందంగా ఉండే పెదాలు మంచి ఆరోగ్యానికి చిహ్నాలని చెప్పవచ్చు. అయితే పెదాలు తడిగా ఉండేందుకు అక్కడ నూనె గ్రంధులేవీ ఉండనందువల్ల అవి తరచు పొడిగా మారుతుంటాయి. పెదాలను నాలుకతో తడిచేసుకోవడం చాలామందిలో మనం గమనిస్తున్నదే. మగువ అందంగా కనబడాలంటే ముఖంలో కళ్ళు, ముక్కు, పెదాలు అందంగా కనబడాలి. ముఖంలో పెదాలు చాలా సున్నితమైనవి. అలాంటి పెదాలు..ఆరోగ్యంగా..పింక్ కలర్ లో ఉంటేనే చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటాయి. మీ అందం..ఆరోగ్యం గురించి ఎదుటి వారికి తెలియాలంటే పెదాలు స్మూత్ గా..సాప్ట్ గా ఉండాలి. పెదాలు అందంగా కనబడాలంటే లిప్ స్టిక్ లేదా లిప్ గ్లాస్ లేదా లిప్ మేకప్ ఇవేవీ అవసరం లేదు ఎందుకంటే ఇది చూడటానికి చాలా హార్డ్ గా కనబడటమే కాదు పెదాలు పగుళ్ళు ఏర్పడుతాయి. పాలిపోయిన, పగిలిన, నల్లగా మారిన పెదాలు ముఖ అందాన్నే పాడు చేసేస్థాయి. మరి ఈ ముఖంలో ఈ మార్పును నివారించడాలంటే కొన్ని లిప్ కేర్ టిప్స్ తీసుకొని సాఫ్ట్ గా ఉండేలా మెయింటైన్ చేయాలి.

అలాంటి బేబీ సాఫ్ట్ లిప్ ను మెయింటైన్ చేయడం అంత కష్టమైన పనేం కాదు. అందుకు సరైన లిప్ కేర్ టిప్స్ తెలిసుండడమే. పెదాలను మాయిశ్చైజ్ చేయడం. పెదాలకు వెన్న లేదా క్రీమ్ రాయడం వల్ల మీరు కిస్సెబుల్ సాఫ్ట్ లిప్స్ ను మెయింటైన్ చేయవచ్చు. అటువంటి పెదాలను పొందాలంటే కొన్ని చిట్కాలు మీకోసం...

మిల్క్ క్రీమ్: మిల్క్ క్రీమ్ ను పెదాల మీద రాసి, సున్నితంగా స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి పెదాలను సున్నితంగా మార్చుతుంది. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల కిస్సెబుల్ లిప్స్ ను సహజంగా పొందవచ్చు.

బట్టర్(వెన్న): స్నానానికి వెళ్ళె అరగంట ముందు పగిలిన మరియు పొడిబారిన పెదాల మీద వెన్నను రాయాలి. ఇది మాయిశ్చరైజర్ గా ఉండి పెదాలను సున్నితంగా ఉంచుతుంది. పెదాలు నల్లగా మారకుండా ఉండాలంటే ఉప్పు లేని వెన్నను ఉపయోగించాలి.

దానిమ్మ జ్యూస్: దానిమ్మ రసం పెదాలు సహజంగా ఎరుపు రంగులోని మార్చడానికి సహాయపడుతుంది. ఈ హెల్తీ జ్యూస్ ను తాగడంతో పాటు, పెదాలకు కూడా అప్లై చేయడం వల్ల రెడ్ లిప్స్ ను పొందవచ్చు. దానిమ్మ రసాన్ని వెన్న లేదా మిల్క్ క్రీమ్ తో మిక్స్ చేసి పెదాలకు అప్లై చేయాలి. అలాగే కొన్ని చుక్కల తేనెను పెదాల మీద రాయడం వల్ల కూడా పెదాలు సున్నితంగా మారుతాయి.

నిమ్మ: సున్నితమైన మరియు పింక్ లిప్స్ మెయింటైన్ చేయాలనుకుంటే వారంలో రెండు సార్లు నిమ్మరసాన్ని పెదాల మీద రాయాలి. నిమ్మ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. పెదాల మీద నలుపును పోగొడుతుంది. మరియు పెదాలను సున్నితంగా పింక్ కలర్ లో ఉంచుతుంది. మీకు పగిలిన, పొడిబారిన మరియు నల్లగా మారిన పెదాలతో బాధపడుతన్నట్లైతే నిమ్మరసం పట్టించే సహజంగా మార్పును పొందండి.

పంచదార: డెడ్ స్కిన్ సెల్స్ మరియు మురికి మీ పెదాలను పొడిగా మరియు డార్క్ గా మార్చుతుంది. లిప్స్ ను క్లీన్ చేసి, వాటిని సున్నితంగా మరియు పింక్ కలర్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొద్దిగా నీటిలో కొద్దిగా పంచదా వేసి పెదాల మీద స్ర్కబ్ చేయాలి. ఇది పెదాల రంగును మార్చుతుంది మరియు పెదాలు సున్నితంగా మార్చడానికి సహాయపడుతుంది.

English summary

Tips To Maintain Soft Baby Lips

Having soft lips is something that all women desire for. It looks nice and the effect of lip colours is more sexy when the lips are soft. It is not easy to maintain the kissable lips. No lipstick, gloss or lip makeup can cover up the hard and chapped lips.
Desktop Bottom Promotion