For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందమైన గోళ్ళు పొందడానికి ఆలివ్ ఆయిల్ బెస్ట్.!

|

అందం విషయంలో చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ ఎంత ముఖ్యమో, అలాగే గోళ్ళ సంరక్షణ కూడా అంతే ముఖ్యం. చేతులకు అందాన్నిచ్చేది, చేతి వేళ్ళు మరియు గోళ్ళు.
గోళ్ళు అందంగా ఉండాలంటే చేతులతో పాటు గోళ్ళు కూడ సున్నితంగా ఉండాలి. పొడి, పెళుసు మరియు ఎల్లో నెయిల్స్ నిజంగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇటి గోళ్ళ సమస్యలను ఎదుర్కోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. గోళ్ళ సంరక్షణలో ఆలివ్ ఆయిల్ చాలా సమర్థవంతమైన ఫలితాలు చూపించింది. కొన్ని సంవత్సరాలను ఆలివ్ ఆయిల్ ను అనేక బ్యూటీ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు.

అదేవిధంగా ఆలివ్ ఆయిల్ ను నెయిల్ కేర్ కోసం ఉపయోగస్తున్నారు. మెరిసే, బలమైన మృదువైన మరియు తెలుపు నిగనిగలాడే గోర్లు పొందుటకు, మీరు ఆలివ్ నూనెను అప్లై చేసుకోవచ్చు. నెయిల్ కేర్ లో ఆలివ్ ఆయిల్ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం..

Uses Of Olive Oil For Nail Care

1. పెళుసుగా మారిన గోళ్ళు: గోళ్ళు పొడిబారినప్పుడు పెళుసుగా మారడం సహజం. గోళ్ళలో నూనె మరియు స్వేద గ్రంధులు కలిగి ఉండి, గోర్లును తేమనగా ఉంచడం చాలా ముఖ్యం. ఆలివ్ ఆయిల్ ను ప్రతి రోజూ రాత్రుల్లో చేతులకు అప్లై చేయడం వల్ల పెళుసుగా మారిన గోళ్ళుకు సహజ సంరక్షణ కలిగిస్తాయి . ఇలా వారంలో మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2. సాప్ట్ నెయిల్స్: మృదువైన గోర్లు పొందుటకు తేనె తో ఆలివ్ నూనె కలపాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి గోర్లకు అలాగే క్యూటికల్స్ కు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత పది నిముషాలు అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. గోళ్ళను సాప్ట్ గా చేసుకోవడానికి ప్రతి వారంలో రెండు సార్లు ఇలా చేస్తుండాలి.

3. గోళ్ళు పెరుగుదల: నెయిల్ కేర్ లో ఇది మరో అద్భుతమైన ప్రయోజనం. ఆలివ్ ఆయిల్ ను టమోటో గుజ్జు లేదా టమోటో జ్యూస్ తో మిక్స్ చేసి అప్లై చేయాలి. దీన్ని చేతి వేళ్ళకు, గోళ్ళకు మరియు క్యూటికల్స్ కు అప్లై చేయాలి. అదే విధంగా ఈ రెండింటి మిశ్రమంలో 10-15నిముషాలు చేతి వేళ్ళను నానబెట్టుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల గోళ్ళు చాలా సులభంగా పెరుగుతాయి. టమోటోలో బయోటిన్ ఉండటం వల్ల గోళ్ళు సహజంగా పెరగడానికి సహాయపడుతుంది.

4. సాఫ్ట్ క్యూటికల్స్ : చేతి వేళ్ళు మరియు గోళ్ళు చుట్టు ఉన్న చర్మం పైపొర పొడిబారిన లేదా కఠినంగా మారినా, వాటికి సరైన గోళ్ళ సంరక్షణ అవసరం. కాబట్టి, స్నానం చేసిన తర్వాత మరియు నిద్రకు ఉపక్రమించే ముందు చేతులకు మరియు గోళ్ళకు ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. పొడి బారిన గోళ్ళు: డ్రై నెయిల్స్ ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ ను ప్రతి రోజూ మూడు సార్లు అప్లై చేయాలి. ఇది పొడి బారిన గోర్లకు చికిత్సగా మాత్రమే కాదు, గోళ్ళు, వేళ్ళుకు మంచి మెరుపు వస్తుంది. చేతులకు, అరచేతికి ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల చేతులు సాప్ట్ గా మారుతాయి.

నెయిల్ కేర్ లో ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలివి. వీటిని ఉపయోగించి ఫర్ఫెక్ట్ వైట్, స్ట్రాంగ్ మరియు షైనీ నెయిల్స్ ను పొందండి.

English summary

Uses Of Olive Oil For Nail Care

Dry, brittle and yellow nails are really embarrassing. There are many ways to deal with nail problems like these. However, olive oil has shown effective results in nail care. Since many years, olive oil has been used for various beauty purposes.
Story first published: Tuesday, August 20, 2013, 11:44 [IST]
Desktop Bottom Promotion