For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేకింగ్ సోడాతో చంకల్లో నలుపును తొలగించే మార్గాలు

By Super
|

ప్రతి అమ్మాయికి శరీరం మీద ఉండే అవాంఛిత రోమాలతో ఇబ్బందికరమే. వాటిని రెగ్యులర్ గా తొలగించడానికి ప్రతి రోజూ రేజర్స్, క్రీములు లేదా వ్యాక్సింగ్ వంటివి చాలా అవసరం. ఈ అవాంఛిత రోమాల సమస్య వల్ల డార్క్ ఆర్మ్స్ అండర్ ఆర్మ్(చంకల క్రింది భాగం)లో నల్లగా ఉంటుంది. చంకల్లో ఈ నల్లటి ప్యాచ్ లను తొలగించడానికి చాలా కష్టంగా భావిస్తారు. ఆ డార్క్ ప్యాచ్ లు చూడటానికి అసహ్యంగా కనిపించడమే కాదు, అమ్మాయిలు, స్లీవ్ లెస్ డ్రెస్సులు వేయాలంటే చాలా కష్టంగా ఫీలవుతారు.

చంకల్లో బ్లాక్ ప్యాచెస్ (నల్లని ప్యాచ్ లు) ఏర్పడటానికి కొన్ని సాధారణ కారణాలు :
• క్రమం తప్పకుండా మీ చంకలలో షేవింగ్ చేయడం వల్ల నల్లని చర్మం ఏర్పడటానికి కారణం కావచ్చు .
• కొన్ని పదార్థాలు వాణిజ్యపరంగా అందుబాటులో ఉండే deodorants మరియు పరిమళ ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల చర్మం రంగు మారడానికి కారణంకావచ్చు .
• వైద్యపరంగా భాహ్యచర్మపొర యొక్క జీవకణములు దళసరియగుట వల్ల నల్లగా చంకల్లో నల్లగా మారడానికి కారణం కావచ్చు.
• అధికంగా చెమట పట్టడం వల్ల చంకల్లో బాక్టీరియా మరియు ఆ ప్రాంతంలో ఎక్కువ రాపిడి కలగడం వల్ల కూడా చర్మం యొక్క రంగు మారడానికి కారణం కావచ్చు.

 Baking Soda

చంకల్లో బ్లాక్ ప్యాచ్ లను నివారించడం:

చంకల్లో బ్లాక్ ప్యాచ్ లను నివారించడానికి ప్రస్తుత రోజుల్లో అనేక మార్గాలున్నాయి. అందులో కొన్ని ఉత్తమ వంటింటి చిట్కాలుంటే, మరొకటి, డెర్మటాలజిస్ట్ ను సంప్రధించడం అవసరం.

వంటింటి చిట్కాల కోసం బ్లీచింగ్ ఏజెంట్సైన నిమ్మ మరియు పొటాటో, ఎక్స్ ఫ్లోయేటింగ్ ఏజెంట్స్ మరియు వైటనింగ్ ఏజెంట్స్ వంటివెన్నో బ్లాక్ ప్యాచ్ ను తొలగించుకోవడానికి ఉపయోగిస్తుంటారు. మరియు ప్రతి వంటగదిలో అందుబాటులో ఉండే బేకింగ్ సోడా . చంకల్లో నలుపును నివారించడానికి బేకింగ్ సోడా చాలా బాగా ఉపయోగపడుతుందని కనుగొన్నారు. అంతే కాదు, ఫౌల్ వాసనను తొలగిస్తుంది. ఇంకా సెన్సిటివ్ స్కిన్ కసం మరియు మొటిమలున్న చంకలో బ్లాక్ ప్యాచ్ లను నివారించడం కోసం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాను ఎటువంటి చర్మ తత్వం ఉన్నవారైనా ఉపయోగించవచ్చు.

ఆర్మ్ పిట్ బ్లాక్ ప్యాచ్(చంకల్లో నలుపు)నివారించడానికి బేకింగ్ సోడా ఉపయోగించే కొన్ని ప్రాథమిక పద్ధతులన్నాయి:

1. బేకింగ్ సోడా స్ర్కబ్: మీ చంకల్లోని నలుపును నివారించాలి. లేదా తేలికచేయాలనుకుంటే, బేకింగ్ సోడాతో రెగ్యులర్ గా స్ర్రబ్ చేయాలి. ఇంట్లోనే నేచురల్ స్కిన్ స్ర్కబ్ ను ఉపయోగించవచ్చు. అందుకు కొంత బేకింగ్ సోడా తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా తయారుచేయాలి. ఇప్పుడు ఈ సేస్ట్ ను చంకలక్రింద స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం క్రింద నల్లగా మారడానికి ప్రధానకారణం అయిన డెడ్ స్కిన్ తొలగిస్తుంది .

2. బేకింగ్ సోడా ప్యాక్ : పెసరపిండి కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం, పసుపు, చిటికెడు బ్లీచింగ్ పౌడర్ మరియు పెరుగు వేసి బాగా మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను చంకల్లో అప్లై చేసి, అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత డియోడరెంట్ కు బదులు బేకింగ్ సోడాను చంకల్లో అప్లై చేయాలి.
3. బేకింగ్ సోడా డియో: చంకల్లో డియోడరెంట్స్ లేదా యాంటీ పర్స్ పిరెంట్ బదులుగా బేకింగ్ సోడా లేదా ఆలమ్ ను నేరుగా అప్లై చేయండి. ఇది అదనపు మాయిశ్చరైజర్ గా గ్రహిస్తుంది. మరియు చంకల్లో దుర్వాసన అభివృద్ధిని నిరోధిస్తుంది .

4. బేకింగ్ సోడా క్లెన్సర్ : బేకింగ్ సోడా మరియు వెనిగర్ ను ఉపయోగించి క్లెన్సర్ గా వాడుకోవచ్చు. ఈ పేస్ట్ తయారుచేయడానికి వైట్ వెనిగర్ లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించి రోజుకు రెండు సార్లు ఉపయోగించవచ్చు. సోడా ప్రక్షాళన 4.Baking - మీరు బేకింగ్ సోడా మరియు వినెగార్ కలపడం ద్వారా మీ స్వంత తెల్లబడటం ముసుగు చేయవచ్చు . మీరు ఈ బేకింగ్ సోడా కలిపేటప్పుడు బుడగల వస్తే అయోమం చెందాల్సి అవసరం లేదు. ఈ పేస్ట్ ను ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత మీరు చంకల్లో రెగ్యులర్ గా అప్లై చేసుకోవాలి. వీటికి బదులుగా బేకింగ్ సోడా నిమ్మరసంకూడా మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పైన చెప్పబడిన చిట్కాలు రాత్రికి రాత్రే ఫలితాలనిచ్చేయవ్వు, రెగ్యులర్ గా కొద్ది రోజుల పాటు ఉపయోగించడం వల్ల తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. చర్మం క్రింద ఉండే నలుపును నివారించడానికి క్రీములు, రేజర్స్ వంటివి ఉపయోగించడం కన్నా ఈ బెస్ట్ చిట్కాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను ఉపయోగించవచ్చు. అవాంఛిత రోమాలను తొలగించడినికి ఈ చిట్కాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి. కాబట్టి, ఒపికగా ప్రయత్నించి, మంచి ఫలితాలను పొందండి.

English summary

Ways To Lighten Armpit With Baking Soda

Body hair is one unwanted thing for every girl. So removing them regularly using razors, hair removal creme or wax is very essential.
Desktop Bottom Promotion