For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ స్ర్కబ్బింగ్ వల్ల చర్మానికి కలిగే 10 లాభాలు: వింటర్ స్పెషల్

|

బాడీ స్ర్కబ్ అంటానే గ్లోయింగ్ స్కిన్ అనేవిషయం గుర్తుకు రావాలి. శరీరం, చర్మ ఛాయ అందంగా, హైడ్రేషన్ లో మంచి మెరుపుతో ఉండాలన్నా మరియు మన చర్మకాంతిని పెంచే మాయిశ్చరైజ్ అందివ్వాలన్నా చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్, మురికి మరియు ఆయిల్ ను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. అందుకు బాడీ స్ర్కబ్స్ బాగా సహాయపడుతాయి. చర్మం ఛాయను మెరుగుపరచుకోవడానికి మరియు శరీరం కాంతివంతంగా మెరిపించడంకోసం అవసరం అయ్యే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్లో అనేకం ఉన్నాయి.

అంతే కాదు, మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే స్ర్కబ్బింగ్ మెటీరియల్ అయినా, హోం మేడ్ స్ర్కబ్బింగ్ మెటీరియల్ అయినా ఉపయోగిస్తే శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా వింటర్ సీజన్ లో స్ర్కబ్బింగ్ వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చు.ఇంట్లోనే చర్మానికి ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవడం వల్ల చర్మం తేమగా మరియు క్లియర్ గా ఉంటుంది.

ఈ వింటర్ సీజన్ లో మీరు హెల్తీ స్కిన్ పొందాలంటే, స్ర్కబ్బింగ్ వల్ల మీరు పొందే కొన్ని బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని మీరు స్నానం చేసే ప్రతి సారి ఉపయోగించుకోవచ్చు. మరి బాడీ స్ర్కబ్బింగ్ వల్ల మీరు పొందే అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోవాలంటే ఈక్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ పొందవచ్చు

క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ పొందవచ్చు

స్ర్కబ్బింగ్ క్లీన్ మరియు క్లియర్ స్కిన్ పొందడానికి సహాయపడుతుంది. ఈ స్ర్కబ్బింగ్ ను తయారుచేయారుచేసుకోవడానికి తేనె మరియు షుగర్ మిక్స్ చేసి వారానికి ఒక సారి శరీరానికి అప్లై చేసి మర్దన చేసి స్నానం చేయాలి.

చర్మం మీద పొట్టులా రాలుతుంటుంది

చర్మం మీద పొట్టులా రాలుతుంటుంది

చర్మం మీద ఇలా పొట్టులా రాలడం వల్ల అది డ్రై ప్యాచ్ స్కిన్ లా కనబడేలా చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఫ్లాకి స్కిన్ ఉంటుందో అప్పుడు డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడటానికి కారణం అవుతుంది. కాబట్టి, బాడీ స్ర్కబ్బింగ్ వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది

ప్రతి రోజూ బాడీ స్ర్కబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను దూరంగా చేస్తుంది.

ఫర్ఫెక్ట్ గ్లో

ఫర్ఫెక్ట్ గ్లో

డైలీ ఎక్స్ ఫ్లోయేషన్ వల్ల చర్మంలో కాంతి పెరుగుతుంది . అందుకు మీరు చేయాల్సిందల్లా పాలలో ఒక కప్పు బియ్యంను రెండు గంటలు నానబెట్టుకోవాలి . రెండు గంటల తర్వాత దీన్ని పేస్ట్ లా చేసి, ముఖానికి అప్లై చేసి బాగా సున్నితంగా మర్దన చేయాలి. ఆటోమ్యాటిక్ గా చర్మం కాంతివంతంగా మారడాన్ని మీరు గమనించవచ్చు.

డార్క్ ప్యాచెస్ ఉండవు

డార్క్ ప్యాచెస్ ఉండవు

వాల్ నట్ పౌడర్లో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మీ శరీరంలో డార్క్ ప్యాచెస్ తొలగిపోతాయి. వింటర్లో శరీరంను స్ర్కబ్ చేయడం వల్ల ఇది ఒక మంచి ప్రయోజనం పొందవచ్చు.

ముఖం మీద చారలు మరియు మచ్చలు

ముఖం మీద చారలు మరియు మచ్చలు

ముఖంలో ఏర్పడ్డ మొటిమల వల్ల ఏర్పడ్డ నల్లమచ్చలు తొలగించుకోవడానికి ఎక్స్ ఫ్లోయేషన్ బాగా సహాయపడుతుంది. అందుకు ఒక బేసిక్ స్ర్కబ్బింగ్ బాగా సహాయపడుతుంది. అందుకు ఒక చెంచా బేకింగ్ సోడా మరియు ఒక చెంచా నీటిలో మిక్స్ చేసి శరీరానికి అప్లై చేసి మర్దన చేసి, స్నానం చేయాలి.

పెరగని అవాంఛిత రోమాలు

పెరగని అవాంఛిత రోమాలు

శరీరానికి స్ర్కబ్బింగ్ చేయడం వల్ల పెరగని అవాంచిత రోమాలను తొలగించుకోవచ్చు . అందుకు ఒక నిమ్మకాయ రసాన్ని బౌల్లో తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ మిక్స్ చేసి, కొద్దిగా నీళ్ళు కలిపి ఉపయోగించడం వల్ల ఇది అవాంఛిన రోమాలను తొలగిస్తుంది.

స్మూత్ స్కిన్

స్మూత్ స్కిన్

హోంమేడ్ స్ర్కబ్ ను ఉపయోగించి స్మూత్ స్కిన్ పొందవచ్చు. అందుకు ఒక కప్పు బాదం పౌడర్ మరియు రెండు చెంచాల తేనె మరియు మిల్క్ క్రీమ్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కనీసం వారానికొకసారి ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి చర్మాన్ని సున్నితంగా, నునుపుగా మార్చుతుంది.

మీకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది

మీకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది

మీ శరీరానికి స్ర్కబ్బింగ్ చేయడం వల్ల అది మీకు ఒక మంచి స్కిన్ స్ట్రక్చర్ పొందడానికి సహాయపడుతుంది.

మంచి కంప్లెక్షన్ ను అందిస్తుంది

మంచి కంప్లెక్షన్ ను అందిస్తుంది

హోం మేడ్ స్ర్కబ్బింగ్ తో మరింత బెటర్ గా ఫలితాలను పొందవచ్చు. హోం మేడ్ స్ర్కబ్బింగ్ బల్ల చర్మం యొక్క కాంతి మరింత బెటర్ గా మారుతుంది.

English summary

10 Benefits Of Scrubbing Your Body

Though there are endless body scrubs available in the market, selecting a good homemade one is ideally better. Scrubbing your face at home with natural ingredients will help to make your skin glow and keep away those nasty zits from popping up.
Desktop Bottom Promotion