For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోని దుర్వాసనను నిర్మూలించడానికి ప్రయత్నించే 15 గృహ చిట్కాలు

By Super
|

యోని వాసన అనేది స్త్రీలలో ఒక సాధారణ సమస్య. యోని వాసన యోని నుండి వచ్చే భరించలేని వాసన. ఇది బాక్టీరియా లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్, లైంగిక సంక్రమణ వ్యాధి, పరిశుభ్రత లేకపోవడం వల్ల కూడా వస్తుంది. యోని వాసన చాలా చికాకుగా ఉంటుంది: అందువల్ల, దీనిని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా చికిత్స చేయడం అవసరం.

కారణాలు

యోని వాసనకు అత్యంత సాధారణ కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

మూత్రవిసర్జన ఇన్ఫెక్షన్

గనేరియా

తీపిపదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం

బాక్టీరియా వేజినోసిస్

పెల్విక్ ఇంఫ్లిమేటరీ డిసీజ్

లైంగిక సంక్రమణ వ్యాధి

ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం

జననే౦ద్రియాలపై హెర్పెస్

బిగుతైన బట్టలు

డచింగ్

సుగంధ, కఠినమైన సబ్బులు వాడడం

లక్షణాలు

యోని వాసన ఈ క్రింది సూచనలను కలిగి ఉంటుంది:

యోనిలో జిల

ఎర్రగా అవడం

చేపలు లేదా చెడు వాసన

యోని వాసనకు గృహ వైద్యం

ఈ క్రింది సహజ చికిత్సలను ఉపయోగించి ఇంట్లోనే యోని వాసనకు చికిత్స చేయవచ్చు.

పుష్కలంగా నీరు త్రాగండి

పుష్కలంగా నీరు త్రాగండి

యోని వాసనకు నీరు ఉత్తమ మార్గాలలో ఒకటి. మీరు యోని వాసనను పోగొట్టుకోవడానికి కనీసం రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. నీరు జీవక్రియ చర్యను పెంపొందించేటపుడు శరీరం నుండి ప్రమాదకరమైన బాక్టీరియా, టాక్షిన్స ను తొలగిస్తుంది. నీరు యోని వాసనకు కారణమయ్యే ప్రధాన సమస్యలలో ఒకటైన శరీరంలోని అదనపు షుగర్ ని కూడా బైటికి పంపిస్తుంది.

పెరుగు

పెరుగు

పెరుగు తినడం అనేది యోని వాసనను నియంత్రించడానికి చాలా సహాయపడుతుంది. ఇందులో యోని లో PH స్థాయిలను నిర్వహించడానికి సహాయపడే లాక్టోబాసిల్లస్ అధికంగా ఉంటుంది. మీరు పెరుగును యోనిపై కూడా అప్లై చేయవచ్చు. దూదిని తీసుకుని నీటిలో కలిపిన పెరుగులో ముంచండి. ఇప్పుడు, ఈ దూదిని 5 నిమిషాల పాటు మీ యోనిపై ఉంచండి. తరువాత, చల్లని నీటితో మీ యోనిని శుభ్రం చేయండి.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్

యోని వాసనను అరికట్టే ముఖ్య ఉపశమనాలలో టీ ట్రీ ఆయిల్ ఒకటి. ఇది ఒక అద్భుతమైన యాంటీ-ఫంగల్, యంటే-బాక్టీరియల్ మూలిక చికిత్స. కొద్దిపాటి నీటిలో 2 టీ స్పూన్ల ఆయిల్ ను కలపండి. ఇప్పుడు, ఈ ద్రావణంలో దూదిని ముంచి, దానిని మీ యోనిపై కొన్ని నిముషాలు ఉంచండి. మీరు స్నానానికి వెళ్ళే 1 గంటముందు దీనిని అప్లై చేయండి. ఒక వారంపాటు ప్రతిరోజూ ఇలా చేయండి. యోని వాసనను పోగొట్టడానికి ఇది ఒక మంచి మూలిక చికిత్స.

మెంతులు

మెంతులు

1 గ్లాసు నీటిలో 2 టేబుల్ స్పూన్ల మెంతులు నానపెట్టండి, ఒక రాత్రంతా అలా వదిలేయండి. వడకట్టండి, మర్నాడు ఉదయం నిద్రలేచిన తరువాత, అల్పాహారం తీసుకునే ముందు ఈ నీటిని త్రాగండి. ఇలా షుమారు 2 వారాల పాటు చేయండి. యోని వాసనకు మెంతులు మంచి మూలికా ఉపశమనాలలో ఒకటి. దీనిని ప్రతిరోజూ తీసుకుంటే, స్త్రీలలో హార్మోన్ల స్థాయి సరిగా ఉండడానికి అలాగే నెలసరి సైకిల్ రెగ్యులరైజ్ అవ్వడానికి బాగా సహాయపడుతుందని ఋజువైంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి కూడా యోని వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. కొద్దిగా తాజా వెల్లుల్లి మిశ్రమాన్ని తయారుచేసి దానిని యోని గోడలకు అప్లై చేయండి. ఇలా షుమారు 8-10 నిమిషాలపాటు వదిలేయండి. ఈ చికిత్సను అప్లై చేసిన తరువాత స్నానం చేయండి. వెల్లుల్లి యాంటీ-ఫంగల్, యాంటీ-బాక్టీరియల్ కి ఏజెంట్, ఇది యోని వాసనకు కారణమైన బాక్టీరియా పై పోరాడుతుంది.

నిమ్మకాయ నీరు

నిమ్మకాయ నీరు

యోని వాసన పరిష్కారానికి నిమ్మ అద్భుతమైన మార్గాలలో ఒకటి. నీటిలో కొన్ని నిమ్మ ఆకులను ఉడికించండి. అవి చల్లారక, ఈ నీటిలో యోనిని శుభ్రం చేయండి. మీరు నిమ్మ నూనెను కూడా ఉపయోగించవచ్చు.

వైట్ వెనిగర్

వైట్ వెనిగర్

ఒక స్నానపు తొట్టెలో గోరువెచ్చని నీటిలో కొద్ది ఉప్పు, అర కప్పు వైట్ వెనిగర్ ని కలపండి. మీ యోనిని అందులో ఉంచండి. వైట్ వెనిగర్ యోని లోని PH బాలెన్స్ ను నిర్వహిస్తూ యోని వాసన సమస్య నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

యాపిల్ పళ్ళరస౦ వెనిగర్

యాపిల్ పళ్ళరస౦ వెనిగర్

యాపిల్ పళ్ళరస౦ వెనిగర్ సూక్ష్మక్రిమి వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంది, అంతేకాకుండా, ఇది యోని వాసనను నిర్మూలించడానికి ప్రభావవంతమైన గృహ వైద్యం. యాపిల్ పళ్ళరస౦ వెనిగర్ కలిపిన గోరువేచ్చని నీటిలో కొద్దిసేపు ఉండండి. యాపిల్ పళ్ళరస౦ వెనిగర్ యోని సహజ ఆమ్ల లక్షణాలను తిరిగి పొందడానికి సహాయపడుతుంది, దానివల్ల, చెడు వాసన నశిస్తుంది.

సిట్జ్ స్నానం

సిట్జ్ స్నానం

మీ సిట్జ్ బాత్ ని గోరువెచ్చని నీటితో నింపండి, అందులో ఎప్సోం సాల్ట్ కొద్దిగా కలపండి. మీ యోనిని అందులో 10 నిమిషాల సేపు ఉంచండి. చెడు యోని వాసన పోవడానికి ఇలా కనీసం రోజుకు రెండుసార్లు చేయండి. యోని వాసన నిర్మూలించడానికి ఇది ఉత్తమ మార్గం.

భారతీయ గూస్బెర్రీ (ఆమ్ల)

భారతీయ గూస్బెర్రీ (ఆమ్ల)

మీదగ్గర భారతీయ గూస్బెర్రీ పచ్చిగా గానీ లేదా పచ్చడి రూపంలో గానీ ఉంటే, అది యోని వాసనను పోగొడుతుంది. భారతీయ గూస్బెర్రీ సహజమైన రక్తాన్ని శుద్దిచేసేది, ఇది యోని వాసనకు కారణమైన లేయుకోర్హోయే వంటి ఏ రకమైన ఇన్ఫెక్షన్ నైనా నిర్మూలిస్తుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా యోని వాసనకు కారణమైన ఇన్ఫెక్షన్ కు వ్యతిరేకంగా పోరాడడానికి ఉపయోగపడే మరో ఉపశమనం, ఇది శరీరంలోని PH బాలెన్స్ ను నిర్వహిస్తుంది. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలపండి. ఈ మిశ్రమాన్ని తాగండి.

దీనికి బదులుగా, మీ స్నానపు నీటిలో బేకింగ్ సోడా కలిపి, అందులో మీ యోనిని ఉంచండి. తరువాత, ఒక శుభ్రమైన టవల్ తో తుడవండి. ఈ పద్ధతి వాసనను త్వరగా నిర్మూలిస్తుంది.

పుల్లని పండ్లను తినండి

పుల్లని పండ్లను తినండి

ఆరంజ్, నిమ్మ, ద్రాక్షపండ్లు, పైనాపిల్ వంటి పుల్లని పండ్లను ఎక్కువగా తినండి. వీటిలో విటమిన్ C అధికంగా ఉండడం వల్ల, ఇవి శరీరం నుండి అనవసరమైన టాక్షిన్స ను తొలగించి మీ అరుగుదల శక్తిని పెంపొందిస్తుంది.

యోని వాసనను నిరోధించడానికి ఇది ఒక సహజమైన మార్గం.

కౌంటర్ బైట దొరికే మందులను ప్రయత్నించండి

కౌంటర్ బైట దొరికే మందులను ప్రయత్నించండి

యోని వాసనను తగ్గించే క్లోరోఫిల్ ద్రవం వంటి కౌంటర్ బైటదోరికే మందుల సహాయాన్ని కూడా తీసుకోవచ్చు. 5-6 టేబుల్ స్పూన్ల క్లోరోఫిల్ ని తీసుకోండి, తరువాత ఎక్కువ నీటిని తాగండి. ఈ ఔషధాన్ని కనీసం 2 వారాలపాటు తీసుకోండి.

వాజిసిల్ ఫెమినైన్ పౌడర్

వాజిసిల్ ఫెమినైన్ పౌడర్

ఇక్కడ అనేకరకాల యోని వాసన ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ‘వాజిసిల్ ఫెమినైన్ పౌడర్', ఇది తేమని త్వరగా గ్రహించి, యోని కింద ఉన్న వాసనను తొలగిస్తుంది. ఇది అదనపు తేమను అందించే 100% టాల్క్ లేని పౌడర్, ఇది యోని వద్ద గల సున్నితమైన చర్మాన్ని రక్షిస్తుంది.

పెర్ఫ్యూం

పెర్ఫ్యూం

మీరు యోని వాసనతో బాధపడుతుంటే, మీ లోపలి తొడల వైపు మీ మోకాలు నుండి కొద్ది పెర్ఫ్యూం చల్లండి, ఇలాచేయడం వల్ల మీ యోని ప్రాంతం చుట్టూ మంచి వాసన వస్తుంది. పెర్ఫ్యూం చాలావరకు చెడు వాసనను తగ్గిస్తుంది.

English summary

15 Tried Home Remedies for Eliminating Vaginal Odor

Vaginal odor is an ordinary problem among females. Vaginal odor is nothing but an unpleasant odor that comes from the vagina. It can be caused due to bacterial or yeast infection, sexually transmitted disease and even due to poor sanitation.
Desktop Bottom Promotion