For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

|

సాధారణంగా వేసవి తాజాగా చల్లగా ఉందని ఊహించుకొంటాము, అయినప్పటికీ వేసవిలో వాతావరణం చాలా వేడిగా మరియు వాతావరణం కూడా తేమగా ఉంటుంది. ఈ వాతవరణంలో కాటన్ డ్రెస్సులో మరియు షార్ట్స్ వంటివి ధరించడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. అలాగే ఐస్ డ్రింక్ కూడా మనకు తాజా దనాన్ని అందిస్తాయి. ఇలా కాకుండా డ్రెస్ కోడ్ లో కాస్త మార్పు వచ్చు మంచి సూట్ మరియు టై వంటివి సమ్మర్ లో స్టైలిష్ గా ధరించాలనుకుంటే, ఇక చెమటలు కారిపోవడమే.

సాధారణంగా ఇతర సీజన్లలో కంటే వేసవి సీజన్ లో చెమటలు పట్టడం ఎక్కువ. చెమటతో పాటు, శరీరం నుండి దుర్వాసన, చెమట వాసన భరించలేకుండా చేస్తుంది. చెమట వల్ల శరీరం మీద పడ్డ దుమ్మ, ధూళీ చేరి బ్యాక్టీరియా ఏర్పడి చాలా చెడు వాసనకు గురిచేస్తుంది. అందుకని మనం నిరంతరం స్నానం చేస్తుండటం, మరియు డియోడరెంట్స్ రాసుకోవడం ఒక్కటే సరిపోదు. ఇవి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా తర్వాత తిరిగి వస్తుంది.

బాడీ ఆడోర్ (శరీరం నుండి చెమట వాసనను)నిర్మూలించడానికి వివిధ రకాలు నేచురల్ హోం రెమడీస్ ఉన్నాయి. ఇవి రోజంతా తాజాగా ఉండేందుకు బాగా సహాయపడుతాయి . మరియు ఈ నేచురల్ రెమెడీస్ ను తయారుచేయడం కూడా చాలా సులభం. బాడీ ఆడర్ ను నివారించడానికి ఈ క్రింద 7 నేచురల్ రెమెడీస్ మీకోసం అంధిస్తున్నాం...

క్లీన్ గా ఉండాలి.

క్లీన్ గా ఉండాలి.

వ్యక్తిగత పరిశుభ్రతతో శరీరం యొక్క దుర్వాసను నివారించవచ్చు. శరీరం అంతాట స్వేదగ్రంధులు ఉన్నందున చెమట నుండి దుర్వాసన ఏర్పడటాకి కారణం అవుతుంది. ఒక రకంగా స్వేధ గ్రంధులు వల్ల శరీరం చల్లగా ఉంచే నేచురల్ ఎయిర్ కండీషన్ గా పనిచేస్తుంది. అయితే, మాయిశ్చరైజర్ మరియు వేడి వల్ల బ్యాక్టీరియా ఏర్పడటానికి కారణం అవుతుంది. దాంతో శరీరం దుర్వాసనకు దారితీస్తుంది . కాబట్టి, ప్రతి రోజూ స్నానం చేయాలి. సాధ్యం అయితే, రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వల్ల శరీరం యొక్క దుర్వాసను నిర్మూలించవచ్చు.

ఒత్తిడి తగ్గించుకోవాలి:

ఒత్తిడి తగ్గించుకోవాలి:

ఈ ఉరుకుల పరుగుల జీవినశైలిలో ఒత్తిడి తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒత్తిడి పెరిగితే శరీరంలో చెమట కూడా పెరుగుతుంది. కాబట్టి, మీరు ఒక ముఖ్యమైన మీటింగ్ కు హాజరవ్వాలనుకున్నప్పుడు, లేదా ఏదైనా ముఖ్యమైన పరీక్ష వ్రాయాల్సివచ్చినప్పుడు మీ శరీరంలో చెమటలు పట్టడం సహజం. కాబట్టి, శరీరంలో చెమట మరియు చెమట వాసన తగ్గించుకోవడానికి ఒక నేచురల్ రెమడీ స్ట్రెస్ లెవల్స్ ను తగ్గించుకోవాలి.

సరైన దుస్తులు ధరించాలి:

సరైన దుస్తులు ధరించాలి:

శరీర దుర్వాసన నిర్మూలించడానికి మరో నేచురల్ రెమెడీ సరైన దుస్తులను మరియు వదులుగా ఉన్న దుస్తులను ఎంపిక చేసుకోవాలి. నేచురల్ ఫైబర్ తో తయారుచేసిన దుస్తులను మరియు కాటన్ దుస్తులను ఎంపిక చేసుకోవడం ద్వారా మీ శరీరం నుండి వెలువడే చెమట కాటన్ దుస్తులు ఎప్పటికప్పుడు పీల్చుకుంటాయి. అటువంటి దుస్తులు గాలి చొరబడటానికి చాలా ఫ్రీగా ఉంటుంది. దాంతో ఇది క్లీన్ గా మరియు డ్రై గా ఉంచుతుంది.

సమ్మర్ ఫుడ్:

సమ్మర్ ఫుడ్:

వేసవి కాలంలో మనం తీసుకొనే ఆహారం మీదనే చెమట కూడా ఆధారపడి ఉంటేంది. కాబట్టి, శరీర దుర్వాసనను తగ్గించుకోవడానికి, వేసవి కాలంటో స్పైసీ ఫుడ్స్ ను నివారించాలి. స్పైసీ ఫుడ్ శరీరం యొక్క ఉష్ణోగ్రతను పెంచి చెమటకు కారణం అవుతుంది.

పాదాలకు సాల్ట్ బాత్:

పాదాలకు సాల్ట్ బాత్:

శరీరంలో దుర్వాసనకు గురిఅయ్యే మరో ప్రదేశం పాదాలు. ముఖ్యంగా సాక్సులు మరియు షులు ధరించే వారిలో మరింత ఎక్కువగా దుర్వాసన ఉంటుంది . మీ శరీరం, పాదాల నుండి వచ్చే చెమట వాసనను నివారించడానికి సాల్ట్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. సాల్ట్ వాటర్ ను కాళ్ళ మీద పోసి, కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

నో స్మోకింగ్:

నో స్మోకింగ్:

స్మోకింగ్ ఆరోగ్యానికి హాని తలపెట్టడంతో పాటు, చెడు శ్వాస మరియు శరీర దుర్వాసనకు గురిచేస్తుంది . వేసవిలో శరీరం నుండి వెలువడే దుర్వాసను నిర్మూలించాలంటే, స్మోకింగ్ చేయడం నిలిపివేయాలి లేదా తగ్గించాలి. టుబాకోలో ఉండే కెమిక్ల్స్ చర్మంలోనికి చాలా తేలికగా చొచ్చుకొని పోగలవు. దాంతో శరీరం దుర్వాసనకు దారితీస్తుంది.

నేచురల్ స్టెరిలైజర్:

నేచురల్ స్టెరిలైజర్:

మీ శరీరంలో అండర్ ఆర్మ్ చాలా చిన్న ప్రదేశాలు. టీట్రీ ఆయిల్ విట్చ్ హాజెల్ వంటి స్టెరిలైజర్స్ తో చంకలో శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే నేచురల్ యాంటీ సెప్టిక్స్ ను ఉపయోగించడం వల్ల దుర్వాసన పెరుగకుండా అలాగే శరీరం మీద బ్యాక్టీరియాను నివారిస్తుంది.

English summary

7 Natural Tips To Prevent Body Odour During Summer

Even though we imagine summer to be fresh and cool, it is more often very hot and humid. This would not be a problem if we had the luxury to wear cotton dresses and shorts and flip flops all the time with an iced drink in hand. Unfortunately, this dress code is a big no in the professional world and we are left sweltering in suit and tie.
Story first published: Tuesday, May 13, 2014, 15:21 [IST]
Desktop Bottom Promotion