For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవాంఛిత రోమాలు తొలగించే వాక్సింగ్ : ప్రయోజనాలు

మీకు బ్యూటీ పార్లర్ కు వెళ్ళే సమయం లేకపోయినప్పుడు, ఇంట్లో మీ స్వంతంగా వాక్స్ తయారుచేసుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటిలో తయారు హెయిర్ రిమూవల్ వాక్స్ లు బ్యూటీ సాలూన్లలో ఉపయోగించే వాటి కంటే చాలా బాగుంటాయ

By Lekhaka
|

మీకు బ్యూటీ పార్లర్ కు వెళ్ళే సమయం లేకపోయినప్పుడు, ఇంట్లో మీ స్వంతంగా వాక్స్ తయారుచేసుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటిలో తయారు హెయిర్ రిమూవల్ వాక్స్ లు బ్యూటీ సాలూన్లలో ఉపయోగించే వాటి కంటే చాలా బాగుంటాయి. ఒక కారణం కోసం - పరిశుభ్రమగా ఉంటుంది మరియు మీకు కోరుకున్నప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు!

తేనెను ఉపయోగించి ఇంట్లో తయారుచేసిన హెయిర్ రిమూవల్ వాక్స్ కు చక్కెర జోడించటం వలన మీ శరీరం నుండి తాన్ తొలగించబడుతుంది. చక్కెర మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది మరియు జుట్టు తొలగింపు కార్యక్రమంలో సులభంగా చర్మం పై పొరను తొలగిస్తుంది.

హోమ్మేడ్ వ్యాక్సింగ్: ప్రయోజనాలు

ఇంట్లో తయారుచేసుకోవటానికి హెయిర్ రిమూవల్ వాక్స్ రెసిపీ:

ఒక సాస్పాన్ లో,చక్కెర ఒక కప్పుతీసుకుని వేడి. చేయండి. చక్కెర కరిగేవరకు బాగా కలుపుతూ ఉండండి. చక్కర నెమ్మదిగా ముదురు గోధుమ రంగులోకి వచ్చేవరకు ఉంచండి. గోదుమరంగుకు వొచ్చిన తరువాత, దానికి కొన్ని చుక్కల తేనె మరియు నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమం బాగా వేడి అయ్యేవరకు బాగా కలుపుతూ ఉండండి. ఆ వాక్స్ బాగా గట్టిపడేవరకు ఉంచండి. మిశ్రమం చాలా గట్టిగా ఉందనుకుంటే, దానికి కొద్దిగా నీరు కలపండి. ఇప్పుడు ఇంట్లో తయారుచేసిన హెయిర్ రిమూవల్ వాక్స్ సిద్ధంగా ఉందన్నమాట. ఒకసారి, స్టవ్ ఆఫ్ చేసి, దానిని ఒక గంటసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచండి. చల్లబడిన తరువాత, దానిని ఒక టిన్ కంటైనర్ లోకి మార్చండి మరియు ఫ్రిజ్ లో ఉంచండి.

ఇంట్లో తయారుచేసిన హెయిర్ రిమూవల్ వాక్స్ వలన కలిగే 5 ప్రయోజనాలు:

ఇంట్లో తయారుచేసిన హెయిర్ రిమూవల్ వాక్స్ వలన కలిగే ప్రయోజనాలలో ఒకటి మీ చర్మం ప్రకాశవంతమవుతుంది మరియు మృదువుగా ఉంటుంది. ఎందుకంటే వాక్స్ తయారీకి ఉపయోగించే సహజ పదార్ధాలే కారణం. మీరు ఇంట్లో తయారయిన హెయిర్ రిమూవల్ వాక్స్ ఉపయోగించినప్పుడు చర్మం దద్దుర్లు లేదా ఏదైనా చర్మ వ్యాధికాని దరి చేరటానికి అవకాశం లేదు. దీనిని మీ మీద మాత్రమే ఉపయోగించబడుతుంది మరియు వేరేవారి మీద ఉపయోగింపబడదు . ఇంట్లో తయారయిన హెయిర్ రిమూవల్ వాక్స్ వలన కలిగే ఇతర ప్రయోజనం, అది మీ చర్మాన్ని తేమగా ఉంచటంలో సహాయపడుతుంది. ఎందుకంటె ఈ వాక్స్ తయారీలో తేనెను ఉపయోగిస్తారు. ఈ హెయిర్ రిమూవల్ వాక్స్ యొక్క ఉత్తమ ప్రయోజనం ఏమిటంటే, దీనివలన అనవసర హెయిర్ ఉత్పత్తి తగ్గుతుంది మరియు పెరిగే నిర్మాణవ్యవస్థను కూడా తగ్గిస్తుంది. ఈ వాక్స్ లో నిమ్మ రసం కూడా ఉండటం వలన హెయిర్ బిరుసుదనాన్ని తగ్గిస్తుంది.

దీనిని వాడటం వలన మీ చర్మం పెలుసుబారుతుంది మరియు చర్మం పై ఉన్న రంధ్రాలు తెరుచుకుని ధూళి చేరనీయవు. ఇది వాక్స్ ఉపయోగించటం వలన కలిగే మరొక ప్రయోజనం.

English summary

Benefits Of Homemade Hair Removal Wax

Preparing homemade hair removal wax using honey added to sugar helps in also removing the tan from your body. Honey also acts as a softener for your skin as sugar is a harder substance which can easily pull the top layer of skin during a hair removal session.
Desktop Bottom Promotion