For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బికినీ ఏరియా వాక్సింగ్ – ఏది మంచి ఎంపిక !!

By Super
|

స్త్రీలు తమ జఘన భాగం శుభ్రంగా ఉంచుకోవడం ఎలా అని తరచుగా ఆలోచిస్తుంటారు. అయితే మీరు వాక్స్ చేసుకోవాలి అనుకుంటే, అందుబాటులో ఉన్న వివిధ రకాల పద్ధతులలో ఒకదానిని మీరు ఎంచుకోవాలని అనుకోవచ్చు. అవును చాలా రకాల వాక్సింగ్ విధానాలు అందుబాటులో వున్నాయి. వాటి జాబితా తో పాటు, వాటి మధ్య తేడాలు ఇక్కడ ఇస్తున్నాం.

బికినీ వాక్స్

బికినీ వాక్స్ ప్యాంటీ లేదా కొన్ని రకాల స్విమ్ సూట్లకు బైటవైపు సాధారణంగా కనిపించే జుట్టును తొలగించడానికి సహజంగా ఈ వాక్స్ ను వాడతారు. జఘన భాగంలోని జుత్తును ట్రిమ్ చేయాలి లేదా పూర్తిగా తొలగించాలి, కానీ పక్కలకు జుత్తు పోకుండా చూసుకోవాలి. ఇలాంటి పద్ధతిని అనేక బ్యూటీ పార్లర్లు అందిస్తున్నప్పటికి చాలామంది ఇంట్లోనే స్వంతగా ఈ శైలిని అనుసరిస్తారు.

Bikini area waxing – which option is better?

బ్రెజిలియన్ వాక్స్

ముందు వైపు, పిరుదుల నుండి మొత్తం జఘన భాగంలో వద్ద ఉన్న జుత్తును బ్రెజిలియన్ వాక్స్ ద్వారా తొలగిస్తారు. ఈ పద్ధతి ఆ ప్రాంతంలో పూర్తిగా జుత్తులేకుండా చేస్తుంది. ఈ మధ్య దీన్నే హాలీవుడ్ వాక్స్ గా పిలుస్తున్నారు. మీరు వెళ్ళే పార్లర్ శుభ్రంగా ఉంది అనుకు౦టే, వారు వాక్స్ స్ట్రిప్స్, వాక్స్ షీట్ లాంటివి తాజా ఉత్పత్తులనే వాడుతున్నారో లేదో చూసుకోండి. ఇది చాలా నొప్పితో కూడుకున్నది, అందుకని భరించడానికి సిద్ధంగా ఉండండి.

ఫ్రెంచ్ వాక్స్

ఈ విధానంలో పొత్తి కడుపు ప్రాంతంలో కొంత మేర వదిలేసి మిగతా జుత్తును తొలగిస్తారు, దాన్ని లాండింగ్ స్ట్రిప్ అంటారు. కొన్నిసార్లు కొంత మంది త్రికోణాకారంలో జుత్తును అలంకరించుకుంటారు. ఇది మీ సాధారణ బికినీ వాక్స్ కి, బ్రజిలియాన్ వాక్స్ కి మధ్య రక౦ అన్నమాట.

వాక్సింగ్ మాత్రమె కాకుండా, జఘన భాగంలో జుత్తు తొలగించడానికి లేసర్ రిడక్షన్ విధానం, షేవింగ్, ఎపిలేటర్లు లేదా హెయిర్ రిమూవల్ క్రీములు లాంటివి వాడడం కూడా చేస్తారు.

English summary

Bikini area waxing – which option is better?

Women often wonder about removing hair from down there in order to keep their pubic area clean. Though there are various methods one can opt for, if you plan to wax it out, you may want to know which kind you’d prefer.
Desktop Bottom Promotion