For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళు మంటలు-పొడికళ్ళు నివారణకు ఉత్తమ చిట్కాలు

|

సివిఎస్‌ : ఇటీవల ఎక్కువగా వ్యాప్తిచెందుతున్న వ్యాధుల్లో ఇదొకటి. దీన్ని మామూలు భాషలో 'పొడి కళ్ళు' అంటారు. కళ్ళు పొడిబారతాయి. నొప్పిగాను, దురదగాను అనిపిస్తుంది. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌' వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10మిలియన్ల మంది 'కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌'కు గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.

Home Remedies for Dry Eyes

ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్లపై పనిచేసేవారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా వున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. కళ్ళమంట, కళ్ళు తడి ఆరిపోవడం, తల, మెడ కండరాల నొప్పులు, తలపోటు, కళ్ళు మసకబారడం వంటివి ఈ సివిఎస్‌ లక్షణాలు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కంప్యూటర్‌ మోనిటర్‌ నుండి జనించే రేడియేషన్‌ ప్రధాన కారణం. దీంతోపాటు కంప్యూటర్‌ వున్న పరిసరాల్లోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్‌ అమరిక, కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌పై పనిచేయడం వంటివి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కళ్ళు తడారపోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం...

కంటి పవర్ ను పెంచే టాప్ పవర్ ఫుడ్స్

- కళ్లు తడి ఆరిపోకుండా శ్రద్ధ వహించాలి. కళ్ళ చుట్టూ వేజలైన్‌పూస్తే మంచిది. ఆల్మండ్‌ ఆయిల్‌ కాని విటమిన్‌ 'ఇ ఆయిల్‌గానీ కంటిచుట్టూ రాయాలి. అరగంట తర్వాత దూదిని నీళ్లలో తడిపి తుడిస్తే మంచిది. ఆ తర్వాత చిక్కటి పాలలో దూదిని ముంచి కళ్ళచుట్టూ సున్నితంగా రాస్తే చర్మానికి తగినంత మాయిశ్చరుగా ఉంటుంది.
- స్వచ్ఛమైన ఆముదం కంటిచుట్టూ, బుగ్గలకు ప్రతిరోజూ రాస్తే ముడతలు పడవ్ఞ. బాదంపొడిని పాలలో నూరి కళ్ళచుట్టూ రాసి, 15నిమిషాల తర్వాత ఐస్‌ముక్కతో తుడిస్తే కళ్ళకింద నల్లనిచారలు, ముడతలు పోతాయి.
మూడు చుక్కల పన్నీరును చిక్కటి పాలలో కలిపి దానిలో చిన్న స్పాంజిముక్క వేసి, ఫ్రిజ్‌లో అరగంట ఉంచిన తర్వాత ఆ స్పాంజిని కొద్దిగా పిండి దానిని కళ్ళపై ఉంచితే కళ్ళమంటలు తగ్గుతాయి.
- కమలాపళ్ళ తొక్కల్ని బాగా ఎండబెట్టి తర్వాత మెత్తగా చూర్ణం చేసి మనకు కావలసి నప్పుడు కొద్దిగా తీసుకొని దానిని పెరుగులో కలిపి ఉంచితే అది పేస్టులా తయారవ్ఞతుంది. దానిని బాగా రంగరించిన తరువాత ముఖానికి రాసుకుని గంట తర్వాత చన్నీళ్లతో కడిగితే ముఖవర్చస్సు పెరిగి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
- పాలమీగడలో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత సున్నిపిండితో స్నానం చేస్తే ఆరోగ్యవంతమైన సౌందర్యంతో పాటు చర్మం ఆకర్షణీయంగా, తెల్లగా నిగనిగలాడుతుంది.
- బాగా మరిగించిన నీళ్ళతో స్నానం చేయటం కన్నా, గోరువెచ్చని నీటితోనే స్నానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
- తల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్న ప్పుడు 'బికాంప్లెక్స్‌ ఐరన్‌ టాబ్లెట్స్‌ యాక్స్‌సాల్‌ క్యాప్సూల్స్‌ ప్రతిరోజూ ఒకటి చొప్పున వేసుకోవాలి.
- తలకి స్నానం చేసేటపుడు ఒంటిసబ్బులు వాడకండి. గోరింటాకులో నిమ్మరసం, కోడిగుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రుపోవటమే కాదు జుట్టు పట్టులా మెత్తగా ఉంటుంది.
- కొబ్బరినూనె సువాసనగా ఉండాలంటే వట్టివేళ్ళుగాని, ఖర్జూరాలు గానీ వేసుకుంటే తాజాగా, మంచి సువాసనగా ఉంటుంది.
మందారపూలు ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి కాచి వడగట్టిన తర్వాత రాసుకుంటే తల వెంట్రుకల ఎదుగుదలకు, జుట్టు రాలకుండా ఉండేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.

English summary

Home Remedies for Dry Eyes

Dry eye syndrome, also known as ocular surface disease or keratoconjunctivitis sicca, is a common problem affecting people today.
Desktop Bottom Promotion