For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు లో స్కిన్ టాన్ తగ్గించుకోవడానికి గృహ వైద్యం

By Super
|

అనేక పాశ్చాత్య దేశాలలో, ప్రజలు స్కిన్ టాన్ ఇష్టపడతారు. కానీ ఇండియా, కొరియా, చైనా వంటి వివిధ ఇతర దేశాలలో స్కిన్ టాన్ కి అంత ప్రాముఖ్యత లేదు. వారు దాన్ని నిజానికి అందవిహీనంగా అలాగే అసహ్యంగా భావిస్తారు. అక్కడ టాన్ స్కిన్ టోన్ ను ఇష్టపడని వారు చాలామంది ఉన్నారు. వేసవి రాగానే ఈ టాన్ స్కిన్ టోన్ తీవ్రంగా ఉంటుంది, అల్ట్రా వైలెట్ కిరణాలు మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఒకప్పుడు స్త్రీలు మాత్రమే తమ టాన్ స్కిన్ టోన్ పై శ్రద్ధ తీసుకునేవారు. కానీ నేడు పురుషులు కూడా ఈ టాన్ స్కిన్ టోన్ పై చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. పురుషులలో స్కిన్ టాన్ ని తగ్గించుకోవడానికి ఇక్కడ అనేక సహజ, గృహ వైద్యాలు ఇవ్వబడ్డాయి.

పెరుగు

పెరుగు

వేసవిలో ప్రతి ఒక్కరూ పెరుగును తీసుకుంటారు, ఇది శరీరాన్ని వేడి నుండి ఉపశమనం కలిగించి చల్లబరుస్తుంది. ఇది మూసుకుపోయిన రంధ్రాలతో ప్రభావితమైన ప్రతి ఒక్కరిలో స్కిన్ టాన్ ని తగ్గిస్తుంది. దీనిని అప్ప్లై చేయడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. కొద్ది టొమాటో, కీరదోస రసాన్ని కలిపినా ఒక కప్పు పెరుగును తీసుకోవడం అవసరం. అందులో అరకప్పు శెనగపిండి ని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అదేవిధంగా మేడమీద అప్లై చేయండి. అలా 30 నుండి 45 నిమిషాల పాటు ఉంచండి, ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడగండి.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మ మరో సహజ బ్లీచింగ్ ఏజెంట్. తాజాగా కోసిన నిమ్మకాయ రసాన్ని తీసుకుని మీ కమిలిన చర్మంపై అప్లై చేయండి. కొద్ది సేపు ఉంచండి ఎక్కువ సేపు ఉంచితే చర్మం పొడిబారుతుంది. దీనిలో కొద్దిగా పంచదార కలిపితే ఇది ఒక అద్భుతమైన సహజ క్లెన్సింగ్ గా పనిచేస్తుంది. దీనిని మీరు వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేసినట్లయితే కావలసిన ఫలితాలను పొందవచ్చు.

బంగాళదుంప

బంగాళదుంప

సూర్యరశ్మి వల్ల కమిలిన చర్మాన్ని మీ శరీరం నుండి తొలగించాలి అనుకుంటే, బంగాలదుంపను కూడా ఉపయోగించవచ్చు. పచ్చి బంగాళదుంప లో విటమిన్ C అధికంగా ఉండడం వల్ల, సహజ బ్లీచ్ ని తయారుచేయడానికి సహాయపడుతుంది. మీరు రెండు చిన్న బంగాళదుంప లను తీసుకోండి. వాటి పై తోలుతీసి స్లైస్ లుగా కట్ చేసి బ్లేందర్ లో వేయండి. దీనిని మీ కమిలిన చర్మంపై పూయండి. దీనిని అరగంట ఉంచండి ఎందుకంటే బంగాళదుంప లోని రసం చర్మంపై ఆవిరికాదు, తరువాత కడిగేయండి.

కలబంద

కలబంద

ప్రతిఒక్కరూ కలబంద మొక్కను మీ పెరటిలో తప్పక ఉంచుకోండి, దీనిలో కొన్ని చర్మానికి సంబంధించిన అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన చికిత్సలు అనేకం ఉన్నాయి. ఒకసారి మీ చర్మంపై కలబంద రసాన్ని అప్లై చేస్తే, ఒక వారం రోజులలోనే మీ చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. ఇది మీ చర్మం పొరను క్లెన్సింగ్ గా, బలంగా ఉండేట్టు కూడా చేస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు మీ చర్మానికి తాజా కలబంద రసాన్ని అప్లై చేయండి. దీనిని ఉదయం పూట కూడా అప్లై చేస్తే మీ స్కిన్ టోన్ తాజాగా ఉంచడమే కాకుండా ఎక్కువసేపు మీ చర్మం మృదువుగా ఉండేట్టు చేస్తుంది.

English summary

Home remedies to reduce tan skin in men

In many western countries, people are quite fond of tanned skin. But in various other countries such as India, Korea and china, tan skin is not preferable. They actually consider it to be very unattractive as well as unaesthetic.
Desktop Bottom Promotion