For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బహుమూలల్లో వెంట్రులక తొలగింపుకు బెస్ట్ హోం టిప్స్

By Super
|

సాధారణంగా యుక్త వయసు వచ్చిందంటే, మహిళలకు చంకల్లో వెంట్రుకల ఎదుగుదల ఒక సమస్యగా వుంటుంది. అయితే, ఈ అనవసరమైన వెంట్రుకల ఎదుగుదలకు మీరు స్పా లకు లేదా అతి ఖరీదైన క్రీముల కొనుగోళ్లకు వెళ్ళనవసరం లేదు. బ్యూటీ పార్లర్ లకు వెళ్లి రెగ్యులర్ గా వాక్సింగ్ వంటివి కూడా చేయిన్చుకోనవసరం లేదు. ఇంటిలోనే, ఈ చంకల కింది అనవసరమైన వెంట్రుకలను తొలగించుకొనవచ్చు. హానిలేని సహజ ఉత్పత్తులను ఉపయోగించి వీటిని తొలగించవచ్చు. అయితే ఈ ఉత్పత్తుల నిష్పత్తులను సరైన పాళ్ళలో కలపాలనేది ప్రధానంగా గుర్తుంచుకోవాలి

చంక కింది భాగాల వెంట్రుకలను సహజంగా తొలగించే మార్గం

Homemade tips to remove the underarm hair

స్టెప్ 1

సరిగ్గా రెండు కప్పుల షుగర్ తీసుకోండి, ఒక పావు కప్పు నీరు, పావు కప్పు తేనె , పావు కప్పు తాజా లెమన్ జ్యూస్ ఒక గిన్నెలో కలపండి.

స్టెప్ 2

బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని వేడి చేయండి. అయితే, ఈ వేడి కొద్దిపాటి మంటతో చేయాలి. ఈ రకంగా ఒక అరగంట వేడి చేయాలి. అపుడు ఆ మిశ్రమం ముదురు బ్రౌన్ రంగుకు మారటం చూస్తారు. కేండి థర్మ మీటర్ పెట్టి చూస్తె అది 246 డిగ్రీల టెంపరేచర్ లో వుంటుంది. ఇపుడు ఆ మిశ్రమాన్ని మీరు స్టవ్ పై నుండి దించి రూమ్ టెంపరేచర్ కి కూల్ చేయండి.

స్టెప్ 3

ఇపుడు మీరు మీ చంకలను నీటితో బాగా శుభ్రం చేయండి. అవి బాగా పొడి అయిన తర్వాత కొద్దిపాటి బేబీ పౌడర్ చల్లండి. శరీరం నుండి అదనపు జిడ్డు తీయాలంటే బేబీ పౌడర్ ఉపయోగించాలి.

స్టెప్ 4

మీరు సహజంగా తయారు చేసిన ఈ వాక్స్ మిశ్రమాన్ని ఇపుడు చంకల్లోని వెంట్రుకల భాగానికి స్పూన్ లేదా చేతితో రాయండి. ఈ చర్య మీరు మొదటి సారి చేస్తున్నట్లయితే, ముందుగా, కొద్ది భాగానికి రాయండి. మీ స్కిన్ పై దాని అలర్జి పరిశీలించండి. ఏ రకమైన అల్లెర్జి లేదా రియాక్షన్ వంటివి చర్మంపై లేకుంటే, దానిని ఇక పూర్తిగా రాయండి. స్టెప్ 5

అలా రాసిన మిశ్రమ పూతను కొద్ది సేపు ఆర నివ్వండి. ఇక అపుడు వేరొక చేతి తో ఆ షుగర్ వాక్స్ మిశ్రమాన్ని చంక కింది భాగం నుండి మెల్లగా తొలగించండి. కొద్దిగా గట్టిగానే, వేగంగా ముడుత పడకుండా లాగాలి.

స్టెప్ 6

ఈ రకంగా షుగర్ మిశ్రమాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత, మిగిలి వుంటే కొద్దిపాటి వేడి గల నీరు, సోప్ లతో చంక భాగాన్ని శుభ్రం చేయండి. ఈ రకంగా శుభ్రం చేసిన చర్మ భాగంపై లైట్ గా మాయిస్చరైసర్ రాయండి. ఇక మీ చర్మం మెత్తగా పట్టు వలే తయారు అయిపోతుంది.

సహజ పద్ధతిలో తయారు చేసిన ఈ షుగర్ వాక్స్ మిశ్రమం పొడిగాను, కూల్ గాను వున్న ప్రదేశంలో నిలువ చేసి, చేతులు, కాళ్ళు లేదా చంక భాగాలలో అనవసరంగా ఎదిగి బాధించే వెంట్రుకల సమస్యను నివారించుకోనవచ్చు. ఈ మిశ్రమం ఒక సారి రిఫ్రిజిరేటర్ లో పెడితే చక్కగా నిలువ వుంటుంది.

Desktop Bottom Promotion