Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
30 తర్వాత కూడా మీరు టీనేజ్ వారిలా కనబడాలంటే...
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ముఖ్యంగా 30 ఏళ్ళు దాటిన వారు ముఖంలో ముడతలు మరియు ఫేస్ లిప్ట్ తో ఆందోళన చెందుతున్నారు . వయస్సు లో ఉన్నప్పుడు మంచి ఆరోగ్యం మరియు బలం ఉండటం వల్ల చాలా అందంగా ఉంటారు. వయస్సులో ఉన్నప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. యవ్వనంలో ఉన్నప్పు ఎంత అందంగా ఉన్నప్పుటీకి వయస్సైన తర్వాత ఆ అందం కాస్త తగ్గుతుంది. ఇరవై ఐదేళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ అందంగా ఉండటానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆ యవ్వనంలో ఉన్న అందాన్ని పొందడానికి కఠినంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను కొనాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం మీ దిన చర్యను ఆరోగ్యవంతంగా ప్రారంభించండి. 30 ఏళ్ళ తర్వాత కూడా మీకు అనుభవించాల్సిన వయస్సు చాలా ఉంది. కాబట్టి, 30 ఏళ్ళ పైబడ్డా కూడా యవ్వనంగా కనబడాలంటే మీకోసం కొన్ని చిట్కాలున్నాయి.

ఫ్రూట్ డైట్
మీరు తీసుకొనే ఆహారమే మీ వయస్సు మరియు మీ అందం మీద ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో మాంసాహరంను తగ్గించి తాజా పండ్లు మరియు కూరగాయలను చేర్చుకోండి.

యాంటీ ఆక్సిడెంట్స్
30 ఏళ్ళ తర్వాత నేచురల్ గా మీరు చూడటానికి యవ్వనంగా కనబడాలంటే యాంటీ యాక్సిడెంట్ ఆహారాలు బాగా పనిచేస్తాయి. అందుకు విటమిన్ సి, ఇ మరియు బీటాకెరోటీన్ అధికంగా ఉన్న ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి టమోటో క్వాష్ మరియు క్యారెట్లు ఒక ఉత్తమ ఎంపిక.

రెగ్యులర్ వ్యాయామం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల 30 ఏళ్ళు పైబడ్డా అందంగా మరియు యవ్వనంగా కనపబడుతారు . కార్డియో వ్యాయామాలు, స్ట్రెచెస్ మరియు వ్యాయామాలు వంటివి చేయడం వల్ల ఎముకల ఆరోగ్యంగా మరియు కండరాల పటుత్వం బలంగా ఉంటుంది.

చర్మ సంరక్షణ
మన శరీరంలో చర్మం అత్యంత ముఖ్యమైనది. మన చర్మ అందమే మన ఆరోగ్యన్ని, వయస్సును తెలుపుతుంది. కాబట్టి, ఎల్లప్పుడు మీ చర్మాన్ని శుభ్రం చేసుకుంటే, సూర్య రశ్మి నుండి చర్మానికి రక్షణ కల్పించాలి. నిరంతరం మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

కెఫి న్ నివారించాలి
ప్రతి ఒక్కరికీ అదనపు ఎనర్జీ పొందడానికి ఒక కప్పు కావాలని కోరుకుంటారు. కానీ, 30 ఏళ్ళ తర్వాత అందంగా, యవ్వనంగా కనబడాలంటే కాఫీ లేద కెఫిన్ ఉన్న పానీయాలను పూర్తిగా నివారించి గ్రీన్ టీకి ప్రాధాన్యత ఇవ్వండి.

జుట్టు సంరక్షణ
వయస్సు పెరిగే కొద్ది జుట్టు యొక్క నాణ్యత మరియు వాల్యుమ్ తగ్గిపోతుంది . కాబట్టి, మీ జుట్టును ఎల్లప్పుడు హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. వారానికొకసారి ఆయిల్ మసాజ్ మరియు కండీషనర్ తప్పనిసరిగా వాడాలి.

ట్రెండీగా ఉండాలి
మీ వయస్సుకు తగ్గట్లు, మీ వయస్సుకు సరిపోయే ష్యాషన్ మరియు ట్రెండ్స్ ను అనుసరించండి. 30ఏళ్ళ తర్వాత యవ్వనంగా కనబడటానికి ఇది ఒక సులభమైన ట్రిక్.

నీళ్ళు
ప్రతి రోజూ 8 నుండ 12 గ్లాసుల నీళ్ళు తప్పనిసరిగా త్రాగాలి. 30ఏళ్ళ తర్వాత యవ్వనంగా కనబడాలంటే నీళ్ళు ఒక నేచురల్ పదార్థం. మీ చర్మం ఎల్లప్పుడు, తేమగా మరియు యవ్వనంగా కనబడుతుంది.

స్మోకింగ్ మరియు డ్రింకింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి
స్మోకింగ్ టుబాకో మీ ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది . మరియు వయస్సు మీద , చర్మ సౌందర్యం మీద ప్రభావ చూపుతుంది. కాబట్టి, సాధ్యం అయినంత వరకూ ఈ రెండింటిని మానేస్తే 30 ఏళ్ళ తర్వాత కూడా మీరు టీనేజ్ వారిలా కనబడుతారు.



Click it and Unblock the Notifications
