For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గడ్డం సాఫ్ట్ గా& షైనీగా మార్చుకోవడానికి టిప్స్

|

పురుషుల లక్షణాలలో ఒక ప్రధాన లక్షణం గడ్డం. చాలా మంది పురుషులు గడ్డం పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఒత్తుగా నున్నగా ఉండే గడం అంటే వారికి ఇష్టమే. అలాగే మెయింటైన్ చేస్తుంటారు కూడా. అయితే కొంత మందిలో సమస్యఏంటంటే గడ్డం రఫ్ గా ఉంటుంది. ముద్దు పెట్టుకోవడానికి ఇబ్బందిగా, ఉంటుంది, లేదా ఇతర బుగ్గలకు ఆనించడానికి కూడా రఫ్ గా ఉండటం వల్ల గర్లఫ్రెండ్స్ నిరాకరిస్తుంటారు. అంతే కాదు గడ్డం వల్ల ముఖ చర్మమం కూడా రఫ్ గా మారుతుంది. గడ్డంను సరిగా మెయింటైన్ చేయకపోతే ఇలా జరగడం సహజం.

Tips To Make Your Beard Soft

ఇక ఈ ఆర్టికల్లో గడ్డంను ఎలా సాఫ్ట్ గా మరియు షైనీగా మెయింటైన్ చేయాలో తెలపడం జరిగింది. అందుకోసం కొన్ని సులభమైన చిట్కాలను ఈ క్రింది విధంగా అందిస్తున్నాం. వీటిని కనుక అనుసరించినట్లైతే గడ్డం పెంచుకొనేవారికి మరింత బెస్ట్ రిజల్ట్ పొందవచ్చు. ఈ చిట్కాల వల్ల గడ్డం రఫ్ నెస్ ను నివారించవచ్చు. సాఫ్ట్ అండ్ షైనీ గడ్డంను పొందవచ్చు.

1. షాంపు: సాధారణంగా పురుషులు తలమీద ఉన్న వెంట్రుకుల కోసం ఏవిధంగా కేర్ తీసుకుంటారో, అదే విధంగా గడ్డం మీద కూడా కేర్ తీసుకోవాలి. తలస్నానం చేసేప్పుడు, తలకు ఉపయోగించే షాంపును గడ్డంకు కూడా ఉపయోగించవచ్చు. వారంలో రెండు సార్లు షాంపు ఉపయోగించడం వల్ల గడ్డం సాఫ్ట్ గా మరియు షైనీగా ఉంటుంది. అంతే కాదు మార్కెట్లో వివిధ రకాలా బ్రీడ్ సాఫ్టనర్ షాంపులు కూడా అందుబాటులో ఉన్నాయి.

2. కండీషనర్: గడ్డం మరింత సాఫ్ట్ అండ్ షైనీగా ఉండాలంటే షాంపుతో పాటు కండీషనర్ కూడా అప్లై చేస్తుండాలి. కండీషనర్ అప్లై చేయడం వల్ల గడ్డంను మాయిశ్చరైజ్ గా ఉండటమే కాకుండా రఫ్ నెస్ ను నివారిస్తుంది. అందుకోసం ఒక మంచి కండీషనర్ ను కూడా వారంలో రెండు మూడు సార్లు ఉపయోగిస్తుండాలి. దాంతో గడ్డం మరింత్ బెటర్ గా కనబడుతుంది, హెయిర్ క్వాలిటీ పెరుగుతుంది . ఫేషియల్ హెయిర్ సాఫ్ట్ గా మార్చేందుకు షాంపూలాగే కండీషనర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

3. ఫేష్ వాష్: ఫేష్ వాష్ చేసుకొన్న ప్రతి సారి ఫేష్ వాష్ లిక్విడ్ తో గడ్డం కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల, గడ్డంలోచిక్కుకున్న దుమ్ము, ధూలి తొలగిపోతుంది . ఇలా దుమ్ము, ధూళి చేరినప్పుడు ఫేషియల్ హెయిర్ మరింత రఫ్ గా మారుతుంది కాబట్టి రెగ్యులర్ ఫేస్ వాష్ కూడా చాలా అవసరం.

4. ట్రిమ్: తరచూ మీరు హెయిర్ ను ఎలా ట్రిమ్ చేస్తుంటారో అలాగే గడ్డం హెయిర్ ను కూడా ట్రిమ్మింగ్ చేయడం వల్ల క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది. మరియు సాఫ్ట్ గా ఉంటుంది. అలాగే రఫ్ గా లేదా డ్రైగా మారిన గడ్డంను రెగ్యులర్ గా షేవ్ చేసి తొలగిస్తుండాలి . దాంతో గడ్డం సాఫ్ట్ గా మరియు షైనీగా మారుతుంది. అలాగే రెగ్యులర్ గా గడ్డంను ట్రిమ్ చేయడం వల్ల గడ్డంకు మంచి షేప్ కూడా వస్తుంది.

5. క్లీన్ షేవ్: ఒక మంచి షేవింగ్ క్రీమ్ మరియు మంచి రేజర్ తో వారానికొకసారి క్లీన్ షేవ్ చేస్తుండాలి. ఇలా చేడయం వల్ల కొత్త హెయిర్ రావడానికి అవకాశం ఉంటుంది. క్లీన్ షేవ్ వల్ల పాత హెయిర్ మరియు రఫ్ గా ఉన్నహెయిర్ తొలగిపోయి, కొత్తగా షైనీ హెయిర్ వస్తుంది. మరియు ఫేషియల్ హెయిర్ సాఫ్ట్ గా మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. న్యూ బ్రీడ్ హెయిర్ సాఫ్ట్ గా మరియు బెటర్ ఫీల్ అవుతారు. అందుకు మీరు ఒక మంచి నాణ్యమైన షేవింగ్ క్రీమ్ మరియు రేజర్ ను ఉపయోగించాలి.

English summary

Tips To Make Your Beard Soft

Beard is an essential part of facial hair for many men. Many feel that their beard is a pride to manhood and love keeping big bushy ones. But the problem with a beard is that is it quite rough. One cannot kiss, rub cheeks or even tough the face with the roughness of beard. This happens when the beard is not maintained and kept properly
Desktop Bottom Promotion