For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్లగా ఉన్నారా..మీరు ఫెయిర్ గా మారే నేచురల్ పద్దతులు

|

సాధారణంగా చాలా మంది ఫెయిర్ గా మరియు మెరిసే చర్మ సౌందర్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు. అందుకు మార్కెట్లో వివిధ రకాలైన బ్యూటీ ప్రొడక్ట్ అందుబాటులో ఉన్నాయి. అవి మీ చర్మాన్ని కొన్ని వారల్లో ఫెయిర్ గా మార్చుతాయని హామీ ఇస్తుంటారు. అయితే అవేవీ పనిచేయవు. మనందరమూ ఫెయిర్ స్కిన్ పొందాలని కోరుకుంటాం. అందుకు కెమికల్స్ తో తయారు చేసిన ఖరీదైన ఫెయిర్ నెస్ క్రీమ్స్ కోసం పర్స్ ఖాలీ చేసుకోవడం కంటే..కొన్ని హోం రెమడీస్ తో నేచురల్ పద్దతులను ఉపయోగించి మీ చర్మం ఫెయిర్ గా మరియు మెరిసేలా మార్చుకోవచ్చు. ఈ హోం రెమడీస్ మీ రెగ్యులర్ స్కిన్ కేర్ లో చేర్చుకోవచ్చు.

మీ చర్మ ఛాయను మెరుగుపరుచుకోవడానికి వివిధ రకాల హోం రెమడీస్ అందుబాటులో ఉన్నాయి. ఉదా: నిమ్మరసం. ఇది మీ చర్మాన్ని శుభ్రపరుచుటకు మరియు చర్మ ఛాయను మార్చడానికి బాగా సహాయపడుతుంది . ఫేస్ ప్యాక్స్ అప్లై చేయడంతో పాటు, హెల్తీ డైట్ ను ఫాలో చేయడం చాలా అవసరం. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడానికి మరియు శరీరాన్ని శుభ్రం చేయడానికి ఫైబర్ మరియు నీటిశాతం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఇవి కూడా చర్మం ఛాయను మార్చడంలో బాగా సహాయపడుతాయి.

సూర్యరశ్మి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి:

సూర్యరశ్మి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి:

మీరు ఫెయిర్ నెస్ స్కిన్ పొందాలని కోరుకుంటున్నట్లైతే ముందు మీరు ఈ చిట్కాను మీరు ఖచ్చితంగా అనుసరించాలి. ఎండలో ఎక్కువగా తిగరకుండా ఉండు, ఒక వేళ తప్పనిసరి వెళ్ళాల్సి వస్తే, ఫుల్ స్లీవ్ డ్రెస్సును ధరించడం వల్ల మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు.

ఎక్స్ ఫ్లోయేషన్:

ఎక్స్ ఫ్లోయేషన్:

నేచురల్ ఎక్స్ ఫ్లోయేషన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. డార్క్ స్కిన్ తొలగించి ఫెయిర్ స్కిన్ పొందడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

నిమ్మరసం :

నిమ్మరసం :

నిమ్మరసం నల్లగా ఉన్న చర్మాన్ని తెల్లగా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసంలో ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల , ఇది నేచురల్ ఎక్స్ ఫ్లోయేట్ గా సహాయపడుతుంది .

బంగాళదుంప స్ర్కబ్బింగ్:

బంగాళదుంప స్ర్కబ్బింగ్:

బంగాళదుంప మరో ఉత్తమ హోం రెమెడీ. బంగాళదుంప రసాన్ని లేదా గుజ్జును మీ సున్నిత చర్మానికి సురక్షితంగా అప్లై చేసి , ఫెయిర్ స్కిన్ పొందవచ్చు.

పసుపు:

పసుపు:

పసుపు ఒక గొప్ప నేచురల్ పదార్థం. మీ శరీరం మీద ఉండే డార్క్ కంప్లెక్షన్ నేచురల్ గా నివారిస్తుంది . అదే విధంగా ఆలివ్ ఆయిల్ లేదా బేబీ ఆయిల్ తో పసుపు మిక్స్ చేసి అప్లై చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది.

కలబంద:

కలబంద:

కలబందలో ఆంథ్రోక్వినోన్ అనే కంటెంట్ ఉండటం వల్ల ఇది చర్మాన్ని తేలికపరుస్తుంది. నలుపును నివారించి, తెల్లగా మార్చుతుంది.

కొబ్బరి నీళ్లు:

కొబ్బరి నీళ్లు:

కొబ్బరి నీళ్ళలో స్మూతింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది డార్క్ కాంప్లెక్షన్ ను తొలగించి ఫెయిర్ స్కిన్ నేచురల్ గా పొందేలా చేస్తుంది . ఈ ట్రిక్ ను అనుసరించడానికి ఎక్కువ సమయం కాదు, కానీ ఫలితం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది.

తేనె మరియు నిమ్మరసం:

తేనె మరియు నిమ్మరసం:

తేనె మరియు నిమ్మరసం డార్క్ స్కిన్ ను ఫెయిర్ గా మార్చే ఒక బెస్ట్ కాంబినేషన్ . ఈ రెండు పదార్థాల యొక్క కాంబినేషన్ స్కిన్ టోన్ ను చాలా ఎఫెక్టివ్ గా మెరుగుపరుస్తుంది.

ఓట్ మీల్ రహస్యం:

ఓట్ మీల్ రహస్యం:

ఓట్ మీల్ చాలా సమర్థవంతమైనదని ఎవ్వరికీ తెలియదు. ఎటువంటి సందేహం లేదు. ఇది మిమ్మల్ని స్లిమ్ గా మార్చుతుంది కానీ, డార్క్ కంప్లెక్షన్ ను మార్చి, తెల్లగా మార్చే బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి . ఓట్ మీల్ మాస్క్ కు పసుపు చేర్చి మాస్క్ వేసుకుంటే, మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయి ఫెయిర్ నెస్ పెంచడంలో చాటా గ్రేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇందులో పెపైన్ అనే ఎంజైమ్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది . కొత్త చర్మ కణాలను కూడా ఉత్పత్తి చేస్తుంది.

పెరుగు:

పెరుగు:

మీ శరీరానికి పెరుగును మర్ధన చేసినప్పుడు, మీ స్కిన్ కంప్లెక్షన్ చాలా త్వరగా మార్చుతుంది . ఎందుకంటే పెరుగులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్ , నిధానంగా స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.

డెలికేట్ రోజ్ వాటర్:

డెలికేట్ రోజ్ వాటర్:

రోజ్ వాటర్ చర్మం యొక్క ఛాయను మార్చే సామర్థ్యం రోజ్ వాటర్ లో పుష్కలంగా ఉన్నాయి . ఇది చర్మంలోని ఎటువంటి మార్క్ అయినా తొలగిస్తుంది మరియు డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది.

శెనగపిండి:

శెనగపిండి:

శెనగపిండి చిట్కా పురాతన కాలం నుండి మనక తెలిసిన ఒక ఉత్తమ హోం రెమెడీ. మన ఇండియన్స్ ఈ పద్దతిని ఎక్కువగా అనుసరిస్తారు . డార్క్ గా ఉన్నవారు ఫెయిర్ గా మర్చడం కోసం శెనగపిండిని రోజ్ వాటర్ లేదా పాలతో మాక్స్ చేసి వారంలో రెండు సార్లు వేసుకోవచ్చు.

పాలు:

పాలు:

పాలతోచర్మం శుభ్రం చేసుకోవడం వల్ల తప్పకుండా స్కిన్ కలర్ ను మెరుగుపరుస్తుంది. పెరుగులో ఉండే సౌందర్యవర్ధక గుణాలే, పాలలో కూడా పుష్కలంగా ఉంది.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

కీరదోసకాయతో ఇతర పదార్థాలను కూడా జోడించి స్కిన్ టోన్ ను మెరుగుపరుచుకోవచ్చు. కీరదోసకాయ పేస్ట్ తో కొబ్బరి పాలు లేదా తేనె చేర్చడం వల్ల మీ చర్మం నేచురల్ గా ఫెయిర్ గా మారుతుంది.

బాదం :

బాదం :

స్కిన్ టోన్ ను మెరుగుపరచడంలో ఉత్తమ హోం రెమెడీ బాదం. బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి, మెత్తగా పేస్ట్ చేసి, తర్వాత దానికి కొద్దిగా పాలు మిక్స్ చేసి తర్వాత ఈ పేస్ట్ ను వారంల రెండు సార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల ఉత్తమ ఫలితం పొందవచ్చు.

English summary

16 Ways To Turn Fair Naturally

In India, people are crazy about fair skin. Indian women and even men crave for fair complexion. To achieve your dream, there are some possible ways to turn dark complexion to fair naturally. However, if you want to become fair in quick time, there are certain things you need to change in your lifestyle. You need to be careful about putting on a tan as it can hinder the possibility of turning fair. Keeping away from the sun for a period of time will help a great deal.
Story first published: Tuesday, January 6, 2015, 12:36 [IST]
Desktop Bottom Promotion