For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్జీవమైన చర్మానికి మెరుపునిచ్చే స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్స్

|

మన దినచర్యలో స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ ను ఫాలో అవ్వడానికి ఒక గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది దినచర్యలో తప్పనిసరిగా పాటించాల్సిన ఆరోగ్య నియమాల్లో ఒకటి . హానికరమైన సూర్యకిరణాలు, ధూళి, మరియు కాలుష్యం వంటి ప్రభావాల వల్ల చర్మం నిస్తేజంగా మరియు నిర్జీవంగా తయారవుతుంది . కాబట్టి, ఎప్పటికప్పుడు ప్రతి రోజూ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవడం వల్ల హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. స్కిన్ స్ర్కబ్బింగ్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి మరియు హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. ఎక్స్ ఫ్లోయేట్ వల్ల బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ తొలగించి చర్మం రిఫ్రెషింగ్ గా కనబడుతుంది. ముఖ్యంగా ఎక్సఫ్లోయేటింగ్ వల్ల మొటిమలు మరియు మచ్చలు కూడా ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి .

READ MORE:నోటి చుట్టూ చర్మం నల్లగా రింగ్ లా కనబడుటను నివారించడానికి ఉత్తమ చిట్కాలు

స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేసుకోవడానికి మార్కెట్లో వివిధ రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ప్రొడక్ట్స్ వల్ల వీటిలో ఉండే కఠిమనమైన, హానికరమైన కెమికల్స్ వల్ల దీర్ఘకాలంలో స్కిన్ డ్యామేజ్ అవ్వొచ్చు .అందువల్ల, హోం రెమెడీస్ స్కిన్ ఎక్సఫ్లోయేట్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. హోం మేడ్ ఎక్స్ ఫ్లోయేటర్స్ సహజమైనవి మరియు చౌకైనవి మరియు అదే విధంగా చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, మంచి ఫలితాలను అందిస్తాయి.

ఈ ఆర్టికల్లో కొన్ని ఎఫెక్టివ్ హోం మేడ్ ఎక్స్ ఫ్లోయేట్స్ ను పరిచయం చేస్తున్నాం....

 లెమన్, ఎప్సమ్ సాల్ట్ మరియు ఆలివ్ ఆయిల్:

లెమన్, ఎప్సమ్ సాల్ట్ మరియు ఆలివ్ ఆయిల్:

నిమ్మరసం, ఎప్సమ్ సాల్ట్ మరియు ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ గ్రేట్ హోం మేడ్ నేచురల్ స్క్రబ్ గా పనిచేస్తాయి . ఎప్సమ్ సాల్ట్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు స్కిన్ టోన్ ను మార్చుతుంది. ఆలివ్ ఆయిల్ స్కిన్ కు అవసరం అయ్యే హైడ్రేషన్ (తేమను) అందిస్తుంది . ఈ మూడింటి మిశ్రమం స్కిన్ ను సాఫ్ట్ గా మరియు కాంతివంతంగా మార్చుతుంది.

బాదం మరియు తేనె:

బాదం మరియు తేనె:

గుప్పెడు బాదంను ఒక టేబుల్ స్పూన్ తేనెతో మిక్స్ చేసి తీసుకోవాలి. లేదా చర్మానికి అప్లై చేయడం వల్ల ఈ మిశ్రమం నేచురల్ స్కిన్ ఎక్సఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మానికి డీప్ గా పోషణ అందిస్తుంది. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మం మీద మచ్చలను క్లియర్ చేస్తుంది.

ఆలివ్ ఆయిల్ మరియు షుగర్:

ఆలివ్ ఆయిల్ మరియు షుగర్:

ఆలివ్ ఆయిల్ మరియు షుగర్ నేచురల్ స్ర్కబ్ . ఈ రెండింటిని మిశ్రమం చర్మాన్ని సాఫ్ట్ గా సపెల్ గా మార్చుతుంది . కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను షుగర్ తో మిక్స్ చేసి ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల అమేజింగ్ రిజల్ట్ ను అందిస్తుంది.

షుగర్ అండ్ వాటర్:

షుగర్ అండ్ వాటర్:

షుగర్ అండ్ వాటర్ ఒక సింపుల్ అండ్ ఈజీ హోం రెమెడీ. ఈ రెమెడీతో చాలా సులభంగా డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించుకోవచ్చు. ఈ సింపుల్ కాంబినేషన్ వండర్స్ ను క్రియేట్ చేస్తుంది. స్కిన్ సాప్ట్ అవుతుంది. డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

ఓట్ మీల్ మరియు బట్టర్ మిల్క్:

ఓట్ మీల్ మరియు బట్టర్ మిల్క్:

మరో పాపులర్ నేచురల్ స్క్రబ్ రెండు చెంచాలా బట్టర్ మిల్క్ లో ఒక చెంచా ఓట్ మీల్ పౌడర్ మిక్స్ చేసి స్కబ్ చేసి రేడియంట్ గ్లోను అందిస్తుంది.

స్ట్రాబెర్రీ స్క్రబ్:

స్ట్రాబెర్రీ స్క్రబ్:

స్ట్రాబెర్రీని రఫ్ గా పేస్ట్ చేసి ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయడం వల్ల ఇది స్కిన్ ఎక్సఫ్లోయేట్ గా పనిచేస్తుంది . మరియు చర్మంలోని ఆయిల్ తగ్గిస్తుంది . వారానికొకసారి ఉపయోగిస్తే మరింత బెటర్ రిజల్ట్ పొందవచ్చు.

 ఎప్సమ్ సాల్ట్ :

ఎప్సమ్ సాల్ట్ :

ఎప్సమ్ సాల్ట్ తో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోవడం చాలా సులభం. ఎప్సమ్ సాల్ట్ ను నీటిలో వేసి మిక్స్ చేయాలి. తర్వాత శరీరానికి ఎక్సఫ్లోయేటర్ గా ఉపయోగించాలి. ఎప్సమ్ సాల్ట్ కఠినంగా ఉండటం వల్ల ముఖం మీద నేరుగా అప్లై చేయకపోవడమే మంచిది.

English summary

7 Natural Homemade Exfoliates : Beauty tips in Telugu

Exfoliating the skin holds a great prominence in the daily skin care regimen. It is one of the essential steps that you should not skip. Our skin gets dull due to its exposure to harmful sun rays, dirt and pollution. Exfoliating the skin, on a regular basis, is necessary to maintain a healthy skin. Scrubbing removes the dead skin and helps in maintaining a healthy complexion. It removes black heads and white heads and makes the skin look refreshing. It even effectively cures acne and pimples.
Desktop Bottom Promotion