For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్జీవమైన చర్మానికి కాంతివంతంగా మార్చే కర్భూజ ఫేస్ ప్యాక్

|

సహజంగా నేచురల్ గా పండే కాయగూరలు కానీ, పండ్లు కానీ, ఆరోగ్యానికి...అందానికి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. అలాంటి పండ్లలో మస్క్ మోలోన్ కర్భూజ పండు ఒకటి. ఇది చర్మంను ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుతుంది. అంతే కాదు, ఇది ఒక సూపర్ స్కిన్ ఫ్రెండ్లీ ఫ్రూట్ . ఈ పండును మనం రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని తినడం వల్ల ఇది చర్మానికి హెల్తీ గ్లోను అందిస్తుంది. మస్క్ మెలోన్ బాడీ స్క్రబ్ ఒక బెస్ట్ నేచురల్ ఫ్రూట్ స్ర్కబ్. దీన్ని చర్మ సౌందర్యానికి ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన మరియు కాంతివంతమైన చర్మంను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ స్కిన్ ను పొందవచ్చు.

మార్కెట్లో ఉండే కమెర్షియల్ గా అందుబాటులో ఉండే బాడీ స్ర్కబ్ ను ఉపయోగించడం వల్ల అనేక చర్మ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మస్క్ మెలోన్ తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది మరియు ఇందులో విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వేసవిలో మనకు అందుబాటులో ఉండే మామిడి, మరియు పుచ్చకాయ, కర్బూజకాయలు ఇవి వేసవిలో ఎక్కువగా దొరుకుతాయి, వీటిలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి . మస్క్ మెలోన్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరియు ఇందులో విటమిన్ డి మరియు మినిరల్స్ (ఫాస్పరస్, క్యాల్షియం,, మెగ్నీషియం, మరియు పొటాషియం)పుష్కలంగా ఉండి, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి..

మస్క్ మెలోన్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మస్క్ మెలోన్ బాడీ స్ర్కబ్ వల్ల మన చర్మం మాయిశ్చరైజింగ్ గా మరియు స్కిన్ హైడ్రేషన్ తో ఉంచుతుంది. చర్మం నిర్జీవంగా, డ్రైగా మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మం హెల్తీగా మరియు రేడియంట్ గా కనిపించాలంటే మస్క్ మెలోన్ తో బాడీ స్క్రబ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది . మస్క్ మెలో బాడీ స్ర్కబ్ ఎక్సలెంట్ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది.

మస్క్ మెలోన్ ను బాడీ స్ర్కబ్ గా ఎలా ఉపయోగించాలో చూద్దాం...

Musk Melon Body Scrub

మస్క్ మెలోన్ -ఉప్పు:
మస్క్ మెలోన్ ను మెత్తగా గుజ్జులా చేసి అందులో కొద్దిగా ఉప్పు లేదా ఫుల్లర్స్ ఎర్త్ ను మిక్స్ చేసి శరీరానికి అప్లై చేసి మర్దన చేయాలి . ఇందులో నీళ్ళు అధికంగా ఉండటం వల్ల మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మరియు ఇది ముడతలు లేకుండా చేస్తుంది.

మస్క్ మెలోన్ -షుగర్:
మస్క్ మెలోన్ తొక్క, మరియు లోపలి విత్తనాలను తొలగించి, ముక్కలుగా చేసి, అందులో పంచదార వేసి మిక్స్ చేయాలి. పంచదారకు బదులుగా బ్రౌన్ షుగర్ వేస్తే మంచి ఫ్రాగ్రెన్స్ ను అందిస్తుంది . దీన్ని శరీరానికి మర్ధన, లేదా మసాజ్ చేస్తే శరీరం మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి మిమ్మల్ని యవ్వనంగా కనబడేలా చేస్తుంది.

Musk Melon Body Scrub

మస్క్ మెలోన్ -లావెండర్:
1/8శాతం మస్క్ మలోన్ ముక్కలు, ఒక చెంచా తేనె, ఒక చెంచా లావెండర్ ఆయిల్ మరియు కార్న్ మీల్ ను బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి, 15నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ఒక మంచి మాయిశ్చరైజింగ్ స్ర్కబ్.

Musk Melon Body Scrub

మస్క్ మెలోన్ -కివి:
అరకప్పు మస్క్ మెలోన్ కట్ చేసి అందులో 1/2 కివి పండు ముక్కలు వేసి , అందులో 1/3కప్పు గ్రేప్ సీడ్ ఆయిల్ మరియు 1/3కప్పు సాల్ట్ వేసి మిక్స్ చేసి మొత్తం మిశ్రమాన్ని శరీరానికి ముఖం, మెడకు అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇది మీ చర్మంను సాఫ్ట్ గా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది.

మస్క్ మోలోన్ -కీరదోసకాయ:
తొక్క, విత్తనాలు తొలగించిన మస్క్ మెలోన్ ముక్కల్లో కొద్దిగా కీరదోసకాయ ముక్కలు వేసి అందులో ఫ్రెష్ సీ సాల్ట్ మరియు షీ బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేయాలి . మస్క్ మెలోన్ బాడీ స్ర్కబ్ మీ చర్మంను మాయిశ్చరైజింగ్ మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది.

Musk Melon Body Scrub

మస్క్ మెలోన్ --స్ట్రాబెర్రీ:
మస్క్ మెలోన్ ముక్కలు, స్ట్రాబెర్రీ 3 వేసి, అందులో ఒక చెంచా ఓట్ మీల్ మరియు ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేసి శరీరం మరియు ముఖం, మెడకు అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. 15నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మీ చర్మంను తేమగా మరియు సాఫ్ట్ గా ప్రకాశవంతంగా మార్చుతుంది.

మస్క్ మెలో-శెనగపిండి: ఒక కప్పు మస్క్ మెలోన్ జ్యూస్ తీసుకొని అందులో శెనగపిండి వేసి మిక్స్ చేయాలి. బాడీ మొత్తం స్క్రబ్ చేసి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీ చర్మం ఎక్స్ ఫ్లోయేట్ మరియు సాఫ్ట్ గా మరియు రేడియంట్ గా మారుతుంది.

English summary

Musk Melon Body Scrub

Generally, fruits are great for your skin. Fruit scrubs are good in keeping your skin healthy and vibrant. Among these, musk melon is one such super skin-friendly fruit. This, when goes inside our system brings about a healthy glow to our skin.
Story first published: Saturday, February 28, 2015, 18:24 [IST]
Desktop Bottom Promotion