For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అండర్ ఆర్మ్ స్ట్రెచ్ మార్క్స్ తొలగించటానికి సింపుల్ టిప్స్

By Super
|

స్ట్రెచ్ మార్క్స్ గురించి చెప్పినప్పుడు మొదట మీకు గర్భధారణకు సంబంధించినదని అనిపిస్తుంది. కానీ ఈ స్ట్రెచ్ మార్క్స్ పురుషులు మరియు మహిళలు ఇద్దరిని ప్రభావితం చేస్తాయి.

సాదారణంగా అండర్ స్ట్రెచ్ మార్క్స్ కొరకు పరిష్కారాల కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే కొన్ని రకాల దుస్తులను వేసుకున్నప్పుడు అసహ్యంగా కనిపించవచ్చు.

శరీరంలో కొవ్వు ఉన్న ప్రాంతాలలో ఈ స్ట్రెచ్ మార్క్స్ అభివృద్ధి చెందుతాయి. ఇవి ఛాతీ, పిరుదులు కింద,బొడ్డు, తొడల వద్ద ఏర్పడతాయి.

READ MORE: బ్రెస్ట్ స్ట్రెచ్ మార్క్స్(రొమ్ముల మీద ఛారలు)నివారణ చిట్కాలు

ఇప్పుడు అండర్ స్ట్రెచ్ మార్క్స్ ని వదిలించుకోవటం ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చింతించకండి. మేము మీకు సహాయం చేస్తాం. దీని గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ కధనాన్ని చదవండి.

వైద్యపరంగా చెప్పాలంటే స్ట్రెచ్ మార్క్స్ అన్ని హానికరం కాదు. ఇవి అకస్మాత్తుగా బరువు పెరుగుట లేదా అధిక వ్యాయామ శిక్షణ కారణంగా సంభవించవచ్చు. కొంత మందికి సాగే చర్మ గుణం ఉండుట వలన ఈ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి.

ఇవి మొదట్లో ఎక్కువ లేదా తక్కువగా ముదురు రంగులో ఉండి క్రమంగా తేలికపాటి రంగులోకి మారి మచ్చలుగా ఉంటాయి.

ఈ స్ట్రెచ్ మార్క్స్ చర్మం మీద పగుళ్ళుగా కనపడతాయి. ఇవి తక్కువగా కనపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

సర్జరీ తప్పనిసరి అయితే ఒక ఎంపికగా ఉంది. కానీ ఈ మార్గం చాలా ఖరీదైనది మరియు దీర్ఘ కాల ప్రక్రియగా ఉంటుంది. ఈ స్ట్రెచ్ మార్క్స్ ని తగ్గించటానికి మనం ఇంటిలో సాదారణంగా ఉపయోగించే వస్తువులతో అనేక ఇంటి నివారణలు ఉన్నాయి.

వీటిలో కొన్ని రోజువారి వస్తువులుగా ఉండకపోవచ్చు. కానీ సులభంగా అందుబాటులో ఉంటాయి.

కోకో బట్టర్

కోకో బట్టర్

కోకో వెన్నను ప్రయత్నించవచ్చు. స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించడం కోసం ఉపయోగించే ఒక పరీక్ష పద్ధతి. తల్లులు గర్బం దాల్చాటానికి ముందు మరియు తర్వాత దీనిని ఉపయోగించవచ్చు. షియా వెన్న మరియు విటమిన్ E నూనెను కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో రాయాలి.

కలబంద జెల్

కలబంద జెల్

ఈ జెల్ ను మీ ఇంటి వద్ద మొక్క ఉంటే దాని నుండి తీయవచ్చు. ఒకవేళ లేకపోతే దుకాణాలలో జెల్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ జెల్ లో విటమిన్ E ఆయిల్ ని కలిపి ప్రతి రోజు ప్రబావిత ప్రాంతాలలో రాయాలి. ఈ జెల్ మొత్తం మీ చర్మం పిల్చుకొనే దాకా రాయాలి.

బేకింగ్ సోడా మరియు నిమ్మరసం

బేకింగ్ సోడా మరియు నిమ్మరసం

క్లీనింగ్ ఏజెంట్ అయిన ఈ మిశ్రమం స్ట్రెచ్ మార్క్స్ కొరకు బాగా పనిచేస్తుంది. నిజానికి స్ట్రెచ్ మార్క్స్ తగ్గటానికి బాగా సహాయపడుతుంది. ఒక నిమ్మకాయ రసంలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి,ప్రభావిత ప్రాంతంలో రాసి ఒక అరగంట అయిన తర్వాత సాదారణ నీటితో కడగాలి. మీరు రెండు రోజుల్లోనే తేడాను గమనించవచ్చు.

బంగాళాదుంప జ్యూస్

బంగాళాదుంప జ్యూస్

ఈ పిండి కూరగాయలో యాంటీఆక్సిడాంట్స్ సమృద్ధిగా ఉంటుంది. బంగాళాదుంపలో విటమిన్ సి, పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్,ఇనుము,జింక్ మరియు B విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. దీనిలో ఉండే గొప్ప పోషక కంటెంట్ కారణంగా స్ట్రెచ్ మార్క్స్ నివారణలకు గొప్పగా పనిచేస్తుంది.

మీరు ప్రభావిత ప్రాంతంలో బంగాళదుంప రసాన్ని రాయటం లేదా బంగాళదుంప ముక్కతో రుద్ది ఒక అరగంట అయిన తర్వాత చల్లని నీటితో కడగాలి.

గుడ్లు

గుడ్లు

గుడ్లు తెల్లసొనలో ప్రోటీన్ సమృద్దిగా ఉండి చర్మానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది స్ట్రెచ్ మార్క్ రిమూవర్ వంటిది. దీనిలో కొల్లాజెన్, విటమిన్ ఎ మరియు చర్మం మృదుత్వం మరియు నిలకడ ఇవ్వడానికి అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది చర్మం పునరుద్ధరణలో సహాయపడుతుంది. అలాగే చర్మం సంరక్షణ కోసం ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది.

బాదం స్క్రబ్

బాదం స్క్రబ్

బాదం నూనె అన్ని రకాల చర్మ పరిస్థితులకు పోషణను అందిస్తుంది. బాదం నూనెలో పంచదార,నిమ్మరసం కలిపి స్క్రబ్ గా తయారుచేసుకోవాలి. ఇది మంచి స్ట్రెచ్ మార్క్ రిమూవర్ గా పనిచేస్తుంది. పంచదార ఎక్స్ ఫ్లోట్ అయితే, స్ట్రెచ్ మార్క్స్ ని బాదం నూనె మరియు నిమ్మ రసం తగ్గిస్తాయి. ఎక్స్ ఫ్లోట్ కారణంగా చర్మం దెబ్బతింటుంది. అందువల్ల వారానికి ఒకసారి ఈ స్క్రబ్ ను ఉపయోగించండి.

ఇవి కేవలం స్ట్రెచ్ మార్క్స్ కోసం అనేక నివారణలలో కొన్ని. ఇవి చర్మంనకు ఎటువంటి హాని కలిగించవు. అందువల్ల ఎటువంటి భయం లేకుండా వర్తించవచ్చు. స్ట్రెచ్ మార్క్స్ తొలగించడానికి మరియు పోషణ అందించటానికి సహజ మరియు సురక్షితమైన పద్ధతులు ఉన్నాయి.

Story first published: Thursday, April 23, 2015, 18:17 [IST]
Desktop Bottom Promotion