For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిల్క్ బ్యూటీ తమన్నా చెప్పిన బ్యూటీ సీక్రెట్స్

By Super
|

పాలమీగడ లాంటి మేని ఛాయ ఉన్న తమన్నా మొత్తానికి తన అందం వెనుక ఉన్న రహస్యాలని వెళ్ళడించింది. నటీమణులు తమ అందం కాపాడుకోవడం కోసం ఏమి చెయ్యడానికైనా సిద్ధపడతారు. కానీ తమన్నా మాత్రం ఈ కోవ కి చెందదు అనిపిస్తుంది.ఆమె నటించిన "చాంద్ సా రోషన్ చెహ్రా(చంద్రకాంతి లాంటి ముఖం)" సినిమా టైటిల్ వన్నెలీనే ఆమె ముఖాని సరిగ్గా సరిపోతుంది.

తమన్నా,తాను ప్రమాదకర రసాయనాలున్న కాస్మెటిక్ ఉత్పత్తులకి దూరం అని చెప్పింది. నిగనిగలాడే ఆమె చర్మమే మొట్టమొదట ఆమెని చూడగానే ఆకట్టుకునే అంశం.తన వృత్తిలో భాగం గా రకరకాలా ఉష్ణోగ్రతలని తట్టుకుంటూ, అంతంత మేకప్ వేసుకుంటూ కూడా ఆమె పాల మీగడ లాంటి దేహ ఛాయని ఎలా కాపాడుకోగలుగుతుంది అని ఆశ్చర్యపోతుంటారు అమెని తెర మీద చూసే ప్రేక్షకులు, తోటి నటీమణులు.కాంతులీనే ఆమె దేహ ఛాయే కాదు ఫ్లాట్ గా ఉండే ఆమె పొట్ట, బహు నాజూకుగా ఉండే ఆమె శరీర సౌష్టవం కూడా ఆమె సొత్తు. అవి చూసి తోటి నటీమణులు కూడా ఈర్ష్య పడుతుంటారు.

కానీ తాను అస్సలు తన చర్మం గురించి శ్రద్ధ తీసుకోననీ,వాళ్ళ అమ్మ ఖరీదైన కాస్మెటిక్స్, దేహ ఛాయ ని మెరుగు పరిచే క్రీం లు(ఫెయిర్ నెస్ క్రీంస్) లాంటి వాటికి వ్యతిరేకమనీ చెప్పింది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.

ఆమె రంగు ఆమెకి జన్యుపరంగా సంక్రమించినా తన గ్లామర్ ని కాపాడుకోవడానికి,ముఖం,జుట్టు, శరీర సౌష్టవం కోసం తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి.ఈ క్యూట్ అమ్మాయి ఒక కఠిన నియమావళి ని తన రొటీన్ లో భాగం చేసుకుంది. అదేమిటో తనే చెప్పింది.

తమన్నా చెప్పిన కొన్ని బ్యూటీ సీక్రెట్స్

1. వెజిటేరియన్ డైట్

1. వెజిటేరియన్ డైట్

ఆమెకి పెరుగు అంటే చాలా ఇష్టం,తన భోజనం లో ఎప్పుడూ పెరుగుని చేరుస్తుంది. పెరుగు శరీరాన్ని చల్ల గా ఉంచుతుందని ఆమె అభిప్రాయం.తమన్నాకి వేపుళ్ళు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం కానీ తన శరీర సౌష్టవాన్ని అలాగే కాపాడుకోవడానికి వాటిని దూరం పెట్టింది.

2. వాటర్:

2. వాటర్:

ఆమె తరచూ మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు తీసుకుంటుండటం వల్ల చర్మానికి తగినంత తేమ అంది తాజా గా ఉంటుంది.రోజూ పొద్దున లేవగానే ఓ గుప్పెడు నానబెట్టిన బాదం పప్పులు తిని గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగుతుంది.

3. స్వీట్స్ కు దూరంగా ఉంటుంది:

3. స్వీట్స్ కు దూరంగా ఉంటుంది:

పంచదార కి పంచదారతో చేసిన పదార్ధాలకీ దూరం

4. మేకప్:

4. మేకప్:

షూటింగ్ లేకపోతే పూర్తిగా ఆమె మేకప్ కి దూరం.హాని కలిగించే రసాయనాలతో ఉన్న మేకప్ లేదా రకరకాల హెయిర్ స్టైల్స్ కాకుండా ఎప్పుడూ సింపుల్ గా ఉండటానికే ఇష్టపడుతుంది.ఎస్టీ లాడర్ లిప్ స్టిక్ ఆమెకి ఇష్టమైన బ్రాండ్.

5. జిమ్ :

5. జిమ్ :

ఆమె ప్రతీ రోజూ జిమ్ముకి వెళ్ళి నిపుణుడైన ట్రైనర్ పర్యవేక్షణలో ఉదరభాగానికి శ్రమ కలిగించే ఆబ్ క్రంచెస్,కార్డియో,వెయిట్స్ మరియు ఫ్రీ హాండ్ వ్యాయామాలు చేస్తుంది.ప్రతీరోజూ కనీసం ఓ గంట అయినా గడుపుతుంది తను జిమ్ లో.

6. యోగ:

6. యోగ:

తమన్నా తన అందం మరియు ఆరోగ్యం కోసం రోజూ యోగా చేస్తుంది.

7. ఫేస్ ప్యాక్స్:

7. ఫేస్ ప్యాక్స్:

శెగపిండి, వేపపొడి,పసుపు కలిపి ఇంట్లో చేసిన ఫేస్ ప్యాక్ లు వాడుతుంది.అసలు తను ఎప్పుడూ జుట్టు కి షాంపూ వాడననీ ఇంట్లో చేసిన హెర్బల్ పౌడర్లతోనే తల స్నానం చేస్తానని చెప్పింది.షీకాకాయ,బొప్పాయి,ఉసిరి కలిపిన హెర్బల్ పౌడర్లతో జుట్టు ని శుభ్రపరచుకుంటుంది.షూటింగ్ సమయం లో జుట్టు రకరకాలా ఉష్ణోగ్రతలకి గురి కావడం వల్ల ప్రతీ రోజూ తల స్నానం చేస్తుంది.

8. నిద్ర:

8. నిద్ర:

రాత్రి పడుకోబోయేముందు తప్పకుండా మేకప్ తీసేసే పడుకుంటుంది.తరచూ మృత కణాలని తొలగించుకోవడానికి హెర్బల్ స్క్రబ్స్ ఉపయోగిస్తుంది.

9. నవ్వు:

9. నవ్వు:

తాను అస్సలు ఎప్పుడూ నవ్వడం మర్చిపోననీ అదే తనని నలుగురిలో ప్రత్యేకం గా నిలుపుతుందనీ చెప్తుంది.

తమన్నా అందం వెనుక ఉన్న రహస్యాలు తెలిసాయి కదా, మరింక ఎందుకు ఆలస్యం అమ్మాయిలూ..

English summary

Tamanna’s Beauty Secrets Revealed : Beauty Tips in Telugu

At last the milky beauty Tamanna Bhatia has revealed her beauty secrets. Actresses tend to go to any extent to maintain their beauty, but Tamanna seems to be quite different from her competitors in the film industry. Her film Chand Sa Roshan Chehra is very apt for her bright moon-like face.
Story first published: Saturday, October 17, 2015, 20:03 [IST]