For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపు రంగు దంతాలు తెల్లగా మార్చే సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్

|

మీ దంతాలు పసుపపచ్చగా ఉన్నాయా? తెల్లగా మిళమిళ మెరిసే తెలుపు పళ్ళ కోసం రకరకాల పేస్టులు వాడినా ఫలితం కనిపించడం లేదా? మీ దంతాల మీద ఏర్పడ్డ పసుపు పచ్చ రంగు పోవటానికి ఏమైనా మంత్రముందా అని ఆలోచిస్తున్నారా?

మంత్రాలైతే లేవు కానీ మనకు అందుబాటులో ఉండే కొన్ని హోం రెమెడీస్, చిట్కాల ద్వారా దంతాలను తెల్లగా మార్చుకోవచ్చే. ఉదాహరణకు బేకింగ్ సోడ, చార్కోల్, ఉప్ప వంటివి గ్రేట్ గా సహాయపడుతాయి.

READ MORE: పసుపు రంగు దంతాలను తెల్లగా మార్చే హోం రెమెడీస్

దంతాల మీద పసుపు పచ్చరంగు (గార)పేరుకుపోవటానికి జన్యుప్రభావం, ఆరోగ్య శుభ్రత పాటించకపోవడం, ఆహారపు అలవాట్లు, వయసు ఇలా పలు కారణాలుంటాయని చెప్పవచ్చు. ఇక దంతాల మీద ఉండే పసుపు పచ్చటి రంగుని పోగొట్టాలంటే ఇవి వాడి చూడండి...

 పండ్లు:

పండ్లు:

పసుపు రంగులో ఉన్న దంతాలు, తెల్లగా మారడానికి కొన్ని పండ్లు సహాయపడుతాయి. ఆపిల్ ను కొరికి, పళ్లతో బాగా నమిలి తినడం వల్ల ఆపిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల పసుపు రంగు తొలగిపోయి, దంతాలు తెల్లగా మారుతాయి.

పచ్చికూరలు:

పచ్చికూరలు:

కీరదోస వంటి పచ్చికూరగాలయను తినడం వల్ల పసుపు రంగు దంతాలు తెల్లగా మారుతాయి . దంతాలతో కొరకడం వల్ల దంతాల మీద ఏర్పడ్డ ఎల్లో మరకలు తొలగిపోతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ తో మీ పసుపు రంగు దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. రాత్రి పడుకొనే ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తో నోరు పుక్కలించి కడిగడం వల్ల పుసుపు వర్ణం తొలగిపోవడంతో పాటు , నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

ఆరెంజ్ :

ఆరెంజ్ :

సిట్రస్ పండ్లలో యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల మీ దంతాల మీద ఏర్పడ్డ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు . అందువల్ల ఆరెంజ్ మరియు నిమ్మరసం తిన్నప్పుడు నోట్లో నీళ్ళు పోసి బాగా పుక్కలించి ఊస్తే దంతాలు తెల్లగా మెరుస్తుంటాయి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

నీళ్ళలో బేకింగ్ సోడా మిక్స్ చేసి మౌత్ వాష్ చేయాలి.

సాల్ట్ ట్రిక్:

సాల్ట్ ట్రిక్:

మీ ఎల్లో దంతాలను తెల్లగా మార్చడానికి, ఉప్పును నీటిలో వేసి పుక్కలించి మౌత్ వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల మౌత్ అల్సర్ సమస్యలను నివారిస్తుంది.

చార్కోల్ (బొగ్గు):

చార్కోల్ (బొగ్గు):

బొగ్గును నమిలి , అందులో కొద్దిగా ఉప్పు నోట్లో వేసి దంతాలను రుద్దాలి . ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. దంతక్షయం నివారించబడుతుంది . ఇది కొద్దిగా హర్ట్ చేసినా, ఫలితం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది.

వేపఆకు:

వేపఆకు:

వేప పుల్లను లేదా ఆకులను నమిలి , రెండు మూడు చుక్కల నిమ్మరసం నోట్లో వేసి మసాజ్ చేయడం వల్ల మీ ఎల్లో దంతాలు తెల్లగా మారుతాయి .

అరటి తొక్క:

అరటి తొక్క:

పచ్చరంగులో ఉన్న దంతాల మీద అరటి తొక్కతో రుద్దడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి . ఇది చాలా సులభమైన చిట్కా.

క్యారెట్:

క్యారెట్:

దంతా మద్య ఏర్పడ్డ గారను తొలగించడానికి క్యారెట్ లోని ఫైబర్ కంటెంట్ గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు దంతాలను బలోపేతం చేయడం మరియు ఎల్లో టీత్ ను వైట్ గా మార్చుతాయి.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దంతాల యొక్క పసుపు రంగు మార్చుకోవడానికి, దాల్చిన చెక్క, కొద్దిగా ఉప్పు నమిలి నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కలించాలి . లేదా బ్రష్ చేయాలి.

మౌత్ వాష్ :

మౌత్ వాష్ :

ఎల్తో కలర్ దంతాలను తెల్లగా మార్చడానికి, బోజనం చేసిన ప్రతి సారి నోటి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాల మీద ఎలాంటి మరకలు పడకుండా కాపాడుకోగలరు.

English summary

12 Tips To Make Yellow Teeth White

A yellow set of teeth is a turn off for anyone. If you have a perfect set of teeth and is dicoloured in nature, you should do something about it! To change your yellow to white teeth, there are some tips to help you.
Desktop Bottom Promotion