For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముల్తాని మట్టి యొక్క టాప్ 10 ప్రయోజనాలు

ముల్టానా మట్టి బ్యూటీ పరిశ్రమలో ఉపయోగించే ఒక ప్రధానమైన అంశంగా ఉంది. ఇది ఒక రకమైన మట్టి. దీనిలో మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్ మరియు డోలమైట్ తో సహా వివిధ రకాల ఖనిజాలు ఉన్న

By Lekhaka
|

ముల్టానా మట్టి బ్యూటీ పరిశ్రమలో ఉపయోగించే ఒక ప్రధానమైన అంశంగా ఉంది. ఇది ఒక రకమైన మట్టి. దీనిలో మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఇనుము, కాల్షియం, కాల్సైట్ మరియు డోలమైట్ తో సహా వివిధ రకాల ఖనిజాలు ఉన్నాయి.

ఇది ఎక్కువగా పొడి రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది తెలుపు,ఆకుపచ్చ, నీలం, గోధుమ లేదా ఆలివ్ వంటి వివిధ రంగులలో దొరుకుతుంది. మీ జుట్టు మరియు చర్మం యొక్క బాధల పట్ల శ్రద్ధ వహించడానికి ప్రకృతి అందించిన ఒక మాయా ఉత్పత్తి అని చెప్పవచ్చు. ఇది చమురు శోషణ, ప్రక్షాళన మరియు వివిధ జుట్టు మరియు చర్మ పరిస్థితుల చికిత్సలో చాలా సహాయకారిగా ఉండటానికి క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది.

ఈ అనుకూలమైన సహజ పదార్ధం ఉపయోగించడానికి సురక్షితం మరియు ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇక్కడ ముల్టానా మట్టి యొక్క టాప్ 10 ప్రయోజనాలు ఉన్నాయి.

 చర్మం నుండి అదనపు నూనెను గ్రహిస్తుంది

చర్మం నుండి అదనపు నూనెను గ్రహిస్తుంది

దీనికి సహజంగా పిల్చే గుణం కలిగి ఉంటుంది. ముల్టానా మట్టిని జిడ్డు చర్మం నుంచి అధిక నూనెను తొలగించడానికి ఉపయోగించవచ్చు. ఇది చర్మ రంద్రాలను క్లాగ్ లేకుండా చేస్తుంది. అలాగే చర్మం యొక్క సహజ pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీనిని సాదారణంగా ఇంటిలో ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తారు.

* ముల్టానా మట్టి,రోజ్ వాటర్,గంధం పొడి ఈ మూడింటిని సమాన మొత్తాలలో తీసుకోని కలపాలి.

* ఈ మిశ్రమంతో మీ ముఖానికి ఫేస్ ప్యాక్ వేయాలి.

* ఇది సహజంగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

* జిడ్డు చర్మం కలవారు ఈ ప్యాక్ ను ప్రతి రోజు వేయాలి. ఒక మోస్తరు జిడ్డు చర్మం కలవారు వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ ప్యాక్ ను వేయాలి.

మచ్చలను తొలగిస్తుంది

మచ్చలను తొలగిస్తుంది

ముల్టానా మట్టి గాయాల మచ్చల రూపాన్ని తగిస్తుంది. కాలిన గాయాల గుర్తులను కూడా తగ్గిస్తుంది.

* ముల్టానా మట్టి,క్యారట్ గుజ్జు,ఆలివ్ ఆయిల్ మూడింటిని సమాన భాగాలుగా తీసుకోని కలపాలి.

* ఈ మిశ్రమాన్ని మచ్చల మీద రాయాలి.

* 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి.

* వారంలో ఒకసారి లేదా రెండు సార్లు చేస్తే మచ్చలు దూరం అవుతాయి.

 చర్మ రంగును మెరుగుపరుస్తుంది

చర్మ రంగును మెరుగుపరుస్తుంది

ముల్టానా మట్టి మీ చర్మం ఛాయను మెరుగుపరచటానికి ఒక అద్భుతమైన ప్రక్షాళన ఏజెంట్ గా పనిచేస్తుంది.

* రెండు స్పూన్ల ముల్టానా మట్టి,రెండు స్పూన్ల పెరుగును తీసుకోని బాగా కలపాలి.

* ఈ మిశ్రమాన్ని అరగంట కదపకుండా అలా ఉంచాలి.

* ఆ తర్వాత ఈ మిశ్రమంలో ఒక స్పూన్ పుదీనా పొడి వేసి బాగా కలపాలి.

* ఈ మిశ్రమాన్ని మీ ముఖం,మెడ ప్రాంతాలలో రాయాలి.

* ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

* వారంలో రెండు సార్లు ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే మీ చర్మ చాయలో మంచి మెరుగుదలను గమనించవచ్చు.

ఈ మిశ్రమంను చేతులు మరియు కాళ్ల చాయను మెరుగుపరచటానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ పరిష్కారం సన్ టాన్ కూడా బాగా ఉపయోగపడుతుంది.

 మోటిమలకు చికిత్స

మోటిమలకు చికిత్స

మీరు మొటిమలతో బాధ పడుతూ ఉంటే, మీ సమస్యను ముల్టానా మట్టి తప్పనిసరిగా పరిష్కరిస్తుంది.మొటిమలు రావటానికి ప్రధాన కారణాలు అయిన చర్మ రంధ్రాలకు అడ్డుపడే అవరోదాలు మరియు చర్మంపై ఉండే అదనపు నూనెను తొలగించటానికి సహాయపడుతుంది.

* రెండు స్పూన్ల ముల్తానా మట్టిలో ఒక స్పూన్ వేపాకు పేస్ట్,చిటికెడు కర్పూరం, సరిపడా రోజ్ వాటర్ వేసి పేస్ట్ గా చేయాలి.

* ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంలో రాయాలి.

* పదిహేను నిముషాలు తర్వాత సాదారణ నీటితో కడగాలి.

* ఒక మృదువైన టవల్ తో చర్మాన్ని పొడిగా తుడిచి, ఒక తేలికపాటి మాయిశ్చరైజర్ ని రాయాలి.

* వారంలో ఒకసారి ఈ పేస్ట్ ని ఉపయోగిస్తే మొటిమలు దూరం అవుతాయి.

చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది

చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది

వయస్సు పెరిగే కొద్ది చర్మం కుంగటం జరుగుతుంది. ముల్టానా మట్టి మీ చర్మం బిగువుగా ఉండటానికి మరియు చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరచి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

* ఒక స్పూన్ ముల్టానా మట్టి,గ్లిజరిన్,తేనె కలిపి మృదువైన పేస్ట్ గా చేయాలి. దీనికి బీట్ చేసిన గుడ్డు తెల్లసొనను కలపాలి.

* ఈ పేస్ట్ ను మీ ముఖానికి పట్టించాలి.

* ఈ పేస్ట్ ఆరేవరకు అలా ఉంటే, మీ ముఖ కండరాలు కదలకుండా రిలాక్స్ అవుతాయి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

* ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి.

చుండ్రుకు చికిత్స

చుండ్రుకు చికిత్స

చాలా కాలం నుండి ప్రజలు చుండ్రు చికిత్సలో ముల్టానా మట్టిని ఉపయోగిస్తున్నారు. ఇది చుండ్రుకు కారణం అయిన నూనె, గ్రీజు మరియు ధూళిని గ్రహిస్తుంది. అంతేకాక ఇది తలపై చర్మం మీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే తల మీద చర్మం మీద ఫ్లేక్స్ లేకుండా శుభ్రంగా ఉంచుతుంది.

నారింజ తొక్కల పొడి మరియు ముల్టానా మట్టిని సమాన మొత్తంలో తీసుకోని ఒక హెయిర్ ప్యాక్ తయారుచేయండి. మీ తల మీద చర్మం మరియు మీ జుట్టుకు ఈ పేస్ట్ ని బాగా పట్టించి,20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. మీ జుట్టును కడగటానికి ఒక తేలికపాటి షాంపూ ను ఉపయోగించండి. సమర్థవంతంగా చుండ్రును తగ్గించేందుకు వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఈ గృహ చికిత్సను అనుసరించండి.

మరొక ఎంపికగా కప్పున్నర పెరుగులో నాలుగు స్పూన్ల ముల్టానా మట్టి, రెండు స్పూన్ల నిమ్మరసం,రెండు స్పూన్ల తేనె కలపాలి. దీనికి అవసరమైతే నీటిని కూడా కలపవచ్చు. దీనిని మీ తల మీద చర్మం మరియు జుట్టుకు పట్టించి 20 నిముషాలు అలా వదిలేయాలి. చివరగా మీ జుట్టుకు కండిషన్ మరియు షాంపూను ఉపయోగించాలి. ఈ విధంగా వారంలో ఒకసారి లేదా రెండు సార్లు చేయాలి.

జుట్టు చివర చిట్లుటను తగ్గిస్తుంది

జుట్టు చివర చిట్లుటను తగ్గిస్తుంది

ముల్టానా మట్టి షాంపూ కు ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉందనే విషయం బాగా తెలిసిన వాస్తవమే. దీనిని జుట్టు చివర చిట్లుటను తగ్గించటానికి ఒక కండీషనర్ వలె ఉపయోగించవచ్చు.

మీ జుట్టును తేమగా ఉంచేందుకు మరియు జుట్టు చివరల చిట్లుటను నిరోధించడానికి సమయానుకూలంగా ముల్టానా మట్టితో మీ జుట్టును కడగాలి. ఇది మీ జుట్టును నునుపుగా మరియు మెరిసేలా చేస్తుంది. జుట్టు పెరుగుదలకు ప్రసరణను ప్రేరేపిస్తుంది.

మీకు జుట్టు చివర చిట్లి ఉంటే కనుక, ఒక వెచ్చని ఆలివ్ నూనె చికిత్సను ఉపయోగించండి. అలాగే ముల్టానా మట్టి మరియు పాల మిశ్రమంతో జుట్టును కడగండి. తరువాత రోజు, ఒక తేలికపాటి షాంపూ తో మీ జుట్టును కడగండి. వారంలో ఒకసారి లేదా రెండుసార్లు ఈ విధంగా చేయండి.

నిటారైన జుట్టు

నిటారైన జుట్టు

నిటారుగా,వత్తుగా గిరజాలు తక్కువగా ఉండటానికి ముల్టానా మట్టి అద్భుతంగా పనిచేస్తుంది.

*ఒక కప్పు ముల్టానా మట్టిలో 5 స్పూన్ల బియ్యం పిండి,ఒక గుడ్డు తెల్లసొన,అవసరమైన నీటిని పోసి పేస్ట్ చేయాలి.

* పడుకోవటానికి ముందు మీ జుట్టుకు బాదం నూనె, ఆలివ్ నూనె, లేదా ఏ ఇతర నూనె అయిన మీ జుట్టుకు రాయాలి.

* మరుసటి రోజు ఉదయం,ఒక వెడల్పాటి దువ్వెనతో మీ జుట్టును నాలుగు లేదా ఐదు సార్లు దువ్వి , ఆపై మీ తల మీద చర్మం మరియు జుట్టు మీద పైన తయారుచేసుకున్న పేస్ట్ రాయాలి. ఈ పేస్ట్ రాసే సమయంలో దువ్వెనను ఉపయోగిస్తే మీ జుట్టు నిటారుగా ఉంటుంది.

* 40 నిముషాలు తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి.

* మీ జుట్టు మీద ఒక స్ప్రే బాటిల్ తో అరకప్పు పాలను స్ప్రే చేయాలి.

* 15 నిమిషాలు తర్వాత ఒక తేలికపాటి షాంపూ మరియు కండీషనర్ తో మీ జుట్టును కడగాలి.

* మీ జుట్టు నిటారుగా మారుతుంది. అలాగే మీరు మీ జుట్టును తిరిగి వాష్ చేసే వరకు ఆ విధంగానే ఉంటుంది.

అలిసిన అవయవాలకు ఉపశమనం

అలిసిన అవయవాలకు ఉపశమనం

మీ చేతులు లేదా కాళ్ళు అలసిన మరియు బాధగా ఉన్నప్పుడు, రక్త ప్రసరణ ఉద్దీపన కొరకు ముల్టానా మట్టి పేస్ట్ ను ఉపయోగించవచ్చు.మీకు తొందరగా అలసట తగ్గిన అనుభూతి కలుగుతుంది. రక్త ప్రసరణ పెరగటం వలన గుండె, నరాలు,ధమనులు మరియు శరీరం అంతా లాభపడవచ్చు.

* ముల్టానా మట్టిని పేస్ట్ చేయటానికి అవసరమైన నీటిని కలపాలి.

* ఈ పేస్ట్ ను ప్రభావిత శరీర భాగాలకు రాయాలి.

* ఆ ప్రాంతం పొడిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

* ఈ పరిష్కారాన్ని వారంలో ఒకసారి లేదా నెలలో కొన్ని సార్లు చేయాలి.

మృత కణాలను తొలగిస్తుంది

మృత కణాలను తొలగిస్తుంది

ముల్టానా మట్టి మీ చర్మం పొడి ఫ్లేక్స్ మరియు ధూళి ఎక్స్ ఫ్లోట్ కు సహాయపడుతుంది. మీరు చర్మం శుభ్రపరచడానికి సహాయం మరియు మీ చర్మం తేమగా ఉండటానికి ఫేస్ ప్యాక్ ను తయారుచేయవచ్చు. ఇది పొడి చర్మం కలిగిన వారికి అత్యంత సమర్థవంతముగా ఉంటుంది.

* ఒక స్పూన్ ముల్టానా మట్టి,ఒక స్పూన్ తేనె,ఒక స్పూన్ గ్లిసరిన్ తీసుకోని బాగా కలిపి పేస్ట్ చేయాలి.

* ఈ పేస్ట్ ను మీ ముఖానికి పట్టించి,బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

* ఈ ప్యాక్ ను వారానికి ఒకసారి ఉపయోగించండి.

ముల్తానీ మట్టి యొక్క గొప్ప సౌందర్య ప్రయోజనాలు

ముల్తానీ మట్టి యొక్క గొప్ప సౌందర్య ప్రయోజనాలు

మొత్తానికి మీరు బ్యూటీ పార్లర్ లో డబ్బు ఖర్చు పెట్టకుండా మీ చర్మం అందంగా ఉండటానికి మరియు మీ జుట్టుకు పోషణ అందించటానికి ముల్టానా మట్టి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. తరువాత మీరు బ్యూటీ ఉత్పత్తులు కోసం షాపింగ్ చేసినప్పుడు ముల్టానా మట్టిని కొనటం మాత్రం మర్చిపోకండి.

English summary

Top 10 Benefits of Fuller’s Earth

Fuller’s earth is a staple ingredient used in the beauty industry. Also known as multani mitti, fuller’s earth is a type of clay that contains various minerals, including magnesium, quartz, silica, iron, calcium, calcite and dolomite.
Desktop Bottom Promotion