For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైనాపిల్ తో ఆహా అనిపించే చర్మం సౌందర్యం మీ సొంతం...

|

సహజంగా ఏ అమ్మాయినా అందంగా ఉన్నావని పొగిడితే చాలు వారికి ఫిదా అయిపోతుంటారు. అమ్మాయి అందాన్ని పొగుడుతుంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి? అంత అందాన్ని సొంతం చేసుకోవాలంటే అందుకు తగిన సౌందర్య సంరక్షణతో పాటు పౌష్టికాహారం కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అందం విషయంలో అనాస(పైనాపిల్ )చేసే మేలు అంతా..ఇంతా కాదు.

తాజా పండ్ల రూపంలోనే కాకుండా స్క్వాష్‌లు, జామ్‌లు, సిరప్‌లు, కార్డియల్స్ రూపంలో దీనిని మార్కెట్ చేస్తున్నారు. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి.

పైనాపిల్ ఆకారం..రంగు వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు..!

పైనాపిల్‌లో 'సి' విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి.

అందానికి కూడా అమోఘంగా పనిచేసే పండు అనాస. ఈ క్రమంలో అనాసపండుతో అటు ఆరోగ్య పరంగానే కాకుండా ఇటు సౌందర్యపరంగా కూడా చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటనే క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సందే..

1. ఫెయిర్ కాంప్లెక్షన్:

1. ఫెయిర్ కాంప్లెక్షన్:

మంచి చర్మకాంతిని పొందాలంటే పైనాపిల్ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది . పైనాపిల్లో ఉండే బ్రొమైలిన్ అనే ఎంజైమ్ మొటిమలను నివారించడంతో పాటు చర్మ సమస్యలకు కూడా నివారిస్తుంది . దాంతో చర్మం అందంగా మరియు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. చర్మంలో ఎలాసిటి పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచడం వల్ల ముఖంలో ముడతలు మరియు మచ్చలు లేకుండా స్కిన్ టోన్ పెంచుతుంది.

2. ముఖంలో ఎలాంటి మచ్చలైనా మాయం అవుతాయి:

2. ముఖంలో ఎలాంటి మచ్చలైనా మాయం అవుతాయి:

పైనాపిల్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి, బ్రొమోలైన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ మొటిమలను నివారించే ట్రీట్మెంట్లో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ముఖ్యంగా ముఖంలో ఫైన్ లైన్స్, సన్ డ్యామేజ్ మరియు స్కిన్ టోన్ ను నివారించడంలో బ్రొమోలిన్ గ్రేట్ గా సహాయపడుతుంది . స్కిన్ ఇన్ఫ్లమేషన్ మరియు వాపును నివారించి స్కిన్ ను సాప్ట్ గా మార్చుతుంది . ప్రతి రోజూ 1గ్లాసు పైనాపిల్ జ్యూస్ త్రాగడం వల్ల ఫెయిన్ అండ్ క్లియర్ స్కిన్ పొందవచ్చు . పైనాపిల్ జ్యూస్ ను నీళ్ళలో కలిపి ముఖానికి పట్టించి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమలను నివారించి క్లియర్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ పొందవచ్చు.

3. చర్మం మెరిసేలా:

3. చర్మం మెరిసేలా:

పైనాపిల్లో ఉండే విటమిన్ సి అమైనో యాసిడ్స్ చర్మంలో ఉండే కొలెజెన్ ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేసి, చర్మాన్ని బిగువుగా, పటుత్వకోల్పోకుండా చేస్తాయి. అలాగే చర్మంపై పేరుకొనే డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి కాంతివంతంగా మారుస్తాయి. ఇందులో ఉండే సి విటమిన్ వల్ల మొటిమలు తగ్గుముఖం పట్టడమే కాదు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు కూడా క్రమంగా చర్మఛాయలో కలిసిపోతాయి. ఫలితంగా ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అందుకోసం పైనాపిల్ స్లైత్ ఒకటి తీసుకొని చర్మం మీద నేరుగా అప్లై చేసి, సున్నితంగా మర్ధన చేయాలి. కొద్దిసేపు ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. యంగ్ గా కనబడుతారు:

4. యంగ్ గా కనబడుతారు:

ప్రతిఒక్కరూ అందంగా యంగ్ గా కనబడాలనుకుంటారు . పైనాపిల్లో యాంటీ యాక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇవి వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి . దాంతో శరీరంలో ఫ్రీరాడికల్స్ నివారించడంలో చర్మం స్మూత్ గా మరియు యంగ్ గా కనబడుటకు సహాయపడుతుంది . పైనాపిల్ జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అనాసపండులో విటమిన్ సితో పాటు, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అదుకే వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికమొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాకుండా, చర్మం కూడా నవయవ్వనంతో నిగనిగలాడేలా చేస్తాయి.

5. తేమని నిలిపే మాస్క్:

5. తేమని నిలిపే మాస్క్:

చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందించే పైనాపిల్ తో తయారుచేసే ఫేస్ మాస్క్ మిశ్రమంతో చర్మంలోని తేమని కోల్పోకుండా రక్షించుకోవచ్చు. అందుకోసం అనాసపండుని మెత్తగా గుజ్జులా చేసి, అందులో మూడు చెంచాల తీసుకొని, అందులో ఎగ్ వైట్ , కొద్దిగా పాలు మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకుని 15-20 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం నిగారింపు సంతరించుకోవడంతో పాటు తేమను కూడా కోల్పోకుండా ఉంటుంది.

6. ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేసి మొటిమలను నివారిస్తుంది:

6. ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేసి మొటిమలను నివారిస్తుంది:

పైనాపిల్ జ్యూస్ లో ఆల్పా హైడ్రాక్సి యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది . అలాగే పైనాపిల్ జ్యూస్ ను ముఖానికి అప్లై చేసి 10 నిముషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగి పోయి, చర్మంలో కొత్తగా మెరుపు తీసుకొస్తుంది. పైనాపిల్ పేస్ట్ చేసి అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించి 10 నిముషాల తరవ్ాత శుభ్రం చేసుకోవాలి.

7. డార్క్ స్పాట్స్ :

7. డార్క్ స్పాట్స్ :

పైనాపిల్ మంచి పాజిటివ్ రిజల్ట్ ను చూపుతుంది. చర్మంలో ఏర్పడిన డార్క్ స్పాట్స్ మరియు మచ్చలను తగ్గిస్తుంది. బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో పైనాపిల్ ముక్కతో స్క్రబ్ చేయాలి . 10 నిముషాలు స్క్రబ్ చేసిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ముఖానికి పోషణ అందివ్వడంతో పాటు, డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది.

8. ఆరోగ్యవంతమైన గోళ్లకు:

8. ఆరోగ్యవంతమైన గోళ్లకు:

కొంత మంది గోళ్లు కాస్త పెరిగితే చాలు విరిగిపోతూ ఉంటాయి. అలాగే నిర్జీవంగా కూడా కనిపిస్తుంటాయి. మరికొందరివి పెళుసుగా, విరిగిపోయినట్లుగా ఉంటాయి. ఇటువంటి వరు అనాసపండుని మెత్తగా చేసి ఆ ముద్ద కొంచెం తీసుకుని గోళ్ల మీద అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్దిరోజుల పాటు చేయడం వల్ల ఆరోగ్యంగా, బలంగా ఉండే గోళ్లను సొంతం చేసుకోవచ్చు.

9. జుట్టు రాలకుండా:

9. జుట్టు రాలకుండా:

ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరీన బాధించే సమస్య జుట్టు రాలే సమస్య. అనాస పండులో విటమిని సి అధికంగా ఉండటం వల్ల ఇది జుట్టు రాలడం నివారిస్తుంది. ప్రయోజనాలను పొందాలంటే ప్యాక్స్, జ్యూస్ ల రూపంలో కాకుండా పైనాపిల్ ని రోజూ తీసుకుంటే మంచి ఫలితాలను అందిస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

10. పెదాల నలుపు తగ్గుతుంది:

10. పెదాల నలుపు తగ్గుతుంది:

పైనాపిల్ గుజ్జులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ వేసి మిక్స్ చేసి పెదాలకు రాసుకుంటే, పెదాల్లో తేమనిచిలి ఉంటుంది. ఫలితంగా పెదవులు పొడిబారకుండా ఉంటాయి. దాంతో పెదాలల్లో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, పెదాలు అందంగా, నునుపుగా ఉంటాయి.

11. పాదాల సంరక్షణ:

11. పాదాల సంరక్షణ:

పాదాల పై ఉండే పగుళ్ళు తగ్గడానికి కూడా పైనాపిల్ బాగా సహాయపడుతుంది. పాదాలను స్మూత్ గా మార్చుతుంది. పైనాపిల్ తొక్క తీసి గుజ్జులా చేసి అందులో నిమ్మరసం, ఆపిల్ గుజ్జు మరియు గ్రేఫ్ ఫ్రూట్ , సీసాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పాదాలకు పట్టించి అరగంట తర్వాత స్ర్కబ్బర్ తో స్క్రబ్ చేసి నీటితో కడగాలిజ

12. సూచన:

12. సూచన:

పైనాపిల్ ని ముఖానికి అప్లై చేసుకునే ముందు మొదట చేతి మీద లేదా చెవి వెనుక భాగంలో కాస్త రుద్ది టెస్ట్ చేసుకోవాలి. చర్మం మంట, దురద, ఎర్రగా మారడం వంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటే ముఖానికి అప్లై చేసుకోవాలని గుర్తుంచుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం అనాసపండుతో ఆహా అనిపించే సౌందర్యాన్ని మీరు సొంతం చేసుకోవాలి ఓసారి ప్రయత్నించి చూడండి. మరింత అందంగా మెరిసిపోండి.

English summary

TOP 12 Amazing Pineapple Benefits for Skin

The latest fun skin facts are encasing the use of pineapple juice for glowing skin. Pineapple is a tropical plant with a delicious juicy taste. It is an edible tropical fruit that is a made up of fused berries belonging to the Bromeliaceous family.
Desktop Bottom Promotion