For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓట్స్ మీల్ ను బ్యూటికి ఏవిధంగా ఉపయోగించుకోవాలి

By Super
|

ఓట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది….. చర్మానికి రాసుకుంటే అందం. పొడి చర్మం ఉన్నవారు, మొటిమలతో భాదపడుతున్నవారు… ఇలా ఎవరు ఓట్స్ ని వాడిన ఉపయోగమే. కోమలమైన ముఖారవిందంతో పాటు, ముఖంలో మెరుపు.. నునుపుదనం ఉంటే ఆ ముఖం మరింత అందంగా కనబడుతుంది. మరి అంత అదంగా కనబడాలంటే ఫేష్ క్లీనింగ్.. మాయిశ్చరైజింగ్ మాత్రమే సరిపోదు. వాటితో పాటు రోజు మార్చి రోజు ముఖాన్ని స్క్రబ్ చేస్తుండాలి. అప్పుడే ముఖం నైస్ గా తయారు అవుతుంది. స్ర్కబ్ కి ఉపయోగించే వస్తువులు బయట మార్కెట్లో రసాయనిక ఉత్పత్తులను తెచ్చి వాడటం కంటే ఇంట్లోని వస్తువులు తామే స్వయంగా ఉపయోగించడం వల్ల సహజ చర్మ తత్వాన్ని కలిగి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది.

READ MORE: ఓట్ మీల్ యొక్క టాప్ 10 ఆరోగ్య ప్రయోజనాలు

ఇవి చర్మాన్ని రక్షణ కల్పించడమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు శరీర సంరక్షణలో ఓట్ మీల్ గురించి వినే ఉంటారు. ఓట్ మీల్ ను తరచూ తీసుకొంటే సన్నబడుతారు, పొట్ట తగ్గించడంలో ఇది ఒక మంచి ఆహారం అని. ఈ ఓట్ మీల్ శరీర సౌష్టవానికి మాత్రమే కాదు... చర్మ సౌందర్యానికి బాగా పనిచేసి ముఖానికి మంచి రంగును... రూపునును అందిస్తుంది.

READ MORE: ఓట్స్ ను ఆరోగ్యకరంగా-రుచికంగా తీసుకోవడానికి టిప్స్

అదెలాగో చూద్దాం....

ముఖానికి ఓట్ మీల్ :

ముఖానికి ఓట్ మీల్ :

చర్మానికి తగినంత తేమను అందించి మాయిశ్చరైజ్ గా సహాయపడుతుంది. మరియు చర్మ రంద్రాల్లోని మురినికిని ఎక్సెస్ ఆయిల్ ను తొలగించి, డీప్ గా శుభ్రపరుస్తుంది.

స్పాట్ ట్రీట్మెంట్:

స్పాట్ ట్రీట్మెంట్:

మొటిమలు మరియు మచ్చలతో బాధపడుతున్నట్లైతే ఓట్స్ మీల్ మీ సమస్యను నివారిస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మంలోని అదనపు ఆయిల్ గ్రహి్తుంది మరియు చర్మానికి చల్లదనాన్ని తీసుకొస్తుంది. కొద్దిగా ఓట్ మీల్ ను నీటిలో వేసి ఉడికించి చల్లబడిన తర్వాత ముఖానికి పట్టించాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మరియు సన్ బర్న్ వంటి సమస్యలను నివారిస్తుంది.

ఫేస్ వాష్ :

ఫేస్ వాష్ :

ఓట్ మీల్లో సపోనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చర్మంలో మురికి మరియు ఆయిల్ ను తొలగిస్తుంది. మీరు చాలా త్వరగా ఓట్ మీల్ తో క్లెన్సర్ ను తయారుచేసుకోవచ్చు. అందుకు రెండు చెంచాలా ఓట్ మీల్, ఒక చెంచ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి గుండ్రంగా ముందుకు వెనకు మర్దన చేయాలి . 10 నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తేనె బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . మరియు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది .

సెన్సిటివ్ స్కిన్ స్ర్కబ్బర్:

సెన్సిటివ్ స్కిన్ స్ర్కబ్బర్:

ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, ఒక చెంచా తేనె, రెండు చెంచాల పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, చర్మానికి తగినంత తేమను అందివ్వడంతో పాటు, చర్మానికి రక్షణ కల్పించడంతో పాటు చర్మాన్ని చల్లగా మార్చుతుంది . సన్ బర్న్ స్కిన్ కు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది .

ట్రోపిక్ స్క్రబ్బర్:

ట్రోపిక్ స్క్రబ్బర్:

రెండు చెంచాల ఓట్ మీల్, ఒక చెంచా కొబ్బరినూనె, ఒక చెంచా బ్రౌన్ షుగర్ మరియు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మానికి ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. మేజర్ బెనిఫిట్స్ అందిస్తుంది .

బేకింగ్ సోడ మరియు ఓట్ మీల్ స్ర్కబ్:

బేకింగ్ సోడ మరియు ఓట్ మీల్ స్ర్కబ్:

ఓట్ మీల్ మరియు బేకింగ్ సోడాను సమయంగా తీసుకొని అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి పేస్ట్ అయిన తర్వాత చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి .15నిముషాల తర్వాత శుభ్రం చేస్తేం మంచి ఫలితం ఉంటుంది.

ఓట్ మీల్ మిని మాస్క్:

ఓట్ మీల్ మిని మాస్క్:

రెండు చెంచాలా ఓట్ మీల్, 2చెంచాల తేనె, 1 చెంచా పాలు, మిక్స్ చేసి ముఖానికి మరియు మెడకు పట్టించాలి 10 నిముషాల తర్వాత శుభ్రం చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది .

న్యూరీషింగ్ స్ర్కబ్ –

న్యూరీషింగ్ స్ర్కబ్ –

అరకప్పు పాలు, ఒక చెంచా తేనె, మరియు ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మరియు 2 చెంచాలా ఓట్ మీల్ ను మిక్స్ చేసి, ముఖానికి శుభ్రం చేసి 10 నిముషాల తర్వాత 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. .

యాంటీఏజింగ్ మాస్క్:

యాంటీఏజింగ్ మాస్క్:

అరకప్పు ఉడికించిన ఓట్స్ లో, ఒక గుడ్డు మరియు ఒక చెంచా బాదం ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

జుట్టుకు : డ్రై షాంపు:

జుట్టుకు : డ్రై షాంపు:

ఓట్స్ ను మెత్తగా పొడి చేసి, తలలో వేసి బాగా మర్దన చేయాలి . ఇలా చేయడం వల్ల ఈ పొడి వల్ల తలలో ఉండే అదనపు ఆయిల్ గ్రహిస్తుంది మరియు తలలో దురదను నివారిస్తుంది.

శరీరానికి :

శరీరానికి :

ఓట్ మీల్ బాత్ వల్ల పొడిబారిన చర్మం మరియు చర్మం యొక్క దురదను నివారించుకోవచ్చు . ముఖ్యంగా ఎగ్జిమ వంటి సమస్యలను నివారించుకోవచ్చు . అదెలాగో చూద్దాం...

బాత్ సోక్:

బాత్ సోక్:

రిలాక్సింగ్ బాత్ కొరకు ఒక కప్పు ఓట్ మీల్ ను ఒక టబ్ వేడినీళ్ళలో మిక్స్ చేసి కొన్ని చుక్కలు ఎసెన్సియల్ ఆయిల్ (ల్యావెండర్, చమోమెలీ లేదా రోజ్ ఆయిల్)వేసి 30 గంట తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి !

ఓట్ మరియు హనీ మిల్క్ బాత్ :

ఓట్ మరియు హనీ మిల్క్ బాత్ :

అరకప్పు ఓట్స్ పౌడర్ లో 1/4కప్పు మిల్క్ పౌడర్ మరియు 2 టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేసి ఒక పల్చటి క్లాత్ లో వేసి ముడి కట్టి స్నానం చేసే బాత్ టబ్బ్ లో హ్యాంగ్ చేసి, నేచురల్ మాయిశ్చరైజింగ్ బాత్ ను చేయాలి.మీకు నచ్చేందుకు అందులో కొన్ని ఫ్యాగ్నెన్స్ ఆయిల్స్ ను వేయాలి.

ఓట్ మీల్ బాడీ స్ర్కబ్:

ఓట్ మీల్ బాడీ స్ర్కబ్:

ఆలివ్ ఆయిల్ మరియు షుగర్ సమంగా తీసుకొని చేత్తో బాగా రుద్ది అలాగే చేతులకు మరియు ముఖం మీద చేతులతో మసాజ్ చేయాలి. 10 నిముషాల తర్వాత స్నానం చేయాలి.

ఓట్ మీల్ బ్రౌన్ షుగర్ బాడీ స్ర్కబ్:

ఓట్ మీల్ బ్రౌన్ షుగర్ బాడీ స్ర్కబ్:

రెండు చెంచాల ఓట్ మీల్, 2 చెంచాల బ్రౌన్ షుగర్ తీసుకొని అందులో అలోవెరా జెల్ మిక్స్ చేసి ఒక చెంచా నిమ్మరసం జోడించి పేస్ట్ లా చేయాలి . తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి, మోచేతులు, మోకాళ్ళకు పట్టించి మసాజ్ చేయాలి 15 నిముషాల తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. !

English summary

Top 13 ways how oatmeal can be used as a beauty product: Beauty Tips in Telugu

How oatmeal can be used as a beauty product. Beauty Tips in Telugu. Oats can treat skin problems like acne, pimple, rashes etc. Here are best ways how oatmeal can be used as a beauty product. This can be best utilized for home made beauty preparations.
Desktop Bottom Promotion