For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేకింగ్ సోడాలోని అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్

|

బేకింగ్ సోడా ఒక చౌకైన వంటగది వస్తువు. ఇందులో అనేక ఔషధ గుణాలున్నాయి. అందుకే దీన్ని వంటిగది వస్తువుల్లో మరియు క్లీనింగ్ ప్రొడక్ట్స్ లో విరివిగా ఉపయోగిస్తుంటారు. అందుకే దీన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ లోను ఎఫెక్టివ్ గా పనిచేస్తూ నిరూపించుకోబడినది.

ఇది స్టొమక్ యాసిడ్స్ తగ్గిస్తుంది మరియు ఎసిడిటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వంటగదిలో కుక్కీస్ మరియు కేక్స్ తయారీలో చక్కటి రుచిని అందిస్తుంది. అంతే కాదు ఇంట్లో వస్తువులు మరియు దుస్తులమీద ఏర్పడ్డ మొండి మరకలు తొలగించడానికి, ఫోయల్ స్మెల్ తొలగించడానికి, బాత్ రూమ్ మరకలు, వాసన నివారించడానికి బేకింగ్ సోడాను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

సౌందర్య విషయానికొస్తే, చర్మ సమస్యల్లో మొటిమలు, మచ్చలు, స్కార్స్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది మరియు చర్మాన్ని బ్రైట్ చేస్తుంది, దంతాలను తెల్లగా మెరిపిస్తుంది. చర్మం మరియు జుట్టులో జిడ్డును తొలగిస్తుంది. అంతే కాదు బేకింగ్ సోడా వల్ల మరికొన్ని అద్భుతమైన బ్యూటీబెనిఫిట్స్ ను ఈ క్రింది విధంగా పొందవచ్చు....

1. చర్మం సాఫ్ట్ గా మరియు స్మూత్ గా తయారవుతుంది:

1. చర్మం సాఫ్ట్ గా మరియు స్మూత్ గా తయారవుతుంది:

ఒక చెంచా బేకింగ్ సోడాను అరకప్పు నీటిలో వేసి మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేసి స్ర్కబ్ చేయడం వల్ల ఇది డెడ్ స్కిన్ తొలగించి చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది అంతే కాదు, మోచేతులు మరియు మోకాళ్ళ యొక్క నలుపు తగ్గించి నునుపు చేస్తుంది.

2. కాళ్ళ మరియు కాలివేళ్లను కాంతివంతం చేస్తుంది:

2. కాళ్ళ మరియు కాలివేళ్లను కాంతివంతం చేస్తుంది:

రెండు చెంచాలా బేకింగ్ సోడాలో ఒక చెంచా నిమ్మరం మిక్స్ చేసి కాళ్ళకు అప్లై చేయాలి తర్వాత సాఫ్ట్ బ్రెష్ తీసుకొని నిధానంగా మర్ధన చేయాలి, కాలి వేళ్ళను కూడా బ్రష్ తో రుద్దాలి . ఇలా చేయడం వల్ల కాళ్ళు మరియు వేళ్ళు బ్రైట్ గా కనబడుతాయి.

3.దంతాలు తెల్లగా మార్చుతాయి:

3.దంతాలు తెల్లగా మార్చుతాయి:

మీ దంతాలను తెల్లగా మార్చుకోవడానికి బేకింగ్ సోడా ఒక ఉత్తమ హోం రెమెడీ . దంతాలను మెరిపించుకోవడం కోసం టీత్ వైటనింగ్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు . ఉదయం బ్రెష్ చేసేప్పుడు మీ టూత్ బ్రెష్ మీద బేకింగ్ సోడా చిలకరించి బ్రష్ చేయాలి. 5నిముషాలు బ్రెష్ చేసిన తర్వాత ఫలితం చూడండి.

4. జుట్టు యొక్క నాణ్యత పెంచుతుంది:

4. జుట్టు యొక్క నాణ్యత పెంచుతుంది:

ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను షాంపులో మిక్స్ చేసి తలకు మరియు కేశాలకు పట్టించి మసాజ్ చేయాలి. దీన్ని ఉపయోగించిన తర్వాత వేరే ఏ ఇతర మసాజ్ జెల్స్ అవసరం ఉండదు. ఇతర కండీషనర్స్ మరియు జుట్టును డల్ గా మార్చుతాయి.

5. డ్రై షాంపు:

5. డ్రై షాంపు:

మీరు హెయిర్ వాష్ చేసేప్పుడు మీ తలలోని జిడ్డును తొలగించాలనుకుంటే, మీ జుట్టు నుండి అదనపు ఆయిల్ ను తొలగించుకోవడానికి బేకింగ్ సోడాను ఉపయోగించుకోవచ్చు . ఒక చెంచా లావెండర్ ఆయిల్లో ఒక చెంచా బేకింగ్ సోడా మరియు రోజ్ వాటర్ మిక్స్ చేసి తలకు పట్టించాలి తలస్నానం చేయడం వల్ల హెయిర్ స్ట్రెయిట్ గా మార్చుకోవచ్చు .

6. సన్ బర్న్ ను నివారిస్తుంది:

6. సన్ బర్న్ ను నివారిస్తుంది:

ఒక గ్లాసు నీళ్ళలో రెండు చెంచాల బేకింగ్ సోడా మిక్స్ చేసి కాటన్ క్లాత్ డిప్ చేసి, ఈ క్లాత్ ను సన్ బర్న్ కు ఎఫెక్ట్ అయిన ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది చాలా త్వరగా రిలీఫ్ అందిస్తుంది మరియు రాషెస్ ను తొలగిస్తుంది.

7. కాలిన గాయాలను మాన్పుతుంది:

7. కాలిన గాయాలను మాన్పుతుంది:

బేకింగ్ సోడాను ఒక చెంచా తీసుకొని, కొద్దిగా నీరుపోసి పేస్ట్ లా చేసి ఈ పేస్ట్ ను కాలిన గాయాల మీద అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల కాలినగాయల నుండి తక్షణం ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Unknown Beauty Uses Of Baking Soda

Baking soda is an inexpensive household ingredient. It has wide uses ranging from medicinal to house hold and now in beauty. It is multipurpose substance that has been proven successful in every field.
Story first published: Saturday, May 30, 2015, 16:18 [IST]
Desktop Bottom Promotion