For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెహేంది రంగును తొందరగా తొలగించుకోవడానికి మార్గాలు

By Super
|

వివాహ సీజన్ ప్రారంభం అయింది. అలాగే మెహేంది వేడుకను భారతదేశంలో కేవలం ఉత్తర భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశ వివాహాలలో కూడా జరుపుకుంటున్నారు. గోరింట పూసిన చేతులు సంబరాలలో కీలక భాగంగా ఉన్నప్పటికీ, మెహేంది యొక్క వాసన చాలా మందికి ఇష్టం లేకపోవటం మరియు కొన్ని రోజులకు మెహంది రంగు తగ్గటం ప్రారంభం అవుతుంది.

ఇక్కడ మీకు సురక్షితంగా మరియు త్వరగా మెహేంది తొలగించటానికి చిట్కాలు ఉన్నాయి.

బ్లీచ్ :

బ్లీచ్ :

మెహేంది పెట్టుకున్న ప్రాంతంలో మంచి నాణ్యత కలిగిన బ్లీచ్ ను రాయాలి. మీరు మీ ముఖం మీద ఉపయోగించే రకంను ఉపయోగించాలి.అది ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి.

బేకింగ్ సోడా మరియు నిమ్మరసం :

బేకింగ్ సోడా మరియు నిమ్మరసం :

బేకింగ్ సోడా మరియు నిమ్మరసం కలిపి పేస్ట్ గా చేసి మెహేంది పెట్టుకున్న ప్రాంతంలో రాయాలి. అది పొడిగా మారిన తర్వాత చల్లని నీటితో కడగండి.ఇది మీ చేతులను పొడిగా చేయవచ్చు. కాబట్టి మీరు తేమ ఉండేలా చూసుకోవాలి.

టూత్ పేస్టు:

టూత్ పేస్టు:

టూత్ పేస్టులో ఉన్న కొన్ని లక్షణాలు మెహేంది త్వరగా పోవటానికి సహాయం చేస్తాయి. టూత్ పేస్టును పిండి మెహేంది పెట్టుకున్న ప్రాంతాలలో రాయాలి. అది ఆరిన తర్వాత వేగంగా మీ చేతులను రబ్ చేసి కడగాలి.

హ్యాండ్ వాష్:

హ్యాండ్ వాష్:

రోజులో 10 నుంచి 12 సార్లు తరచుగా చేతులను కడగాలి. సబ్బు మెహంది రంగును తగ్గించటానికి సహాయపడుతుంది. కానీ ఎక్కువగా మీ చేతులను కడగటం వలన పొడిగా మారవచ్చు. కాబట్టి మీ చేతులను కడిగిన ప్రతిసారి మంచి మాయిశ్చరైజర్ ను రాయటం మర్చిపోకూడదు.

ఆలివ్ నూనె ఉప్పు:

ఆలివ్ నూనె ఉప్పు:

ఆలివ్ నూనె ఒక సహజ తరళీకరణగా ఉండుట వలన రంగు క్షీనతకు సహాయపడుతుంది. ఆలివ్ నూనెలో కొంచెం ఉప్పు కలిపి చర్మం మీద రాయాలి. పది నిముషాలు అయిన తర్వాత ఈ ప్రక్రియను కొన్ని సార్లు పునరావృతం చేయండి.మీరు కావలసిన ప్రభావాన్ని పొందడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది.

ఉప్పు నీరు:

ఉప్పు నీరు:

గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి మీ చేతులను 20 నిమిషాల పాటు ఉంచాలి. లేదంటే నీరు చల్లబడే వరకు చేతులను ఉంచాలి. కొంత ప్రభావంను చూడటానికి ఈ ప్రక్రియను కూడా కొన్ని సార్లు పునరావృతం చెయ్యవలసి ఉంటుంది. ఎక్కువసేపు మీ చేతులు ఉప్పు నీటిలో ఉండుట వలన పొడిగా మారవచ్చు. కాబట్టి ఒక మంచి మాయిశ్చరైజర్ ను వాడండి.

క్లోరిన్:

క్లోరిన్:

క్లోరిన్ మెహేంది రంగు తగ్గటానికి సహాయపడుతుంది. కేవలం ఇంట్లోనే క్లోరిన్ నీటిలో మీ చేతులను పది నిముషాలు ఉంచితే సరిపోతుంది.


English summary

Ways To Get rid of fading mehendi quickly

The wedding season is here and the mehendi ceremony is now a big part of not just north Indian, but south Indian weddings as well. While henna-laced hands are a vital part of the festivities, not many people like the smell of mehendi and the way it looks once it starts fading a few days later.
Desktop Bottom Promotion