For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోకాళ్ళ నలుపును మాయం చేసి, తెల్లగా మార్చే 10 హెర్బల్ రెమెడీస్ ..!!

నల్లగా మారిన మోకాలి చర్మ రంగును తెల్లగా మార్చడానికి సహజసిద్ద పదార్థాలతో..హోం రెమడీస్ ఎలా తయారు చేయాలి, ప్రయోజనం ఎలా ఉంటుందో ఒక సారి చూద్దాం..

|

సహజంగా చాలా మంది చూడటానికి చాలా అందంగా, తెల్లగా కనబడుతారు. కానీ మోకాళ్ళు, మోచేతుల విషయానికి వచ్చేసరి, నిర్లక్ష్యం చేస్తుంటారు. చాలా మంది మహిళలకు తమ అందంకోసం ఎక్కు శ్రద్ధ తీసుకుంటారు కానీ, మోకాళ్ళు మోచేతుల మీద మాత్రం కొంత నిర్లక్ష్యం చూపుతారు. అందం విషయంలో శరీర సౌందర్యంలో మోకాళ్ళు, మోచేతులు కూడా ఒక భాగమని తెలుసుకోవాలి. వాటి గురించి సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఆ ప్రదేశాలు నల్లగా మారడంతోపాటు, అందవిహీనంగా కనబడుతాయి. అందుకే చాలా స్త్రీలు, షార్ట్స్ , మరియు ష్లేవ్ లెస్, నీ లెగ్గ్ అవుట్ ఫిట్స్ ధరించడానికి సిగ్గుపడుతుంటారు.

10 Herbal Remedies To Lighten Your Dark Knees Quick!

మోకాళ్ళు మోచేతులు తెల్లగా మార్చడానికి అనేక హోం రెమడీస్ ఉపయోగించడం అంత సులభం కాదు. కానీ, పెరుగు, పాలు, మరియు నిమ్మరసం వంటివి చాలా సాధారణంగా బ్యూటీ వస్తువులుగా ఉపయోగించడం వల్ల మోచేతులు, మోకాళ్ళను నలుపును పోగొట్టుకోవచ్చు. అయితే మోకాళ్లు, మోచేతుల మీద చర్మం మందంగా ఉండటం వల్ల, అక్కడ నూనె గ్రంథులు లేకపోవడం వల్ల త్వరగా డ్రైగా మారుతాయి . దాంతో డార్క్ గా మారుతాయి. డార్క్ గా మారడం మాత్రమే కాదు, ఆ ప్రదేశంలో తరచూ దురద, చర్మం రాసుకోవడం వల్ల ఎండతగలకపోవడం వల్ల, చేతుల మీద ఎక్కువ ఎండ తగలడం వల్ల, హార్మోనుల అసమతుల్లత వల్ల డెడ్ స్కిన్ సెల్స్ పెరుగుతాయి.

ఇటువంటి పరిస్థితిలో మోచేతులకు...మోకాళ్లకు మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల చర్మం డ్రైగా మారకుండా ఉంటుంది. అలాగే సన్ స్క్రీన్ లోషన్ మిస్ చేయకుండా ఉండాలి. వింటర్లో కూడా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం మర్చిపోకూడదు. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగిపోతాయి. సిస్టమ్ క్లియర్ అవుతుంది. ఇది కూడా ఒకరకంగా చర్మంను లైట్ గా మార్చుతుంది. నల్లగా మారిన మోకాలి చర్మ రంగును తెల్లగా మార్చడానికి సహజసిద్ద పదార్థాలతో..హోం రెమడీస్ ఎలా తయారు చేయాలి, ప్రయోజనం ఎలా ఉంటుందో ఒక సారి చూద్దాం..

ఆవనూనె :

ఆవనూనె :

ఆవనూనెలో ఉండే లినోలిక్, ఎరూసస్ మరియు ఓలియక్ యాసిడ్స్ నల్లగా మారిన మోచేతులను, మోకాళ్ళను తెల్లగా మార్చుతుంది. రాత్రుల్లో నిద్రించడానికి ముందు కొద్దిగా ఆవనూనెను మోచేతులకు మరియు మోకాళ్ళకు అప్లై చేయాలి. తర్వాత ఉదయం స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడా, పాలు :

బేకింగ్ సోడా, పాలు :

బేకింగ్ సోడా డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. పాలలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో, పాలు మిక్స్ చేసి, చిక్కటి పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ళు, మోచేతులకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరించి స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆనియన్-లెమన్ జ్యూస్ :

ఆనియన్-లెమన్ జ్యూస్ :

ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్, నిమ్మరసంలో ఉండే యాసిడ్స్ మోకాళ్ళు, మోచేతుల మీద డెడ్ స్కిన్ సెల్స్ పెరగకుండా నివారిస్తుంది. ఉల్లిపాయను పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి, పేస్ట్ చేయాలి. అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం, గ్లిజరిన్ మిక్స్ చేసి, అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి, శుభ్రం చేసుకోవాలి.

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీ:

చర్మంలోనికి డీప్ గా చొచ్చుకుపోయే స్వభావం కలది పెట్రోలియం జెల్లీ. ఇది చర్మం మీద పొట్టు లాంటి పదార్థంను తొలగిస్తుంది. చర్మానికి పోషణను అందిస్తుంది. రాత్రి నిద్రించడానికి ముందు పెట్రోలియం జెల్లీని అప్లై చేసి ఉదయం యథావిధిగా స్నానం చేయడం వల్ల ఆ ప్రదేశంలో చర్మం సాప్ట్ గా తెల్లగా ఉంటుంది. చర్మంలో మార్పు కనబడే వరకూ పెట్రోలియం జెల్లీని అప్లై చేయవచ్చు.

శెనగపిండి పసుపు:

శెనగపిండి పసుపు:

శెనగపిండిలో ఉండే విటమిన్స్ చర్మంను శుభ్రం చేస్తుంది. పసుపు, నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చుతుంది. పెరుగు చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి తీసుకుని, అందులో పసుపు, పెరుగు కూడా సమయంగా మిక్స్ చేసి మోకాళ్ళు, మోచేతులకు అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేయడం వల్ల చర్మం ఎక్స్ ఫ్లోయేట్ అవుతుంది. చూడటానికి తెల్లగా సాప్ట్ గా, తేమగా కనబడుతాయి.

వెనిగర్ :

వెనిగర్ :

వెనిగర్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ కెమికల్ పీల్ రిమూవింగ్ టాన్ గా పనిచేస్తుంది. కొన్ని చుక్కల వెనిగర్ లో కాటన్ బాల్ డిప్ చేసి మోకాళ్ళు మోచేతుల మీద అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చల్లటి నీటితో కడగాలి.

ఆరెంజ్:

ఆరెంజ్:

ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ టోన్ ను లైట్ గా మార్చుతుంది. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి, మెత్తగా పేస్ట్ చేయాలి. ఒక బౌల్లో ఒక టీస్పూన్ ఆరెంజ్ పౌడర్ తీసుకుని, అందులో రోజ్ వాటర్ మిక్స్ చేసి స్మూత్ గా పేస్ట్ చేయాలి. దీన్ని మోచేతులు, మోకాళ్ళకు అప్లై చేయాలి. తడిన ఆరిన తర్వాత నీళ్ళు చిలకరించి స్ర్కబ్ చేసి వాష్ చేసుకోవాలి.

పొటాటో :

పొటాటో :

బంగాళదుంప గ్రేట్ బ్లీచింగ్ ఏజెంట్. ఇది చర్మం రంగును మార్చడంలో గొప్పగా సహాయపడుతుంది. బంగాళదుంపను మెత్తగా బాయిల్ చేసి, పేస్ట్ చేయాలి. అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ నేచురల్ పదార్థాల మిశ్రమాన్ని వారంలో రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

టమోటో:

టమోటో:

టమోటోలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది టాన్ తొలగిస్తుంది. టమోటోలను స్లైస్ గా కట్ చేసి, కొద్దిగా షుగర్ చిలకరించి మర్ధన చేయాలి. మోకాళ్ళ మీద , మోచేతుల మీద అప్లై చేసి మర్ధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 5 నిముషాలు చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో కడిగేసుకోవాలి. ఈ మాస్క్ ను రెగ్యులర్ గావేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ద్రాక్ష:

ద్రాక్ష:

పొటాటో లాగే,ద్రాక్షలో కూడా బ్లీచింగ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, ఇది చర్మాన్ని నేచురల్ గా తేలికగా మార్చుతుంది. ఒక టేబుల్ స్పూన్ ద్రాక్షరసం తీసుకుని, కాటన్ బాల్ డిప్ చేయాలి. శరీరంలో నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, 20 నిముషాల తర్వాత టవల్ తో తుడిచేయాలి. ఇది చర్మాన్ని తెల్లగా మార్చడంతో పాటు, మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

English summary

10 Herbal Remedies To Lighten Your Dark Knees Quick!

Buff, tone and exfoliate your dark knees with these herbal remedies!
Story first published: Tuesday, December 27, 2016, 13:49 [IST]
Desktop Bottom Promotion