For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయస్సైన లక్షణాలు చేతుల మీద కూడా తెలుస్తాయా...?

By Staff
|

సహజంగా మనకున్న అందాన్ని మరింత అందంగా కనపించడం కోసం ముఖానికి ఫేస్ క్రీములు, యాంటీఏజర్స్ మరియు వివిధ రకాల కాస్పోటిక్స్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించి వ్రుద్యాప్య లక్షణాలను కనబడనివ్వకుండా ...యవ్వనంగా కనబడేదుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటాము.

అయితే అదే విధంగా చేతులుకు కూడా ఇలాగే మెయింటైన్ చేస్తున్నారా?మానిక్యూర్ చేయడం లేదా ఏదో ఒక సందర్భంలో మాయిశ్చరైజింగ్ అప్లై చేయడం కంటే , మన చేతులు అందంగా కనబడుటకోసం మరింకేమైనా చేస్తున్నామా...

Signs Of Ageing Hands

మన ఎదుటి వ్యక్తులు మొదట ముఖం తర్వాత చేతులను గమనిస్తుంటారు, అంతే కాదు వీటి మీద ఎదుటివారికి కాస్త ఏకాగ్రత ఎక్కువే . ఈ మార్పును తొలగించడం అంత సులభం కాదు.

వయస్సును వివిధ రకాల మార్గాల్లో దాచిపెట్టవచ్చు, కానీ చేతులు కళ్ళకు కొట్టొచ్చినట్లు కనబడుతుంటాయి.నిజానికి, శరీరంలో మొదట ఏజింగ్ లక్షణాలను తెలిపేది చేతులే.

ఇలా ఏజింగ్ లక్షణాలు చేతులతో కనబడం ఎందుకు ప్రారంభమవుతుంది అంటే , అక్కడ చాలా తక్కువగా కొవ్వు ఉంటుంది, కాబట్టి వయస్సు పైబడిన లక్షణాలు కనబడుట అక్కడి నుండే ప్రారంభం అవుతాయి.

ఇంకా, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల మరియు వివిధ రకాల కారణాలు వల్ల చర్మం క్రింది బాగంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఏజింగ్ లక్షణాలు కనబడుతుంటాయి . ఏజింగ్ లక్షణాలను చాలా సులభంగా గమనించవచ్చు .

ఇలా చేతుల మీద ఏజింగ్ లక్షణాలను నివారించడం కోసం వివిధ రకాల కాస్మోటిక్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి . మన శరీరంలోని ఇతర భాగాలలో కంటే మన చేతుల మీద ఉన్న చర్మం చాలా త్వరగా వయస్సుపైబడే లక్షణాలను చూస్తుంది మరియు త్వరగా వయస్సుపైబడేందుకు కారణం అవుతుంది . దీన్ని మనం చాలా సులభంగా గుర్తించవచ్చు .

చేతుల మీద వయస్సు పైబడుతున్న లక్షణాలను ఈక్రింది విధంగా గుర్తించవచ్చు ..

డార్క్ సన్ స్పాట్స్ లేదా లివర్ స్పాట్స్ :

డార్క్ సన్ స్పాట్స్ లేదా లివర్ స్పాట్స్ :

ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల చేతుల మీద బ్లాక్ స్పాట్స్ లేదా డార్క్ స్పాట్స్ త్వరగా ఏర్పడుతాయి . వయస్సైన వారిలో ఇవి క్రమంగా పెరుగుతుంటాయి. ఇలాంటి స్పాట్స్ (మచ్చలు)కనబడుకుండా ఉండాలంటే ఎండలో ఎక్కువగా తిరగకపోవడమే మంచిది . అలాగే చేతులకు సన్ స్క్రీన్ అప్లైచేయడం మర్చిపోకూడదు.

అనుకోని విధంగా స్కిన్ టోన్:

అనుకోని విధంగా స్కిన్ టోన్:

స్కిన్ సెల్స్ ఉత్పత్తిని బట్టి, మన వయస్సు ఆధారపడి ఉంటుంది, వయస్సు పెరిగే కొద్ది స్కిన్ సెల్స్ ఉత్పత్తి తగ్గుతుంది . దాంతో చర్మం రంగులో కూడా మార్పు వస్తుంది . విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

ప్రొమినెట్ వీన్స్:

ప్రొమినెట్ వీన్స్:

చర్మం క్రింది ఉండే రక్త నాళాలను కొల్లాజెన్ డ్యామేజ్ వల్ల చాల త్వరగా లక్షణాలు బయటకు కనబడుతాయి .ఇంజెక్టబుల్ ఫిల్లర్స్ ద్వారా వీన్స్ చుట్టూ ఉన్నఇలాంటి కొన్ని టిష్యులను తొలగించుకోవచ్చు.

క్రీపి స్కిన్ :

క్రీపి స్కిన్ :

యూవీ కిరణాలకు ఎక్కువగా ఎక్స్ ఫోజ్ అవ్వడం వల్ల కొల్లాజన్ డ్యామేజ్ అవుతుంది. క్రమంగా చర్మం క్రీపిగా కనడటానికి కారణం అవుతుంది.

స్కలీ స్కిన్:

స్కలీ స్కిన్:

ఏజింగ్ వల్ల చర్మం పొడిబారడం మరియు తర్వాత తర్వాత స్కాలీగా మారడం జరుగుతుంది. అందుకు క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం సరైన హ్యాడ్ కేర్ తీసుకోవడం వల్ల కొంత వరకూ ఈ స్కిన్ సమస్యను నివారించుకోవచ్చు.

స్కిన్ ఎలాసిటి తగ్గుతుంది:

స్కిన్ ఎలాసిటి తగ్గుతుంది:

చేతుల మీద వయస్సు పైబడిన లక్షణాలు తెలపడంలో మరొకటి, చర్మం యొక్క స్థితిస్థాపకత. స్కిన్ ఎలాసిటిని కోల్పోవడం. ఒక సారి చేతులను అలా గిచ్చి వదలడం వల్ల చేతుల మీద చర్మం తిరిగి పూర్వస్థితికి రాలేకపోవడం.

కూటికల్స్ :

కూటికల్స్ :

డీహైడ్రేషన్ వల్ల , హైడ్రేషన్ కోల్పోవడం వల్ల క్యూటికల్స్ పొడిబారిపోతుంటాయి , ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి, నెయిల్స్ డ్యామేజ్ అయ్యి, ఇన్ఫెక్షన్ సోకుతుంది.

పొడిబారిన , పగుళ్లతో కూడిన గోళ్లు:

పొడిబారిన , పగుళ్లతో కూడిన గోళ్లు:

కెమికల్ ఎక్సపోజర్స్ , వాటర్ మొదలగు వాటి వల్ల గోళ్ళు డ్రైగా కనబడుతాయి . తర్వాత గోళ్ళు బ్రేక్ అవుతుంటాయి . ఇంకా క్యాల్షియం లోపం వల్ల కూడా బ్లిస్టర్ నెయిల్స్ కు కారణం అవుతుంది .

స్టెయిన్ నెయిల్స్:

స్టెయిన్ నెయిల్స్:

నెయిల్ పెయిల్స్ మరియు రిమూవర్స్ ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల మన గోళ్ళు డిస్క్ కలర్ కు చేరుకుంటాయి , ఇంకా కొద్దిగా ఎల్లోగా మారిపోతాయి .

డ్రై ప్యాచ్ లు:

డ్రై ప్యాచ్ లు:

వయస్సు పెరిగే కొద్ది, చర్మం మరింత సస్పెక్టబుల్ గా మారుతుంది , అప్పుడు కెమికల్స్ సోప్స్ లేదా వాటర్ వల్ల చేతుల మరింత చీకాకు గురి అవుతాయి . దాంతో చర్మం మరింత ఎక్కువగా డ్రైగా మారుతుంటాయి . కాబట్టి చేతులుకు క్రమం తప్పకుండా హైడ్రేషన్ మరియు మాయిశ్చరైజర్ చాలా అవసరం అవుతుంది.

English summary

10 Signs Of Ageing Hands

We give the best of all we have to our face like lotions, creams, anti-agers and numerous other products to prevent the skin from ageing and preserving its youth. However, do we think about maintaining the youth of our hands as well? Apart from manicure and occasional moisturising, there is hardly anything we do to maintain the beauty of our hands.
Desktop Bottom Promotion