For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిండైన ముఖంలో ఒత్తైన కనుబొమ్మలు పెరగాలంటే 13 ఎఫెక్టివ్ హోం రెమెడీస్..

|

ప్రస్తుత కాలంలో బ్యూటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా, ముఖంలో ఏదో ఒక లోపం కనబడుతుంటుంది. ఎంత అందంగా ఉన్న ముఖములో చూడచక్కని ఐబ్రోస్(కనుబొమ్మలు)లేకుంటే ఆ అందమంతా పాడవుతుంది. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో పెద్దగా, ఒత్తుగా కనబడే ఐబ్రోస్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలా ఉడాలని కోరుకోవడం లేటెస్ట్ ట్రెండ్. ముఖ అందంలో ఐబ్రోస్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి . అందమైన ఐబ్రోస్ కలిగి ఉండటం వల్ల అందం మరింత పెరుగుతుంది.

ఒత్తైన కనుబొమ్మలుండాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. ఎందుకంటే కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే వయసు తక్కువగా కనిపిస్తుంది. కనుబొమ్మల మన లుక్ ని ఎట్రాక్టివ్ గా మారుస్తాయి. కొంతమందికి పుట్టుకతోనే ఒత్తైన కనుబొమ్మలుంటే మరికొంతమందికి పలుచగా ఉంటాయి. అలాంటివారు తమ కనుబొమ్మలని ఒత్తుగా చేయడానికి చిట్కాలు వెతుకుతూ ఉంటారు. అలాంటి వారికోసం కొన్ని నేచురల్ హోం రెమెడీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలుండవు. త్వరగా, అందంగా, ఒత్తుగా ఐబ్రోస్ పెరగడానికి సహాయపడుతాయి.

బ్యూటిఫుల్ ఐబ్రోస్ పొందాలంటే కొన్ని నేచురల్ రెమెడీస్ ఉన్నాయి..

ఆముదం:

ఆముదం:

ఐబ్రోస్ ఫాస్ట్ గా ఒత్తుగా పెరగాలంటే ఆముదం నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని చుక్కల ఆముదం నూనెను చేతిలోకి తీసుకుని ఫింగర్ టిప్స్ లేదా కాటన్ బాల్ అందులో అద్ది ఐబ్రోస్ మీద అప్లై చేసి నిదానంగా 5 నిముషాలు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

ఫింగర్ టిప్స్ మీదకు కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసుకుని ఐబ్రోస్ కు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి. కొన్ని నిముషాల తర్వాత మసాజ్ చేసిన తర్వాత రాత్రంతా అలాగా ఉండనిచ్చి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి.

ఎసెన్సియల్ ఆయిల్స్ :

ఎసెన్సియల్ ఆయిల్స్ :

రెగ్యులర్ గా మనం ఉపయోగించే నూనెలు కాకుండా..కొన్ని ఎసెన్సియల్ ఆయిల్ ను ఐబ్రోస్ కు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎసెన్సియల్ ఆయిల్స్ లో లెమన్ ఆయిల్, రోజ్ ఆయిల్, లావెండర్ ఆయిల్ వంటివి ఐబ్రోస్ పెరగడానికి సహాయపడుతాయి.

కలబంద:

కలబంద:

కలబందలోని రసాన్ని తీసి, ఐబ్రోస్ కు అప్లై చేసి మసాజ్ చేయాలి. సున్నితంగా మసాజ్ చేసిన అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకుంటే ఒత్తుగా, చక్కటి ఆకారంతో ఐబ్రోస్ పెరుగుతాయి.

నిమ్మరసం:

నిమ్మరసం:

తర్వగా ఐబ్రోస్ పెంచుకోవడానికి బెస్ట్ హోం రెమెడీ నిమ్మరసం. ఫ్రెష్ గా ఉండే నిమ్మకాయను కట్ చేసి, అందు నుండి నిమ్మరసం తీసి, ఐబ్రోస్ మీద రబ్ చేయాలి. 10 నిముషాలు ఇలా చేసి, అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

ఉల్లిపాయ :

ఉల్లిపాయ :

ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసి,రసం తియ్యాలి. ఈ ఉల్లిరసాన్ని ఐబ్రోస్ కు అప్లై చేయాలి. హెయిర్ ఫోలిసెల్స్ కు పూర్తిగా అంటిన తర్వాత నాలుగైదు గంటల తర్వాత మంచి నీటితో కడిగేసుకోవాలి

మెంతులు :

మెంతులు :

ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని అందులో నీరు పోసి నానబెట్టాలి. నానిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ను కనుబొమ్మలకు ప్యాక్ వేయాలి. దీన్ని రాత్రి నిద్రించే సమయానికి ముందే అప్లై చేయడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. దీన్ని మైల్డ్ ఫేషియల్ క్లెన్సర్ తో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పచ్చిపాలు :

పచ్చిపాలు :

పచ్చిపాలలో ఐబ్రోస్ ను ఒత్తుగా, ఫాస్ట్ గా పెంచే గుణాలున్నాయి. కాటన్ బాల్ ను పచ్చిపాలలో డిప్ చేసి ఐబ్రోలకు అప్లై చేయాలి. ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

గుడ్డులోని పచ్చసొన :

గుడ్డులోని పచ్చసొన :

గుడ్డుపచ్చసొనలో ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఇవి ఐబ్రోస్ త్వరగా పెరగడానికి సహాయపడుతాయి. గుడ్డును బ్రేక్ చేసి పచ్చసొన మాత్రం తీసుకుని, నేరుగా ఐబ్రోస్ కు అప్లై చేయాలి. మాస్క్ వేసుకున్న ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె మరియు లెమన్ పీల్ మాస్క్ :

కొబ్బరి నూనె మరియు లెమన్ పీల్ మాస్క్ :

నిమ్మకాయ తొక్కను మాత్రం తీసుకోవాలి. పైన తొక్కను తురుముకోవాలి. అందులో మూడు చెంచాల కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. అలాగే నిమ్మతొక్కలను కూడా అందులో వేసి, బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. 15 రోజుల తర్వాత ఈ నూనెను ఐబ్రోస్ కు క్రమం తప్పకుండా కాటన్ బాల్ తో డిప్ చేసి ఐబ్రోలకు అప్లై చేయాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు ఐబ్రోలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

ఆల్మండ్ ఆయిల్

ఆల్మండ్ ఆయిల్

ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఏ,బీ మరియూ ఈ ఉంటాయి. వీటివల్ల జుట్టుకి తగిన పోషణ అంది జుట్టు బాగా పెరుగుతుంది. ఆల్మండ్ ఆయిల్ ని మీ కనుబొమ్మల మీద వలయాకారంలో మసాజ్ చెయ్యండి. రాత్రంతా అలా ఉంచి పొద్దున్నే ముఖం కడుక్కోండి.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఐబ్రో ఒత్తుగా పెరగడానికి ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయవచ్చు . దీన్ని రాత్రంతా అలాగే వదిలేసి ఉదయం కడిగేయాలి.

హైబిస్కస్ ఆయిల్:

హైబిస్కస్ ఆయిల్:

మందారం నూనె లేదా మందార పువ్వుల యొక్క పేస్ట్ ను కనుబొమ్మలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత నీళ్ళతో కడిగేయాలి.

English summary

13 Effective Home Remedies To Grow Eyebrows Faster

Do you want to make your eyebrows thicker and darker? If yes, you have come to right place. Boldsky shares with you some of the best tips to make your eyebrows thicker. With these natural ways, there will be no side effects even if you have sensitive skin.
Story first published: Wednesday, July 20, 2016, 17:37 [IST]
Desktop Bottom Promotion