For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో పాదాలు, మడమలు పగుళ్ళను నివారించే ఎఫెక్టి హోం రెమెడీస్..!!

అధిక శాతం మందికి పాద సంరక్షణపై పెద్దగా శ్రద్ధ ఉండదు. పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి, వాచి తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది.

|

అధిక శాతం మందికి పాద సంరక్షణపై పెద్దగా శ్రద్ధ ఉండదు. పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి, వాచి తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది. ఫంగల్ ఇన్ ఫెక్షన్ కూడా దారి తీయవచ్చు. అలాగే, తగినంత తేమ లేకపోవడం, ఎక్కువగా తడిలో పాదాలు నానడం కూడా ఈ సమస్యకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

ఈ తరహా సమస్య... శీతాకాలం... వేసవి కాలం.. కొందరిని వర్షాకాలంలోనూ ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. ఈ సమస్య కారణంగా చూడడానికి పాదాలు ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. స్త్రీలకు అందమైన పాదాలు ఓ పెద్ద అసెట్ అని తెలిసిందే కదా. చాలా మంది రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. మరికొందరు వైద్యుల సలహాతో వివిధ రకాల మందులు వాడినా ఆశించిన ఫలితం లేక విసుగు చెందుతారు.

శీతాకాలం మొదలైందంటే చాలు చర్మం మీద పగుళ్ళు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా పాదాల, మిడిమలు ఎక్కువగా బహిర్గతమౌతాయి కాబట్టి, వీటి మీద పగుళ్ళు ఎక్కువగా ఏర్పడుతాయి. కేవలం పగుళ్లు మాత్రమే ఒక రకమైన ఇబ్బందిని కలిగిస్తే, పగుళ్ళతో పాటు నొప్పి కూడా ఉంటే ఆ బాధ వర్ణణాతీతం. నొప్పి మాత్రమే కాదు, అటువంటి కాళ్ళకు ఎంత అందమైన ఫ్యాన్సీ సాండిల్స్, మరియు షులు ధరించినా ప్రయోజనం ఉండదు.

15 Remedies To Heal Your Dry Heels This Winter

ఇటువంటి పరిస్థితిని అంటే పాదాలు, మడమల పగుళ్ళను నివారించడానాకి కొన్ని హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వింటర్లో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి, కాబట్టి, ఈ సమస్యను ఎంటనే నివారించుకోకపోతే, ఇది మరింత పెయిన్ ఫుల్ గా మారుతుంది. రక్తస్రావం కూడా జరగుతుంది. అటువంటి పరిస్థితి ఎదుర్కోకూడదనుకుంటే, వెంటనే కొన్ని హోం రెమెడీస్ ను ప్రయత్నించండి.

ఈ హోం రెమెడీస్ కేవలం పాదాల పగుళ్ళను నివారించడం మాత్రమే కాదు, మడిమల నొప్పులను నివారిస్తుంది. ఈ హోం రెమెడీస్ తో కొంత ఉపశమనం కలుగుతుంది. అప్పుడప్పుడు పాదాలు, మడిమలు పగుళ్ళు ఏర్పడటం సహజం . ఇది పూర్తిగా నార్మల్ అని చెప్పలేము . కాబట్టి, పూర్తిగా ఈ పగుళ్ళు పూర్తిగా నివారించే వరకూ హోం రెమెడీస్ ను ఉపయోగించడం మంచిది. మరి అటువంటి ఎఫెక్టివ్ రెమెడీస్ ఏంటో...అవి ఏవిధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం..

 అరటిపండు

అరటిపండు

తాజాగా ఉన్న ఒక అరటిపండు తీసుకుని దాన్ని గుజ్జుగా చేసి పొడిగా ఉన్న చోట,పగిలిన పాదాకు పూసి 10 నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడివేస్తే అది పొడిగా ఉన్న లేక పగిలిన పాదాలని చాలా మ్రుదువుగా మార్చుతుంది. ఫ్రూట్ మసాజ్: బాగా పండిన అరటిపండును బాగా గుజ్జులా చేసి పగిలిన పాదాలకు అలాగే పట్టించాలి. పది పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మెత్తబడుతాయి. ఇలా ప్రతి రోజూ కూడా చేయొచ్చు.

నిమ్మరసం, ఉప్పు-గ్లిజరిన్ -రోస్ వాటర్:

నిమ్మరసం, ఉప్పు-గ్లిజరిన్ -రోస్ వాటర్:

ఇది ఒక బెస్ట్ మంచి చిట్కా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఖర్చుతక్కువ, ఫలితమెక్కువ కాబట్టి. ఒక బౌల్లో రాళ్ళ ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ వేసి అందులో గోరు వెచ్చని నీళ్ళు పోసి అందులో కాళ్ళు మునిగేలా కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఇరవై నిముషాల తర్వాత స్కబ్బర్ తో స్ర్కబ్ చేయాలి. మెత్తబడిన కాళ్ళనుండి మృత చర్మం తొలగిపోయి అందంగా మారుతాయి. శుభ్రం చేసిన తర్వాత కొద్దిగా గ్లిజరిన్, రోజ్ వాటర్, నిమ్మరసం మళ్ళి మిక్స్ చేసి చిక్కని పేస్ట్ ను శుభ్రం చేసి కాళ్ళకు పట్టించి ఆరనివ్వాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అవసం ఐతే పడుకొనే ముందు కాళ్ళకు సాక్సులు ధరించుకోవచ్చు.

రైస్, తేనె మరియు వెనిగర్

రైస్, తేనె మరియు వెనిగర్

ఒక కప్పు రైస్ ను రుబ్బించి, దీనికి తేనె మరియు వెనిగర్ ను కలపండి. తరువాత, గోరు వెచ్చని నీటిలో 10 నిమిషాల పాటూ పగిలిన మడిమలను నానబెట్టి, ఆరేవరకు వేచి ఉండండి. రుబ్బి తయారుచేసిన మిశ్రమాన్ని, పగిలిన పాదాలకు పొడి చర్మం పోయే వరకు రాయండి. పాదాలకు కావలసిన తేమను తేనె అందిస్తుంది. రైస్ మరియు వెనిగర్ ఎక్సోఫోలేట్ గుణాలను కలిగి ఉన్నందు వలన, పాదాల పొడితత్వాన్ని శక్తివంతంగా దూరం చేస్తాయి.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో కూడా విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది పాదాలకు పోషణను అందిస్తుంది. డీప్ గా చర్మంలోకి చొచ్చుకుని పోయి, పగుళ్ళను, నొప్పిని నివారిస్తుంది.

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీ క్రాక్డ్ హీల్స్ కు బెస్ట్ హోం రెమెడీ. పగిలిన పాదాలకు మరియు మడిమలకు పెట్రోలియం జెల్లీ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాత్రుల్లో అప్లై చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నిమ్మరసం సాల్ట్ స్ర్కబ్ :

నిమ్మరసం సాల్ట్ స్ర్కబ్ :

గోరువెచ్చని నీటిలో పాదాలను డిప్ చేసి కొద్ది సేపటి తర్వాత సాల్ట్ లో డిప్ చేసిన నిమ్మతొక్కతో పాదాలను స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ , ఇతర ఇన్ఫెక్షన్స్ తొలగిపోయి అందంగా కనబడుతాయి.

రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ :

రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ :

రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ రెండూ మిక్స్ చేసి రాత్రి నిద్రించడానికి ముందు పాదాలకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు సాఫ్ట్ గా మారుతాయి. రెగ్యులర్ గా ఉపయోగిస్తే మరీ మంచిది.

విటమిన్ ఇ ఆయిల్ :

విటమిన్ ఇ ఆయిల్ :

విటమిన్ క్యాప్స్యుల్స్ తీసుకుని రెండుగా చేసి, లోపలి ఆయిల్ ను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇది చర్మ సమస్యలకు గ్రేట్ గా సహాయపడుతుంది. వివిధ రకాల పాదాల సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె :

కేవలం చర్మ సమస్యలను నివారించడంలో కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. . అలాగే పాదాలు, మడిమల పగుళ్ళను కూడా నివారిస్తుంది. పగిలిన , నొప్పి కలిగించే మడమలనుకు కొబ్బరినూనెను ఒత్తుగా అప్లై చేయాలి. ముఖ్యంగా రాత్రుల్లో నిద్రించడానికి ముందు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వేప ప్యాక్:

వేప ప్యాక్:

వేప ఆకులను మెత్తగా పేస్ట్ చేసి పసుపు అప్లై చేయాలి. వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు బ్యాక్టీరియాను నివారిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ తగ్గి పగుళ్ళు ఏర్పడకుండా ఎదుర్కొంటుంది. ఈపేస్ట్ కు కొద్దిగా పసుపు చేర్చితే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇన్ప్లమేషన్ తగ్గిస్తుంది.

వెనిగర్ :

వెనిగర్ :

వేడి నీటిలో వెనిగర్ మిక్స్ చేసి అందులో పాదాలను డిప్ చేసి ఫ్యూమిస్ స్టోన్ తో రుద్దడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి . తర్వాత స్ట్రాంగ్ మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

ఆముదం

ఆముదం

ఆముదం చర్మంలోనికి డీప్ గా చొచ్చుకుని పోయి, మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. ఇందులో ఉండే ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మంలోకి పూర్తిగా చొచ్చుకుని పోయి చర్మం పగుళ్ళు మరియు మడమల నొప్పులను నివారిస్తుంది. రాత్రుల్లో ఈ నూనెను పాదాలకు అప్లై చేసి రాత్రుల్లో వదిలేయడం వల్ల మంచి రిలీఫ్ దొరుకుతుంది.

షీ బట్టర్ :

షీ బట్టర్ :

షీ బట్టర్ డ్రై స్కిన్ కు బాగా వర్కౌట్ అవుతుంది. దీన్ని హీల్స్ కు అప్లై చేయడం వల్ల పగుళ్ళతో పాటు, నొప్పి కూడా తగ్గుతుంది. దీన్ని రాత్రుల్లో పాదాలకు, మడమలకు అప్లై చేసి వదిలేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కోక బట్టర్ :

కోక బట్టర్ :

డ్రై స్కిన్ నివారించడంలో కోకబట్టర్ గ్రేట్ గా సహాయపడుతుంది. పాదాలకు మరియు మడమలలకు బట్టర్ ను పూర్తిగా అప్లై చేయాలి. తర్వాత సాక్సులు వేసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు, మడిమల పగుళ్ళు ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.

 రైస్ ఫ్లోర్ మరియు హనీ:

రైస్ ఫ్లోర్ మరియు హనీ:

రైస్ ఫ్లోర్ హనీ స్ర్కబ్ చాలా సులభం మరియు త్వరగా రిజల్ట్ అందిస్తుంది. తేనె ఎక్సఫ్లోయేట్ గా పనిచేస్తుంది మరియు మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తుంది. . రైస్ ఫ్లోర్ పాదాల మీద ఉండే డెడ్ స్కిన్ తొలగిస్తుంది.

English summary

15 Remedies To Heal Your Dry Heels This Winter

Dry, cracked heels are not just unsightly, but they are also quite painful and just think of how bad they would look when you wear fancy sandals and shoes. These home remedies are all such easy ways to heal your heels! This is an exceptionally big problem during the winters. If not dealt with fast, it can even turn painful and start bleeding
Story first published: Friday, December 23, 2016, 17:08 [IST]
Desktop Bottom Promotion