For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ స్కిన్ కేర్: సాల్ట్ తో సర్ ప్రైజింగ్ బ్యూటి బెనిఫిట్స్

|

ఉప్పు మన నిత్యవసర వస్తువుల్లో అత్యంత ముఖ్యమైనది. ఇదిలేదంటే అస్సలు వంటలే రుచి ఉండవు. వంటలకు రుచి మాత్రమే కాదు, ఒంటికి కూడా బహు ప్రయోజనాలను అందిస్తుంది. సాల్ట్ ను బాతింగ్ వాటర్ లో మిక్స్ చేసి ఉపయోగించుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది . మరియు అదే సమయంలో ఈ పవర్ ఫుల్ ఫుడ్ఐటమ్ ముఖంలో మొటిమలను, డెడ్ స్కిన్ తొలగించి స్కిన్ కాంప్లెక్స్ ను పెంచుతుంది.

అవును ఈ సమ్మర్లో సాల్ట్ ను చర్మ సంరక్షణకు ఉపయోగించడం చాలా మంది. అందెలాగో తెలుసుకోవడానికే మేము మీకు కొన్ని మార్గాలను లిస్ట్ అవుట్ చేసి మీకు అందివ్వడం జరిగింది. కాబట్టి, మీరు సలూన్ లకు వెళ్లినప్పుడు అక్కడున్న లిస్ట్ లో గమనించినట్లైతే సాల్ట్ కూడా ఉంటుంది.

ఉప్పుతో మైగ్రేన్ నుంచి క్షణాల్లో ఉపశమనం పొందడం ఎలా ?

అందువల్ల, మీరు కూడా ఇలా సలూన్ లో ఉపయోగించే ఈ విలువైన పదార్థాన్ని మీరు ఇంట్లో కూడా మీ అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు . అందుకు మీరు చేయాల్సిందల్లా మీ ఫేషియల్ కిట్ లో కొద్దిగా సాల్ట్ ను చేర్చాలి. ముఖ్యంగా మీరు బాడీ మొత్తం స్పా ట్రీట్మెంట్ కోసం వెళుతున్నట్లైతే , బాడీ స్పా కిట్ లో కూడా మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పు వేయాలి.

ఉప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని అనర్ధాలో...

ఈ పవర్ ఫుల్ పదార్థంతో బాడీ మసాజ్ చేయడం వల్ల మీ చర్మ సమస్యలు చాలా త్వరగా నివారించుకోవచ్చు . కాబట్టి, మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. ఈ చౌకైన పదార్థం శరీర అందాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో చూద్దాం...

ఉప్పు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది:

ఉప్పు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది:

మూడు చెంచాల తేనెలో ఒక చెంచా ఉప్పు చేర్చి మిక్స్ చేయాలి . ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి , చర్మానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత సర్క్యులర్ మ్యానర్లో మసాజ్ చేయాలి . కాబట్టి దాంతో చాలా త్వరగా చర్మంలోని డెడ్ స్కిన్ తొలగించుకోవచ్చు. ఇదే చిట్కాను తిరిగి 2 రోజులకు ప్రయత్నించాలి.

స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది:

స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది:

మీ స్కిన్ టోన్ మెరుగుపరచడానికి , ఒక బెస్ట్ పదార్థం ముఖానికి ఉప్పును అప్లై చేయడం . రోజ్ వాటర్లో కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా రోజ్ వాటర్ క్లియర్ స్కిన్ అందిస్తుంది. సాల్ట్ చర్మంలో మలినాలను తొలగిస్తుంది.

ముడతలను నివారిస్తుంది:

ముడతలను నివారిస్తుంది:

ముఖంలో ముడతలుండటం వల్ల ముఖం అందవిహీనంగా కనబడుతుంది. కాబట్టి ముడుతలను నివారించుకోవడానికి సాలిన్ సొల్యూషన్ ను ప్రతి రోజూ 10 నిముషాలు ముఖానికి అప్లై చేస్తుండాలి . ఈ చిన్న చిట్కాతోనే ముడుతలను నివారించుకోవచ్చు.

సాల్ట్ స్కిన్ ను సాఫ్ట్ గా మార్చుతుంది:

సాల్ట్ స్కిన్ ను సాఫ్ట్ గా మార్చుతుంది:

మీ చర్మాన్ని సాఫ్ట్ గా మార్చుకోవడం కోసం ఎక్కువ ఖర్చుచేసి, ఖరీదైన ఫేస్ క్రీమ్స్ ను కొనాల్సిన పనిలేదు . వారంలో రెండు లేదా మూడు సార్లు సాల్ట్ ఫేషియల్ చేసుకోవడం వల్ల స్కిన్ సాఫ్ట్ గా మారుతుంది. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ను బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా కోల్డ్ క్రీమ్ మరియు ఒక చెంచా పాలు తీసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను చాలా సింపుల్ రెమెడీస్ తో నివారించుకోవచ్చు . ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు తీసుకొని అందులో ఒక చెంచా పసుపు మిక్స్ చేయాలి. దీనికి కొద్దిగా పెరుగు జోడించి బాగా మిక్స్ చేయాలి . ఇప్పుడు ఈ చిక్కటి పేస్ట్ ను మీ ముఖానికి పట్టించాలి. దీన్ని డ్రైగా అయ్యేలా చేసి తర్వాత ముఖాన్ని వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వారంలో రెండు సార్లు ప్రయత్నిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు మాయం అవుతాయి.

గాయాలను మాన్పడంలో ఉప్పు సహాయపడుతుంది:

గాయాలను మాన్పడంలో ఉప్పు సహాయపడుతుంది:

రేజర్ బర్న్స్ మరియు గాయాలను మాన్పడంలో ఉప్పు సహాయపడుతుంది . అందుకు మీరు చేయాల్సిందల్లా సాల్ట్ వాటర్ ను గాయాలైన వెంటనే గాయం మీద పోయాలి. కొద్దిగా మంటగా అనిపిస్తుంది, కానీ సాప్ట్ స్కిన్ ను త్వరగా నయం చేస్తుంది.

బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది:

బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది:

బ్లాక్ హెడ్స్ చర్మం మీద చాలా మొండిగా ఉంటాయి. వీటిని తొలగించడానికి సాల్ట్ థెరఫీ గ్రేట్ గా సహాయపడుతుంది . ఒక బౌల్లో ఉప్పు మరియు కొద్దిగా వార్మ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లైచేసి డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

7 Reasons To Use Salt For Your Skin This Summer

Salt is inexpensive and very effective. Salt is used as a taste enhancer in food as well. Adding salt to your bathing water will help you benefit a lot from the skin issues and, at the same time, this powerful grain can get rid of acne, dead skin and improve your skin's complexion.
Story first published: Monday, April 11, 2016, 17:35 [IST]
Desktop Bottom Promotion