For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్లకింద నల్లటి వలయాలు తొలగించే సింపుల్ టిప్స్

By Swathi
|

కళ్లకింద నల్లటి వలయాలు మీ అందాన్ని పోగొడుతున్నాయా ? 90 శాతం కంటే ఎక్కువమంది డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారని.. బ్యూటీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. నిద్ర సరిగాలేకపోవడం, కాస్మొటిక్స్ ఉపయోగించడం, ఒత్తిడి, డీహైడ్రేషన్ వల్ల ఈ సమస్య ఎదురవుతుందని చెబుతున్నారు.

శరీరంలో నీళ్లు తగ్గినప్పుడు చర్మం నిర్జీవంగా మారుతుంది. మొదటి లక్షణం ముఖంపై, తర్వాత కళ్లకింద కనిపిస్తుంది. డార్క్ సర్కిల్స్ ను కొన్ని రకాల పండ్లు, కూరగాయలతో నివారించవచ్చు. కళ్లకింద డార్క్ సర్కిల్స్ నివారించడానికి సహాయపడే కొన్ని.. సింపుల్ హోం రెమిడీస్ మీ కోసం.

దోసకాయ ముక్కలు

దోసకాయ ముక్కలు

సమ్మర్ లో శరీరాన్ని కూల్ గా ఉంచడానికి దోసకాయ సహాయపడుతుంది. దీన్ని ఆహారంగా తీసుకున్నా, చర్మానికి అప్లై చేసినా.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ముందుగా దోసకాయను ముక్కలుగా కట్ చేసి.. 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. తర్వాత ఈ ముక్కలను కళ్లపై 10 నిమిషాలు పెట్టుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.

బంగాళదుంప ముక్కలు

బంగాళదుంప ముక్కలు

బంగాళదుంపలు కూడా డార్క్ సర్కిల్స్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పలుచగా బంగాళదుంపను కట్ చేసి.. కళ్లపై పెట్టుకోవాలి. ఇందులో ఉండే జ్యూస్ చర్మానికి బ్లీచ్ లా పనిచేసి.. తెల్లగా మారుస్తుంది.

గులాబీ రేకులు

గులాబీ రేకులు

సమ్మర్ లో చర్మ సమస్యలు నివారించడానికి గులాబీ రేకులు వండర్ చేస్తాయి. గులాబీ రేకుల రసాన్ని కళ్లకింద చర్మంపై మసాజ్ చేయాలి. 10 నిమిషాలు ఆరిన తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా మీ చర్మాన్ని కూడా మెరిపిస్తుంది.

స్ట్రాబెర్రీ ముక్కలు

స్ట్రాబెర్రీ ముక్కలు

విటమిన్ సి ఎక్కువగా ఉండే స్ట్రాబెర్రీలను చర్మానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డార్క్ సర్కిల్స్ తొలగించడంతో పాటు, కాంప్లెక్షన్ ని పెంచుతుంది.

అవకాడో

అవకాడో

అవకాడో గుజ్జు చర్మాన్ని గ్లోయింగ్ గా మారుస్తుంది. కళ్లకింద ఈ పేస్ట్ ని అప్లై చేయాలి. ఆరిన తర్వాత కోల్డ్ మిల్క్ లో అద్దిన దూదితో శుభ్రం చేయాలి. ఇది మెరుగైన ఫలితాలు ఇస్తుంది.

వాటర్ మిలాన్

వాటర్ మిలాన్

వాటర్ మిలాన్ జ్యూస్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. లేదా కళ్లకింద పేస్ట్ అప్లై చేసినా.. మంచి ఫలితం ఉంటుంది. డార్క్ సర్కిల్స్ నివారించడానికి ఇది పర్ఫెక్ట్ రెమిడీ అని చెప్పవచ్చు.

పైనాపిల్ ముక్కలు

పైనాపిల్ ముక్కలు

పైనాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ పండు రసం చర్మానికి అప్లై చేయడం వల్ల.. చర్మం నిగారిస్తుంది. రోజుకి రెండుసార్లు ఇది అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి.

English summary

7 Ways To Treat Dark Circles In Summer

7 Ways To Treat Dark Circles In Summer. Today, Boldsky suggests you add these simple treats to your beauty regime. By applying the juice of these foods on your eyes, it will gradually and positively lighten the dark circles.
Story first published: Saturday, April 23, 2016, 12:09 [IST]
Desktop Bottom Promotion