For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంలో ముడుతలను నివారించే 8 బెస్ట్ నేచురల్ రెమెడీస్..!

|

బాడీ స్కిన్ చాలా త్వరగా డ్రైగా మారుతుంటుంది. ముఖ చర్మం కంటే శరీరం మీద ఉన్న చర్మం త్వరగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. దాంతో ఆగక , డ్రై స్కిన్ , ఫ్యాకీ స్కిన్, ముడతలకు కారణమవుతుంది. ముడుతలు ముఖంలోనే ఇబ్బంది పెడుతాయనుకుంటే, శరీరం మీద కూడా అస్యంగా కనబడుతాయి. ఇలా ముఖంతో పాటు, బాడీ స్కిన్ మీద ముడుతలు ఏర్పడటం వల్ల చిన్న వయస్సులోనే వయస్సైన వారిలా, ముసలి వారిగా కనబడుతారు. లక్కీగా ఇటువంటి స్కిన్ వ్రింకిల్స్ నివారించుకోవడానికి కొన్ని నేచురల్ పదార్థాలున్నాయి.

ఎప్పుడైతే శరీరానికి ఇంటర్నల్ గా మరియు ఎక్సటర్నల్ గా తగిన హైడ్రేషన్ (నీరు, తేమ) అందదో అప్పుడు, చర్మం డ్రైగా మరియు ఫ్లాకీగా మారుతుంది. అంతే కాదు, ముడుతలకు దారితీస్తుంది. చర్మం మీద ముడుతలు కనబడేలా చేస్తుంది. వయస్సైన వారిలా కనబడుతూ ఆందోళనకు గురిచేస్తుంది.

ముడుతలకు ఆందోళన చెందకుండా కొంత ఓపికతో , తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముడుతలను నివారించుకోవచ్చు. ఈ క్రింది సూచించన నేచురల్ పదార్థాలు చర్మం మీద ఏర్పడిన ముడుతలను నివారించడంతో పాటు, తరచూ ఆ సమస్యకు గురికాకుండా చర్మానికి రక్షణ కల్పిస్తాయి.

ఈ నేచురల్ పదార్థాలను ఉపయోగించడం చర్మానికి సురక్షితమైనవి. వీటి వల్ల స్కిన్ కు ఎలాంటి హాని జరగదు. ఇవి చౌకైనవి . చాలా వరకూ ఇవి మన వంట గదిలోనే అందుబాటులో ఉంటాయి. మరికెందుకు ఆలస్యం, ముడుతలను తగ్గించుకోవడానికి కిచెన్ కాబినేట్ లోకి ఎంటరై వెంటనే హోం రెమెడీస్ ను ఫాలో అవ్వండి...!

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె :

నేచురల్ ఆయిల్స్ లో ది బెస్ట్ ఆయిల్ కొబ్బరి నూనె. దీన్ని స్కిన్ కు అప్లై చేయడం వల్ల బెటర్ రిజల్ట్ ను అందిస్తుంది. ఇది చర్మంలోకి చొచ్చుకునిపోయి, చార్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. స్కిన్ వ్రింకిల్స్ నివారించుకోవడానికి బెస్ట్ నేచురల్ రెమెడీ.

 ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ముడతలను నివారించడంలో మరో బెస్ట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్, ఇందులో విటమిన్స్, మినిరల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది స్కిన్ కు మాయిశ్చరైజర్ ను అందివ్వడంతోపాటు, స్కిన్ ఆరోగ్యంగా ఉండేట్లు సహాయపడుతుంది.

విటమిన్ ఇ ఆయిల్ :

విటమిన్ ఇ ఆయిల్ :

మెడిసినల్ వాల్యూస్ అధికంగా ఉండే ఆయిల్ విటమిన్ ఇ ఆయిల్. ఈ పిల్స్ మెడికల్ షాప్స్ లో అందుబాటులో ఉన్నాయి. క్యాప్స్యూల్స్ లోపల ఆయిల్ తో మనకు ట్రాన్సపరెంట్ గా కనబడుతాయి. లోపల ఆయిల్ ఉంటుంది. పిల్ రెండ్ గా బ్రేక్ చేసి, లోపలున్న ఆయిల్ ను స్కిన్ కు అప్లై చేయడం వల్ల చర్మంలో ముడుతలు మాయమవుతాయి.

లోవెర జెల్:

లోవెర జెల్:

కలబంద ఆకుల నుండి జెల్ ను వేరుగా తీసి, చర్మానికి అప్లై చేయాలి. ఇది ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అలోవెర జెల్ చర్మంలోనికి చొచ్చుకుని పోయి, చర్మం డ్రై నెస్ ను తగ్గిస్తుంది. చర్మాన్ని కూల్ గా చేసే గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

బాదం ఆయిల్ :

బాదం ఆయిల్ :

బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది, ఇది చర్మ సంరక్షణకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది డ్రై స్కిన్ ను నివారిస్తుంది. ముడుతలను మాయం చేస్తుంది.

ఆముదం:

ఆముదం:

ఆముదం నూనెలో మినిరల్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉన్నాయి. స్కిన్ కేర్ కు ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఆముదం నూనెను చర్మానికి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ముడుతలను మాయం చేయడానికి ఇది ఒక ఎఫెక్టివ్ మార్గం.

మిల్క్ క్రీమ్ :

మిల్క్ క్రీమ్ :

మిల్క్ క్రీమ్ ను బాడీ మొత్తం అప్లై చేయాలి. మిల్క్ క్రీమ్ లోని మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. ముడుతలను కనబడనివ్వకుండా చేస్తుంది. తేమగా, మెరిసేట్లు చేస్తుంది.

తేనె:

తేనె:

తేనె నేచురల్ పదార్థం. దీన్ని చర్మానికి అప్లై చేసినప్పుడు చార్మానికి మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మం సాప్ట్ గా మరియు గ్లోయింగ్ తో కనబడుతుంది. స్నానం చేస్తే తేనె మాయమవుతుంది. ముడుతలను నివారించుకోవడం కోసం ఈ ఫర్ఫెక్ట్ హోం రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగించండి.

English summary

8 Best Natural Ingredients To Get Rid Of Wrinkles On Body

The skin on your body can get dry quite easily, even more than the skin on your face. This often leads the skin into looking really wrinkly. Thankfully, there are natural ingredients to get rid of the wrinkles on skin. When the body is not getting enough hydration, both internally and externally, it can get really dry and flaky. This gives it a wrinkly appearance.
Story first published: Friday, September 16, 2016, 18:12 [IST]
Desktop Bottom Promotion