For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోకాళ్ల నలుపుదనాన్ని వందశాతం పోగొట్టే అలోవెరా మాస్క్..!!

నల్లగా మారిన మోకాళ్లను తెల్లగా మార్చడానికి అలోవెరా అద్భుతంగా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ లేయర్ ని తొలగిస్తుంది, మాయిశ్చరైజర్ కోల్పోకుండా కాపాడుతుంది. న్యాచురల్ బ్లీచ్ లా పనిచేస్తుంది.

By Swathi
|

నల్లగా, అసహ్యంగా కనిపించే.. మోచేతులు, మోకాళ్లు.. చాలా ఇబ్బంది పెడతాయి. కొన్ని డ్రస్సుల్లో అవి చాలా ఎక్కువ ఎక్స్ పోజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు అవి శరీరం రంగు కంటే.. నల్లగా కనిపిస్తే.. మీ అందానికే మచ్చ వచ్చేస్తుంది. మీరు సరిగా శ్రద్ధ తీసుకోవడం లేదని సూచిస్తాయి. కాబట్టి నల్లగా మారిన మోకాళ్లు, మోచేతులపై శ్రద్ద తీసుకోవాలి.

Dark Skin On Knees

మీరు కూడా నల్లటి మోకాళ్లు కలిగి ఉంటే సింపుల్ గా ఒకే ఒక ప్యాక్ దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్. ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా వాడితే మోకాళ్ల నలుపు తగ్గి.. స్మూత్ గా మారుతాయి. అయితే మోకాళ్లకు ఆయిల్ గ్లాండ్స్ తక్కువగా ఉండటం వల్ల.. ఈభాగాలు త్వరగా నల్లగా, హార్డ్ గా మారుతాయి. డెడ్ స్కిన్ సెల్స్ వల్ల కూడా.. మోకాళ్లు నల్లగా మారుతాయి.

ఇలా నల్లగా మారిన మోకాళ్లను తెల్లగా మార్చడానికి అలోవెరా అద్భుతంగా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ లేయర్ ని తొలగిస్తుంది, మాయిశ్చరైజర్ కోల్పోకుండా కాపాడుతుంది. న్యాచురల్ బ్లీచ్ లా పనిచేస్తుంది. అలాగే పిగ్మెంటేషన్ ని నివారిస్తుంది. అలోవెరాతో పాటు బేకింగ్ సోడా, నిమ్మ, ఆలివ్ ఆయిల్, తేనె కలిపి అప్లై చేస్తే మరింత ఎఫెక్టివ్ గా ఫలితాలు పొందవచ్చు.

తేనె చర్మానికి మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. బేకింగ్ సోడా డెడ్ స్కిన్ ని తొలగిస్తుంది. నిమ్మ బ్లీచింగ్ ని, ఆలివ్ ఆయిల్ డ్యామేజ్ అయిన స్కిన్ టిష్యూలను రిపేర్ చేస్తుంది. అలోవెరాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డ్యామేజ్ అయిన చర్మ కణాలను రిజెనరేట్ చేస్తుంది. మరి మోకాళ్లను తెల్లగా మార్చే ఈ ప్యాక్ ఎలా అప్లై చేయాలో చూద్దామా..

స్టెప్ 1

స్టెప్ 1

ఒక టీస్పూన్ బేకింగ్ సోడాని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల చర్మంలో ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాని తొలగిస్తుంది.

స్టెప్ 2

స్టెప్ 2

1 టీస్పూన్ తేనెను బేకింగ్ సోడాలో కలపాలి. ఫోర్క్ ఉపయోగించి బాగా కలపాలి. తేనెలో ఎమినో యాసిడ్ ఉండటం వల్ల అది.. చర్మానికి కావాల్సిన మాయిశ్చరైజర్ ని అందించి, డ్రైనెస్ ని తొలగిస్తుంది.

స్టెప్ 3

స్టెప్ 3

5 నుంచి 10 చుక్కల ఆలివ్ ఆయిల్ ని ఈ మిశ్రమంలోకి కలపాలి. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి చర్మం లోపలి లేయర్స్ లోకి వెళ్లి.. పిగ్మెంటేషన్ ని తొలగిస్తాయి. చర్మాన్ని తెల్లగా మారుస్తాయి.

స్టెప్ 4

స్టెప్ 4

5 చుక్కల నిమ్మరసంను ఈ హెర్బల్ మాస్క్ లో కలపాలి. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ న్యాచురల్ బ్లీచ్ లా పనిచేసి.. చర్మంలో దుమ్ముని తొలగిస్తాయి. అన్నీ బాగా మెత్తటి పేస్ట్ అయ్యేంతవరకు కలపాలి.

స్టెప్ 5

స్టెప్ 5

ముందుగా సోప్, నీళ్లు ఉపయోగించి.. మోకాళ్లను శుభ్రం చేసుకోవాలి. టవల్ తో తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ మాస్క్ ని అప్లై చేయాలి. 30 నిమిషాలు ఆరనివ్వాలి.

స్టెప్ 6

స్టెప్ 6

తర్వాత కొన్ని నీటిని ఆ ప్యాక్ పై చిలకరించాలి. ఇప్పుడు చేతివేళ్లతో స్క్రబ్ చేసుకోవాలి. ఇలా రెండు నిమిషాల పాటు చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్టెప్ 7

స్టెప్ 7

అలోవెరా ఆకును రెండుగా కట్ చేయాలి. ఫోర్క్ ఉపయోగించి జెల్ బయటకు తీయాలి. 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి.

స్టెప్ 8

స్టెప్ 8

ఇప్పుడు అలోవెరా జెల్ ని అరచేతిలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్లపై బాగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి.

కంక్లూజన్

కంక్లూజన్

ఈ న్యాచురల్ ఇంగ్రిడియంట్స్ ని ఉపయోగించి మోకాళ్లపై నలుపుదనం పోగొట్టుకోవడానికి కనీసం వారానికి రెండుసార్లు అప్లై చేయాలి. అప్పుడే.. త్వరగా ఫలితాలు పొందవచ్చు.

English summary

Get Rid Of Dark Skin On Knees With This 100% Natural Aloe Vera Mask!

Get Rid Of Dark Skin On Knees With This 100% Natural Aloe Vera Mask. Try this herbal mask to get rid of the dark knees fast!
Story first published: Wednesday, December 14, 2016, 15:12 [IST]
Desktop Bottom Promotion