For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పగిలిన పెదాలను స్మూత్ అండ్ సాఫ్ట్ గా మార్చే రెమెడీస్..!

చలికాలంలో పెదాలు ఎక్కువగా డ్రైగా మారి, పగులుతూ ఉంటాయి. కొంతమందికి పగిలిన పెదాల నుంచి రక్తం కూడా కారుతుంది. కాబట్టి ఇంట్లోనే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. పగిలిన పెదాలను సుతిమెత్తగా మార్చుకోవచ్చు.

By Swathi
|

వాడిపోయిన గులాబీ రెక్క‌ల్లా, నొప్పిగా ఉండే ప‌గిలిన పెదాలు, పొడిబారిన పెదాలు, డార్క్ ప్యాచెస్ కలిగిన పెదాలు ప్రతి ఒక్కరినీ ఇబ్బందిపెడతాయి. ముఖ్యంగా చలికాలంలో పెదాలు ఎక్కువగా డ్రైగా మారి, పగులుతూ ఉంటాయి. కొంతమందికి పగిలిన పెదాల నుంచి రక్తం కూడా కారుతుంది.

డ్రై, చాప్డ్ లిప్స్ స్మొకింగ్, ఎండ‌, డీహైడ్రేష‌న్ వ‌ల్ల పెదాలు ఇలా త‌యార‌వుతాయి. వీటిని పోగొట్టుకోవ‌డానికి చాలా మంది లిప్ కేర్, లిప్ బామ్ వంటివి ఉపయోగిస్తూ ఉంటాయి. ఇవి తాత్కాలిక ఉపశమనం కలిగించినా.. తర్వాత పరిస్థితి మామూలుగానే తయారవుతుంది. కాబట్టి ఇంట్లోనే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. పగిలిన పెదాలను సుతిమెత్తగా మార్చుకోవచ్చు.

coconut oil

కొబ్బరినూనె
ఒక గిన్నెలో తేనె, కొబ్బరినూనె వేసి.. బాగా కలపాలి. ఈ మిశ్రమంతో.. పెదాలను సున్నితంగా స్ర్కబ్ చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి, పెదాలకు కావాల్సిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది.

బ్రౌన్ షుగర్
అర టీస్పూన్ బ్రౌన్ షుగర్ ను పెదవులపై రాసి.. నెమ్మదిగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి స్మూత్ గా తయారవుతాయి.

sugar for dry lips

పంచదార
డెడ్ స్కిన్ సెల్స్, మురికి మీ పెదాలను పొడిగా, డార్క్ గా మారుస్తాయి. లిప్స్ ను క్లీన్ చేసి, వాటిని స్మూత్ గా, పింక్ కలర్ లోకి మార్చుకోవడానిని ఈ సింపుల్ టిప్ ఫాలో అవవచ్చు. నీటిలో కొద్దిగా పంచదార వేసి పెదాలపై స్ర్కబ్ చేసుకోవాలి. ఇది పెదాల రంగును మార్చడమే కాకుండా.. స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుస్తాయి.

English summary

Home Remedies for Chapped lips

Home Remedies for Chapped lips. Chapped or dry lips are a common problem that can be painful and unattractive.
Story first published: Monday, December 26, 2016, 17:43 [IST]
Desktop Bottom Promotion