For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్లగా, అసహ్యంగా మారిన మోచేతులను స్మూత్ గా మార్చే టెక్నిక్స్

By Swathi
|

మీ ముఖం తెల్లగా, స్మూత్ గా ఉంటుంది. చేతులు, కాళ్లు కూడా.. బాగానే కనిపిస్తాయి. కానీ.. మోచేతులు, మోకాళ్ల విషయానికి వచ్చేసరిగా.. నల్లగా, అసహ్యంగా, గరుకుగా మారి ఇబ్బంది పెడుతుంటాయి. శరీరంలోని అన్ని భాగాల్లో ఈ రెండు భాగాలు చాలా అసహ్యంగా మారి ఉంటాయి.

ఈ సమస్య ఎక్కువగా అమ్మాయిల్లో కనిపిస్తుంది. అందుకే ఈ సమస్య కారణంగా కొంతమంది.. ఈ రెండు భాగాలు కనిపించకుండా.. దుస్తులు ధరించి జాగ్రత్త తీసుకుంటారు. స్మాల్ స్లీవ్స్, పొట్టి స్కర్ట్స్ వేసుకోవాలని ఉన్నా.. ఈ సమస్య కారణంగా వేసుకోలేకపోతారు.

మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారా ? అయితే కొన్ని సింపుల్ సొల్యూషన్స్ మీ మోచేతులు, మోకాళ్ల నలుపు తగ్గించి.. స్మూత్ గా మార్చేస్తాయి. అవి ఎక్కడో లేవు. మీ వంటిట్లోనే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మోచేతులు, మోకాళ్లు నల్లగా, హార్డ్ గా మారడానికి కారణాలు, వాటిని నివారించే హోం రెమిడీస్ తెలుసుకుందాం..

ఆయిల్

ఆయిల్

మోచేతులు, మోకాళ్లకు ఆయిల్ గ్లాండ్స్ తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఈ ప్రాంతాల్లో త్వరగా డార్క్ గా మారుతుంది.

కేర్

కేర్

ముఖం, మిగిలిన భాగాల్లో తీసుకునేంత శ్రద్ధ మోచేతులు, మోకాళ్లపై తీసుకోరు. దీనివల్ల ఇవి నిర్జీవంగా మారి, రఫ్ గా, డ్రైగా మారతాయి.

డెడ్ స్కిన్ సెల్స్

డెడ్ స్కిన్ సెల్స్

ఈ ఏరియాల్లో డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. అవి చర్మాన్ని రఫ్ గా మారుస్తాయి. కాబట్టి ఈ డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ చేయడం వల్ల.. కొత్త స్కిన్ ఏర్పడి షైనింగ్ వస్తుంది.

షుగర్ స్క్రబ్

షుగర్ స్క్రబ్

ఈ స్క్రబ్ డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ చేసి.. కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. కాబట్టి ఒక స్పూన్ తేనె, పంచదార తీసుకుని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులు, మోకాళ్లపై సర్కులర్ మోషన్ లో స్క్రబ్ చేస్తే.. చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి.. స్మూత్ గా మారుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయాలి.

నిమ్మ

నిమ్మ

నిమ్మలో బ్లీచింగ్ గుణాలుంటాయి. నిమ్మకాయను సగానికి కట్ చేసి.. మోచేతులు, మోకాళ్లపై రుద్దాలి. అంతే.. ఆ ప్రాంతంలో చర్మం తెల్లగా మారుతుంది. ఒకవేళ అవసరమైతే కొంచెం తేనె కలిపితే.. మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

బంగాళా దుంప

బంగాళా దుంప

బంగాళా దుంపలో కూడా బ్లీచింగ్ గుణాలుంటాయి. కాబట్టి.. బంగాళదుంప ముక్క తీసుకుని తేనెలో అద్ది.. మోచేతులు, మోకాళ్లపై బాగా మసాజ్ చేయాలి. దీనివల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి.. చర్మం కొత్త నిగారింపు సొంతం చేసుకుంటుంది.

ఆయిల్ మసాజ్

ఆయిల్ మసాజ్

ఆయిల్ మసాజ్ వల్ల చర్మానికి కావాల్సినంత మాయిశ్చరైజర్ న్యాచురల్ గా అందుతుంది. ఈ ప్రాంతాల్లో ఆయిల్ గ్లాండ్స్ ఉండవు కాబట్టి.. మసాజ్ బాగా ఉపయోగపడుతుంది. ఆలివ్, ఆల్మండ్, కొబ్బరి నూనె ఏవైనా రెండు రకాల ఆయిల్స్ తీసుకుని మిక్స్ చేసి.. మోచేతులు, మోకాళ్లపై మర్దనా చేయాలి. మసాజ్ చేశాక కాసేపు అలానే ఉంచితే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ప్యూమిస్ స్టోన్

ప్యూమిస్ స్టోన్

స్నానం చేసేటప్పుడు మోచేతులు, మోకాళ్లపై ప్యూమిస్ స్టోన్ తో తప్పకుండా రుద్దుకోవాలి. స్మూత్ గా రోజూ రుద్దుకోవడం వల్ల.. చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి.. మెరుస్తుంది.

టమోటా

టమోటా

టొమాటో రసాన్ని తీసి తేనె లేదా కొబ్బరి నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి.. బాగా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాతో నలుపుదనం త్వరగా పోతుంది.

తేనె, చందనం

తేనె, చందనం

గంధం పొడి, తేనె మిశ్రమాన్ని కలిపి.. రెండు వారాలకు ఒకసారైనా మోచేతులకు అప్లై చేయండి. ఖచ్చితంగా ఈ ప్యాక్ మీ మోచేతులపై డెడ్ సెల్స్ తొలగించి.. హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.

పెరుగు, శనగపిండి

పెరుగు, శనగపిండి

శనగపిండి, పెరుగు కలిపి.. మోచేతులకు రాసుకుని అరగంటపాటు ఆరనివ్వాలి. కొన్ని రోజుల్లోనే తేడా మీకు కనిపిస్తుంది. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం హెల్తీగా, మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది.

దోసకాయ, పపాయ

దోసకాయ, పపాయ

ఈ ప్యాక్ చాలా వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ రెండింటిని సమానంగా తీసుకుని పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని వారానికి ఒకసారి వీలైతే.. రెండుసార్లు అప్లై చేయాలి. త్వరలోనే మీ మోచేతులు తెల్లగా మిళమిళా మెరిసిపోతాయి.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

కొబ్బరినూనె చర్మం మృదువుగా మారడానికి సహాయపడుతుంది. కాబట్టి టీ స్పూన్ కొబ్బరి నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై మర్ధనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మోచేతులు శరీర ఛాయలోకి మారిపోతాయి.

బాదం

బాదం

రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి మోచేతులపై మసాజ్ చేయాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పాల మీగడ

పాల మీగడ

పాల మీగడ సహజ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం స్మూత్ గా మారుతుంది. కాబట్టి పాల మీగడలో చిటికెడు పసుపు కలిపి నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి శుభ్రం చేసుకోవాలి. కొద్దిరోజుల్లో తేడా కనిపిస్తుంది.

కలబంద

కలబంద

స్పూన్ కలబంద గుజ్జు, స్పూన్ పెసర పిండి, చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం, కొంచెం రోజ్ వాటర్ తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ పేస్ట్ ని నల్లగా ఉన్న మోచేతులకు అప్లై చేయాలి. నలభై రోజులు క్రమం తప్పకుండా చేస్తే నల్లబడిన చర్మం మామూలు రంగులోకి వస్తుంది.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మోచేతులు, మోకాళ్లకు అప్లై చేయాలి. దీనివల్ల స్మూత్ గా మారుతుంది. పైన చెప్పిన హోం రెమిడీస్ ట్రై చేసిన తర్వాత కూడా తప్పకుండా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

English summary

Home remedies to soften rough elbows and knees

Home remedies to soften rough elbows and knees. Have rough elbows and knees? Look in your kitchen for a solution for these.
Desktop Bottom Promotion