For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారం రోజుల్లో పాదాల పగుళ్లు మాయం చేసే అమేజింగ్ సొల్యూషన్ !

By Swathi
|

పాదాలు చీలిపోయి చిరాకు కలిగిస్తున్నాయి. నలుగురిలో హైహీల్స్ లేదా షూ వేసుకుని వెళ్లాలంటే.. ఇబ్బందిపడుతున్నారా ? నిజమే పాదాలు పగుళ్లు ఏర్పడితే చూడటానికి చాలా అసహ్యంగా, ఎలాంటి స్టైలిష్ షూ ధరించినా అందవిహీనంగా కనిపిస్తాయి. పాదాలు పగిలినప్పుడు ఎంత దాచిపెట్టుకోవాలని చూసినా.. ఏదో ఒక రకంగా బయటపడక తప్పదు..

పాదాలు పగుళ్లు కేవలం అందవిహీనంగా మాత్రమే కాదు.. అనారోగ్యానికి కూడా సంకేతం. మనం హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం లేదని పాదాల పగుళ్లు చెబుతారు. అలాగే పాదాల సంరక్షణ కోసం సరిపడా సమయం కేటాయించడం లేదని సూచిస్తాయి. పాదాల పగుళ్లకు ఇవి మాత్రమే కాదు.. మరికొన్ని కారణాలున్నాయి.

cracks

డ్రై స్కిన్, ఎక్కువగా నడవడం, చెప్పులు లేకుండా నడవడం, పరుగెట్టడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఒబేసిటీ, పరిశుభ్రత పాటించకపోవడం వంటివి కూడా పాదాల పగుళ్లకు కారణమవుతాయి. అయితే ఈ పగిలిన పాదాలను ఎక్కువకాలం పట్టించుకోకపోతే, త్వరగా నయం చేసుకోకపోతే.. సోరియాసిస్ వంటి ఇతర సమస్యలకు కారణమవుతాయి.

పగిలిన పాదాలను స్మూత్ గా, ఎట్రాక్టివ్ గా మార్చుకోవడానికి న్యాచురల్ రెమిడీ కోసం చూస్తుంటే.. చాలా సింపుల్ గా, ఇంట్లోనే తయారు చేసుకునే స్క్రబ్ మీకు అందుబాటులో ఉంది.

salt

కావాల్సిన పదార్థాలు
ఓట్ మీల్ 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం 1 టేబుల్ స్పూన్
ఉప్పు 2 టేబుల్ స్పూన్లు

ఓట్ మీల్, నిమ్మరసం, ఉప్పు కలిపిన మిశ్రమం న్యాచురల్ స్క్రబ్ లా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ తొలగించడానికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో డెడ్ స్కిన్ వల్ల పగుళ్లు ఏర్పడతాయి. ఈ మిశ్రమంతో పాదాలను స్క్రబ్ చేయడం వల్ల పగుళ్లు నివారించవచ్చు. నిమ్మరసం న్యాచురల్ క్లెన్సర్ లా పనిచేసి.. పగుళ్ల మధ్య చేరిన దుమ్ము, ధూళిని తొలగిస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ నివారించవచ్చు. అలాగే నిమ్మరసంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల త్వరగా, తేలికగా పాదాల పగుళ్లను నివారిస్తుంది.

oats for cracks

ఉపయోగించే విధానం
పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక గిన్నెలో కలుపుకోవాలి. స్పూన్ తీసుకుని అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో పాదాలను తడుపుకుని.. ఈ మిశ్రమాన్ని పగుళ్లపై అప్లై చేయాలి. కొన్ని నిమిషాల పాటు బాగా మసాజ్ చేసి, 15 నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు పాదాలు పెట్టాలి. అంతే ఇలా వారంపాటు చేస్తే.. పాదాల పగుళ్లు మాయం చేయవచ్చు.

English summary

Homemade Remedy To Reduce Feet Cracks In A Week!

Powerful Homemade Remedy To Reduce Feet Cracks In A Week! If you are looking for a natural remedy to heal cracked feet, then you can try this homemade oatmeal and lemon scrub.
Story first published: Tuesday, June 7, 2016, 16:21 [IST]
Desktop Bottom Promotion