For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మరసంలో దాగున్న ఎఫెక్టివ్ బ్యూటి సీక్రెట్స్..!

నిమ్మకాయలో 6శాతం సిట్రిక్ యాసిడ్, ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి చర్మాన్ని క్లియర్ గా మారుస్తుంది.

By Swathi
|

మీకు తెలుసా.. పుల్ల పుల్లగా, కాస్త తియ్యగా ఉండే.. నిమ్మకాయ మీ స్కిన్ పై మ్యాజిక్ చేస్తుంది ? ఒకవేళ మీరు నిమ్మరసంను చర్మానికి ఉపయోగిస్తుంటే.. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది.. కానీ.. మీరు ఉపయోగించట్లేదు అంటే మాత్రం మిస్ అవుతున్నట్టే.

lemon juice

నిమ్మకాయలో 6శాతం సిట్రిక్ యాసిడ్, ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి.. చర్మాన్ని చాలా క్లియర్ గా మారుస్తుంది. అలాగే నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు ఉండటం వల్ల.. చర్మాన్ని తెల్లగా మారుస్తుంది.

నిమ్మలో విటమిన్ బి1, బి2, బి5 ఉంటాయి. ఇవి ఏజింగ్ ప్రాసెస్ ని నెమ్మదిగా చేస్తాయి. కొల్లాజెన్ లెవెల్స్ ని పెంచుతాయి. దీనివల్ల.. చర్మంలో ఎలాస్టిసిటీ పెరుగుతుంది. అలాగే నిమ్మలో జింక్, పొటాషియం, ప్రొటీన్స్ ఉండటం వల్ల చర్మం సాఫ్ట్ గా, స్మూత్ గా మారుతుంది.

బ్లాక్ హెడ్స్ తొలగించడానికి

బ్లాక్ హెడ్స్ తొలగించడానికి

నిమ్మలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించి.. బ్లాక్ హెడ్స్ ని నివారిస్తుంది.

ఎలా వాడాలి

ఎలా వాడాలి

ముందుగా నిమ్మకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి.. తేనె రాసుకుని.. ముఖంపై డైరెక్ట్ గా అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పళ్లు తెల్లగా మారడానికి

పళ్లు తెల్లగా మారడానికి

పసుపు పచ్చగా, అసహ్యంగా మారిన పళ్లను తెల్లగా మార్చడంలో.. నిమ్మ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

వాడేవిధానం

వాడేవిధానం

ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. పేస్ట్ అయిన తర్వాత పళ్లపై రుద్దుకోవాలి. ఒక నిమిషం తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాదాలకు స్క్రబ్

పాదాలకు స్క్రబ్

పాదాలపై పేరుకున్న డెడ్ స్కిన్ తొలగించడానికి నిమ్మకాయ స్క్రబ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

తయారుచేసేవిధానం

తయారుచేసేవిధానం

రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ తీసుకుని, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పాదాలపై స్క్రబ్ చేసి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

చుండ్రు నివారించడానికి

చుండ్రు నివారించడానికి

చుండ్రుని శాశ్వతంగా నివారించుకోవాలి అంటే.. సింపుల్ ట్రిక్ ఉంది. నిమ్మరసంను డైరెక్ట్ గా తలకు పట్టించాలి. గంట తర్వాత.. మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. అంతే.

English summary

Incredible Beauty Uses Of Lemon Juice That You Did Not Know!

Incredible Beauty Uses Of Lemon Juice That You Did Not Know! From removing flaky dandruff, whitening teeth to removing nasty blackheads, here are some of the incredible beauty uses of lemon juice.
Story first published: Saturday, October 22, 2016, 11:38 [IST]
Desktop Bottom Promotion