For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాప్ట్ అండ్ స్మూత్ హ్యాండ్స్ కోసం సింపుల్ టిప్స్ ...

By Super
|

మీ అరచేతులు మృదువుగా మారటానికి చిట్కాలు తెలుసుకొనే ముందు అసలు మీ అరచేతులు కఠినంగా ఎందుకు మారుతాయో తెలుసుకోవాలి.

మీరు ఎక్కువ సమయం కూరగాయలను కట్ చేయడం , బట్టలు ఉతకడం వంటి ఇంటి పనులను చేయడం వలన మీ అరచేతులు కఠినంగా మారతాయి.

డిటర్జెంట్ లలో ఉండే కఠినమైన రసాయనాలు మీ అరచేతులను పొడిగా మార్చవచ్చు .అనేక సబ్బులు మరియు డిటర్జెంట్లు మీ అరచేతులకు ఎటువంటి హాని కలగదని హామీలు ఇస్తారు. కానీ ఆ హామీలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతాయి.

మీ అరచేతులు కఠినంగా ఉండటానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి.ఎండలో ఎక్కువసేపు ఉండడం , కఠినమైన గాలి తగలడం, క్రిమ్లలో ఉన్న రసాయనాలు,సరైన ఆహరం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల మీ అరచేతులు పొడిగా మరియు ముడతలుగా మారతాయి.

మీరు మీ శరీరానికి జాగ్రత్తలను ఎలా తీసుకుంటారో, అదే విధంగా మీ అరచేతులను మరియు పాదాలకు కూడా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.

అరచేతులను మృదువుగా మార్చటానికి మార్కెట్ లో దొరికే క్రీం లను ఉపయోగించకుండా సహజమైన చిట్కాలను ఉపయోగించవచ్చు.

మీరు పెడిక్యుర్,మానిక్యుర్ రెగ్యులర్ గా చేసుకోవటం కుదరక బ్యుటి పార్లర్ వెళ్ళుతూ ఉంటారు. అక్కడ భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పుతున్న చిట్కాలతో ఎటువంటి ఖర్చు కాదు.

ఇక్కడ మృదువైన మరియు నునుపైన అరచేతులను సొంతం చేసుకోవటానికి కొన్ని ప్రభావంతమైన చిట్కాలు ఉన్నాయి.

1. పంచదార మరియు ఆముదం

1. పంచదార మరియు ఆముదం

ఇది మృదువైన మరియు నునుపైన అరచేతుల కొరకు చాల సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో పంచదార,ఆముదం వేసి బాగా కలిపి, దానిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో అరచేతులను రుద్దుకోవాలి. ఈ విధంగా చేయటం వలన మృత కణాలు తొలగిపోయి మృదువుగా మారతాయి.

2. ఆలివ్ ఆయిల్ మరియు పంచదార

2. ఆలివ్ ఆయిల్ మరియు పంచదార

అరచేతిలో పంచదార,ఆలివ్ నూనె తీసుకోని బాగా రుద్దాలి. ఆలివ్ ఆయిల్ లో తేమ గుణాలు,పంచదార స్క్రబ్ గా పనిచేస్తుంది. ఈ విధంగా చేయటం వలన అరచేతులు మృదువుగా మారతాయి.

3. షియా వెన్న

3. షియా వెన్న

అరచేతిలో కొంచెం షియా వెన్నను వేసి రుద్దుకోవాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే అరచేతులు మృదువుగా మారతాయి. అంతేకాక షియా వెన్న వాడటం వలన చర్మం యవ్వనంగా ఉంటుంది.

4. గ్లిజరిన్ మరియు పాలు

4. గ్లిజరిన్ మరియు పాలు

వేడి చేసిన పాలు మరియు గ్లిజరిన్ కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి అరచేతులకు రాసి అరగంట సేపు మసాజ్ చేయాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తే మంచి పలితం కనపడుతుంది.

5. గుడ్డు, బాదం పౌడర్ మరియు తేనే

5. గుడ్డు, బాదం పౌడర్ మరియు తేనే

ఒక బౌల్ లో గుడ్డు, బాదం పౌడర్ మరియు తేనే వేసి బాగా కలిపి అరచేతులకు రాసుకొని 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

6. మొక్కజొన్న గంజి మరియు నీరు

6. మొక్కజొన్న గంజి మరియు నీరు

ఒక బౌల్ లో మొక్కజొన్న గంజి మరియు నీరు తీసుకోని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని నీటిలో కలిపి ఆ నీటిలో అరచేతులను కొంచెం సేపు ఉంచాలి. ఈ విధానం తక్షణ పలితం కోసం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

7. టమోటో జ్యూస్

7. టమోటో జ్యూస్

మృదువైన మరియు నునుపైన అరచేతులను పొందటానికి ఇది ఒక సులభమైన మార్గం. టమోటా ముక్కలతో అరచేతులను రుద్డవచ్చు. లేదా టమోటా రసం,నిమ్మరసం,గ్లిజరిన్ కలిపి అరచేతులకు రాసుకొని మసాజ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం నల్లని మచ్చలను తొలగించటానికి కూడా సహాయపడుతుంది.

8. నీరు త్రాగటం

8. నీరు త్రాగటం

అరచేతులను మృదువుగా ఉంచటానికి సాదారణ చిట్కాలను చూసాం. ఇప్పుడు నీరు ఎక్కువగా త్రాగటం వలన చర్మానికి తగినంత తేమ అంది పొడిగా లేకుండా ఉంటాయి. ప్రతి రోజు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీటిని త్రాగాలి. అలాగే ఆహారంలో పండ్లు,కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.

English summary

simple tips to get smooth and soft palms

Before discussing about the simple tips to get smooth and soft palms, you should know why your palms get rough. If you've been doing a lot of household chores lately like cutting veggies, washing clothes and dishes, etc, it is quite obvious that you'll have rough palms.
Desktop Bottom Promotion