బాడీ స్క్రబ్

బాడీ స్క్రబ్

1 అరటిపండును మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో అరకప్పు బ్రౌన్ షుగర్, టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలపాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసి.. చర్మానికి పట్టించాలి. ఆరిపోయిన తర్వాత గుండ్రంగా 5నిమిషాలు స్క్రబ్ చేసి.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది.. చర్మానికి పోషణ అందిస్తుంది.

పెదాలకు

పెదాలకు

1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ పంచదార తీసుకుని.. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. టూత్ బ్రష్ ఉపయోగించి పెదాలకు మసాజ్ చేయాలి. ఇలా 2నిమిషాలు చేస్తే.. పెదవులు పింక్ అండ్ సాఫ్ట్ గా మారతాయి.

షేవింగ్ కి ముందు

షేవింగ్ కి ముందు

1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్, కొన్ని చుక్కల నీళ్లలో కలపాలి. ఒక నిమిషం పాటు మీ కాళ్లపై ఈ మిశ్రమంతో స్క్రబ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత షేవింగ్ చేసుకోవాలి. ఇలా చేస్తే.. అన్ వాంటెడ్ హెయిర్ ని లోపలి నుంచి తొలగించవచ్చు. అలాగే చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది.

పాదాలకు స్క్రబ్

పాదాలకు స్క్రబ్

1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్, టీస్పూన్ ఆరంజ్ పీల్ పౌడర్, టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. పాదాలపై రుద్దుకోవాలి. ఇలా 5నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బాడీ లోషన్ అప్లై చేయాలి.

స్కాల్ప్ స్ర్కబ్

స్కాల్ప్ స్ర్కబ్

2టేబుల్ స్పూన్ల కండిషనర్, 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్, అరకప్పు ఓట్ మీల్స్, కొన్ని చుక్కల పిప్పరమెంట్ ఆయిల్ తీసుకుని.. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ముందుగా జుట్టుని నీటితో తడుపుకుని, ఈ స్క్రబ్ అప్లై చేసి.. తర్వాత చేతి వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. 5 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

Read more about: beauty skin care home remedies beauty tips బ్యూటి అందం స్కిన్ కేర్ చర్మ సంరక్షణ షుగర్ హోం రెమిడీస్ బ్యూటి టిప్స్
English summary

Sugar Scrubs To Transform Your Winter Skin!

Sugar Scrubs To Transform Your Winter Skin! Energize, exfoliate and nourish your skin this winter with sugar scrubs!
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X