For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వన్ వీక్ లో డార్క్ నెక్ ను నివారించుకోవడానికి సింపుల్ గా బేకింగ్ సోడా చిట్కా..!!

మెడ నల్లగా ఉండటానికి కారణం ఏంటి? చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోనులు అసమతౌల్యత వల్ల ప్రెగ్నెన్సీ, స్మోకింగ్ ,ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడుతుంది.బేకింగ్ సోడా ఎ

|

అందమైన ముఖ సౌందర్యం...నాజూకైన బాడీ షేప్ కలిగి ఉండటం ఒక అద్రుష్టం. అయితే అందమైన ముఖ భాగం క్రింద మెడ నల్లగా కనబడితే ఎలా ఎంత అసహ్యాంగా ఉంటుంది. కాబట్టి అందం విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా, స్పాట్ లేస్, డార్క్ లెస్ స్కిన్ పొందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెడ నలుపు పోగొట్టుకోవడానికి బేకింగ్ సోడా ఏవిధంగా ఉపయోగపడుతుంది? బేకింగ్ సోడ నిజంగా మెడనలుపు తగ్గిస్తుందా...ఎన్ని రోజుల్లో ఆ ఎఫెక్టివ్ మార్పు కనిపిస్తుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

ప్రతి చర్మ సమస్యను నివారించుకోవడానికి ప్రతి సారి ఏదో ఒక పదార్థాన్ని ఎంపిక చేసుకోవడం మనకు అలవాటే,. అయితే, ఎంపిక చేసుకొనే విధానంలో పూర్తి అవగాహన కలిగి ఉండటం మరింత మంచిది. ఒక పదార్థాన్ని ఎంపిక చేసుకోవడానికి ముందుకు ఎందుకు, ఎప్పుడు, ఎలా..!ఇటువంటి ప్రశ్నలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అయితే వాటికి కొన్ని సందర్బాల్లో సమాధానం దొర్కపోవచ్చు.

 This Baking Soda Mask Can Get Rid Of Dark Neck In 7 Days!

ఇదే విషయంలోనే స్కిన్ కేర్ కోసం, డార్క్ స్కిన్ నివారించుకోవడం కోసం బేకింగ్ సోడాను ఎందుకు ఉపయోగించాలి? ఎప్పుడు ఉపయోగించాలి? ఎలా ఉపయోగించాలన్న విషయం తెలుసుండాలి. బేకింగ్ సోడా నిజంగా డార్క్ నెక్ ను నివారిస్తుందా..?

ముఖం అందంగా తెల్లగా ఉంటుంది. మెడ నల్లగా ఉండటానికి కారణం ఏంటి? చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోనులు అసమతౌల్యత వల్ల ప్రెగ్నెన్సీ, స్మోకింగ్ ,ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడుతుంది.

బేకింగ్ సోడా ఎలా ఉపయోగపడుతుంది? బేకింగ్ సోడా కొద్దిగా రఫ్ గా ఉండటం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది చర్మానికి కొద్దిపాటు ఎక్సఫ్లోయేషన్ ను కలిగిస్తుంది. డెడ్ స్కిన్ లేయర్స్ ను తొలగిస్తుంది. చర్మంను శుభ్రం చేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలుండటం వల్ల బ్యాక్టీరియాకు కారణమయ్యే ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

ఒక్క వారంలో తప్పనిసరిగా మార్పును గమనిస్తారు. స్కిన్ టోన్ లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ తప్పకుండా తొలగిపోతుంది. 2 లేద 3 నెలలో సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

ఎఫెక్టివ్ రిజల్ట్ పొందడానికి ముందు మెడ మీద ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఎలాంటి స్కిన్ ఇరిటేషన్ కలగకపోతే, బేకింగ్ సోడను నేచుగా డార్క్ నెక్ కు అప్లై చేయవచ్చు. వారంలో రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడా ఉపయోగించి మెడ నలుపు ఏవిధంగా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..

స్టెప్ # 1

స్టెప్ # 1

ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేయాలి. బేకింగ్ సోడ రఫ్ గా ఉన్నదాన్ని ఎంపిక చేసుకోవాలి. అయితే చర్మానికి హానికలించకుండా ఉన్నదాన్ని ఎంపిక చేసుకోవాలి.

స్టెప్ # 2

స్టెప్ # 2

అందులో అరటీస్పూన్ పెరుగు మిక్స్ చేసి రెండూ కలిసే వరకూ బాగా మిక్స్ చేయాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం యొక్క నలుపు తగ్గిస్తుంది. చర్మంను స్మూత్ గా మరియు బ్రైట్ గా మార్చుతుంది.

స్టెప్ # 3

స్టెప్ # 3

ప్రత్యామ్నాయంగా పెరుగుకు బదులు వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అయితే మరీ పల్చగా కాకుండి చిక్కగా పేస్ట్ లా ఉండేట్లు తయారుచేసి మెడ చుట్టూ అప్లై చేయాలి.

స్టెప్ # 4

స్టెప్ # 4

ఈ పేస్ట్ కు కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమం కలగలిపి, స్మూత్ గా తయారయ్యాక మెడకు అప్లై చేయాలి. కొబ్బరి నూనెలో ఉండే ల్యూరిక్ యాసిడ్ చర్మాన్ని క్లీన్ చేస్తుంది. చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది. బ్లాక్ హెడ్స్ తగ్గిస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ కూడా తొలగిస్తుంది.

 స్టెప్ # 5

స్టెప్ # 5

మైక్రో ఫైబర్ టవల్ తీసుకుని హాట్ వాటర్ లో డిప్ చేయాలి. ఎక్సెస్ వాటర్ ను పిండేయాలి. తర్వాత మెడచుట్టూ క్లీన్ గా తుడవాలి. ఒకటి రెండు నిముషాలు తుడిచిన తర్వాత టవల్లోని ఆవిరి కారణంగా చర్మ రంద్రాలు ఓపెన్ అవుతాయి, చర్మం శుభ్రపరడుతుంది. చర్మంలో నలుపు క్రమంగా తగ్గుతుంది.

స్టెప్ # 6

స్టెప్ # 6

ఈ మాస్క్ వేసుకోవడానికి ముందు ప్యాచ్ టెస్ట్, చేతికి వెనుక వైపున కొద్దిగా ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. స్కిన్ ఇరిటేషన్ లేదా ఇన్ఫ్లమేషన్ వంటి వాటికి రియాక్ట్ అవ్వలేదంటే , ఎలాంటి భయం లేకుండా మెడకు అప్లై చేసుకోవచ్చు.

 స్టెప్ # 7

స్టెప్ # 7

ఈ పేస్ట్ ను మెడ చుట్టూ అప్లై చేసి, సున్నితంగా మాసాజ్ చేసి ప్యాచ్ లు లేకుండా , గ్యాపులు లేకుండా పూర్తిగా అప్లై చేయాలి.

స్టెప్ # 8 :

స్టెప్ # 8 :

మెడకు ప్యాక్ వేసుకున్న 15 నిముషాల తర్వాత కొన్ని నీళ్ళు చిలకరించి సున్నితంగా సర్క్యులర్ పద్దతిలో మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి.

స్టెప్ # 9

స్టెప్ # 9

తర్వాత సాప్ట్ గా ఉండే టవల్ తీసుకుని మెడను తేమలేకుండా తుడవాలి. అయితే ఎక్కువ రబ్ చేయకూడదు.

స్టెప్ # 10

స్టెప్ # 10

తేమలేకుండా తుడిచిన తర్వాత బాడీలోషన్ ను అప్లై చేసుకోవాలి. బాడీలోషన్ జిడ్డుగా ఉన్నది ఎంపిక చేసుకోకూడదు. అలా చేస్తే ఆ ప్రాంతంలో మరింత జిడ్డుగా కనిపిస్తుంది.

హెచ్చరిక :

హెచ్చరిక :

మెడ బాగంలో గాయాలు లేదా మొటిమలు, ఇతర చర్మ సమస్యలున్నప్పుడు, డార్క్ నెక్ నివారించుకోవడానికి బేకింగ్ సోడా ఉపయోగించడం మానేయాలి.

English summary

This Baking Soda Mask Can Get Rid Of Dark Neck In 7 Days!

How to get rid of dark neck with baking soda? Is baking soda safe to use? How soon can you expect results? How often can you use? Every time we come across a new ingredient that has proven to bring any result in treating skin problem, our mind automatically boggles with questions - how, when, why! But, unfortunately, we have next to no answers.
Story first published: Wednesday, December 7, 2016, 13:16 [IST]
Desktop Bottom Promotion