For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తేనెలో మిరాకిల్ బ్యూటీ సీక్రెట్స్ ...!!

|

ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి. బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది, బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో! స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడే వాటిలో ఇది కూడా ఒకటి. . తేనే ప్రకృతి సిద్దం గా దొరికే అపురాపమైన ఔషధము . తేనెటీగలు రకరకాల పుల మకరందాలను పోగు చేసి తేనే రూపము లో మనకి (వాటికోసమే అనుకోండి) అందిస్తున్నాయి . స్వీట్ హానీ(తియ్యని తేనె)అంటే ఎవరి ఇష్టం ఉండదు చెప్పండి. తేనెను వివిధ రకాలుగా తీసుకుంటున్నారు, ఈ స్వీట్ హనీని వివిధ రకాలుగా ఎలా తీసుకోవాలో? ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో అన్న విషయం చాలా మందికి తెలియదు.

తేనే లో ఉన్న విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతే కాదు, తేనె సౌందర్యానికి కూడా చాల గ్రేట్ గా సహాయపడుతుందు. సౌందర్యం మెరుగుపరుచుకోడానికి కూడా తేనె వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే తేనెలో నేచురల్ ఔషధగుణాలు, సౌందర్య లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల తేనెను సౌంద్యంలోని కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. తేనెను సౌందర్యానికి ఏవిధంగా ఉపయోగించాలో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

 లిప్ స్ర్కబ్ :

లిప్ స్ర్కబ్ :

కొబ్బరి నూనె మరియు తేనె కాంబినేషన్ లో పెదాలకు మాయింశ్చరైజింగ్ గా ఉపయోగించుకోవచ్చు . తేనెలోని తియ్యదనం పెదాలకు ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు రిఫ్రెష్ గా కనబడుటకు సహాయపడుతుంది.

కాఫీ తేనె-షుగర్ స్ర్కబ్:

కాఫీ తేనె-షుగర్ స్ర్కబ్:

ఈ మూడింటి కాబినేషన్లో ఫేస్ స్క్రబ్ చేస్తే చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఎక్స్ ఫ్లోయేటింగి, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి..

దాల్చిన్ చెక్క మరియు తేనె :

దాల్చిన్ చెక్క మరియు తేనె :

దీన్ని చూడటానికి కొద్దిగా మడ్డగా ఉంటుంది. కానీ ఈ రెండింటి కాంబినేషన్ బ్లాక్ హెడ్స్ కు చెక్ పెట్టవచ్చు. దాల్చిన చెక్కను పౌడర్ గా చేసి తేనెలో మిక్స్ చేసి చర్మానికి పట్టించాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల బ్లాక్ హెడ్స్ నివారించబడుతాయి.

చర్మాన్ని తెల్ల మరియు టైట్ గా మార్చే ఫేస్ మాస్క్:

చర్మాన్ని తెల్ల మరియు టైట్ గా మార్చే ఫేస్ మాస్క్:

తేనెలో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మం యొక్క రంగును మార్చుతుంది మరియు మొటిమలు మరియు మచ్చనలు మరియు ముఖంలో ఛారలను నివారిస్తుంది. నిమ్మరసం సున్నితమైన చర్మాన్నిబర్న్ చేస్తుంది. కాబట్టి, నిమ్మరసంకు బదులు తేనెను ఉపయోగించుకోవాలి.

అవొకాడో -హానీ మాస్క్:

అవొకాడో -హానీ మాస్క్:

అవొకాడోను మెత్తగా పేస్ట్ చేసి అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మం సున్నితంగా, నునుపుగా మారుతుంది. అంతే కాదు చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అవొకాడోలో ఉండే పోషకాలు, చర్మానికి తగిన పోషకాలను అందిస్తుంది.

గుమ్మడికాయ గుజ్జును లిప్ బామ్ గా:

గుమ్మడికాయ గుజ్జును లిప్ బామ్ గా:

ఇది ఒక స్వీట్ లిప్ బామ్ సూపర్ మాయిశ్చరైజర్ మరియు అంతే కాదు, దీన్ని మనం తినవవచ్చు కూడా . గుమ్మడికాయ గుజ్జులో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసి పెదాలకు లిప్ బామ్ ల అప్లై చేస్తే పెదాలు, సున్నితంగా కాంతివంతంగా మారుతాయి..

ఓట్ మీల్ హనీ ఫేస్ స్క్రబ్:

ఓట్ మీల్ హనీ ఫేస్ స్క్రబ్:

ఈ రెండింటి కాంబినేషన్ లో చర్మానికి ఫేస్ స్ర్కబ్ గా ఉపయోగిస్తే ఇది స్కిన్ క్లెన్సర్ గా పనిచేస్తుంది . ముఖ్యంగా ఈ రెండింటి కాంబినేషన్ ను డ్రై వింటర్ నెలల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖంగా ఈ స్ర్కబ్బింగ్ వల్ల చర్మం యొక్క దురదను నివారించుకోవచ్చు..

తేనె హెయిర్ మాస్క్ :

తేనె హెయిర్ మాస్క్ :

హనీ షాంపుగురించి మీరు తెలుసుకున్నారు కాదా. అలాగే హానీ హెయిర్ మాస్క్ మీ జుట్టుకు కూడా ఒక చౌకైన హెల్తీ ప్రొడక్ట్ గా ఉపయోగిస్తుంటారు,. వివిధ రకాల హెయిర్ మాస్క్ లో తేనెను ఉపయోగిస్తుంటారు . ఇది జుట్టుకు మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తుంది.

తేనెతో బాడీ వాష్:

తేనెతో బాడీ వాష్:

అన్ని రకాల బాడీ వాష్ క్రీములు లేదా నేచురల్ బాడీవాష్ లలో కూడా తేనెను మిక్స్ చేసి ఉంటారు. అలాంటి ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల ఇది చర్మాన్ని చాలా సెన్సిటివ్ గా మరియు క్లీన్ గా మార్చుతుంది.

 తేనె మరియు దాల్చిన చెక్క పొడిని హెయిర్ ట్రీట్మెంట్ గా :

తేనె మరియు దాల్చిన చెక్క పొడిని హెయిర్ ట్రీట్మెంట్ గా :

దాల్చిన చెక్క స్కిన్ డ్యామేజ్ ను అరికడుతుంది. దాంతో పాటు జుట్టుకు తగినంత పోషక లక్షణాలను అందిస్తుంది. ఎందుకంటే ఈ దాల్చిన చెక్కలో ఉండే లక్షణాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. హనీ మాస్క్ ను జుట్టుకు వేసుకోవడం వల్ల ఇది జుట్టుకు ఎక్కువ బలాన్ని చేకూర్చుతుంది.

English summary

Ways to Add Honey to Your Beauty Routine

Who doesn’t love honey? Maybe the most multi-talented edible we’ve come across, this sweetness can be put to use in more ways than we ever (ever) thought possible. It’s good for everything from cocktails to pumpkin seeds, comes in handywhen you’ve got a cold and has been known to pair well with hemp, chapped lipsand chia seeds.
Story first published: Sunday, August 14, 2016, 17:04 [IST]
Desktop Bottom Promotion